For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాటా టెలీ సర్వీసెస్‌‌ అమ్మకాన్నిసెటిల్ చేసిన టాటా గ్రూపు, ప్రభుత్వానికి రుణదాతలకు భారీగా చెల్లింపులు

|

ముంబై: టాటా గ్రూప్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఉన్న ప్రముఖ మొబైల్ సంస్థ టాటా డొకొమోను పూర్తిగా భారతీ ఎయిర్‌టెల్‌ సంస్థకు అమ్మివేసినట్లు పేర్కొంది. రెండేళ్ల క్రితమే టాటా డొకొమోను భారతీఎయిర్‌టెల్‌కు విక్రయిస్తున్నట్లు ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. ఇక పూర్తిగా విక్రయిస్తున్నట్లు చెప్పేందుకు టాటా గ్రూప్ రుణదాతలకు, ప్రభుత్వానికి సుమారు రూ.50వేల కోట్లు చెల్లించింది. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ టాటా డొకొమోను నడుపుతోంది. కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖకు ఈ గ్రూపు గత నెలలో రూ. 10వేల కోట్లు చెల్లించింది. అంతకుముందు రూ.40 వేల కోట్లు పెండింగ్ రుణాలను కూడా క్లియర్ చేసింది.

టాటాగ్రూపు మొబైల్ నెట్‌వర్క్‌కు సంబంధించి ఉన్న అన్ని రుణాలను చెల్లించివేసినట్లు టాటా గ్రూప్ ప్రతినిధి ఒకరు ఈమెయిల్ చేశారు. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో టెలికాం రంగంలో విప్లపం తీసుకురావడంతో ఆ దెబ్బకు అన్ని ప్రధాన టెలికాం కంపెనీలు తమ ధరలను తగ్గించుకోగా మరికొన్ని కంపెనీలు దాదాపు మూతపడే స్థాయికి వచ్చేశాయి. ఇందులో ఒకటి టాటా డొకొమో. ఉచిత వాయిస్ కాలింగ్, తక్కువ ధరకే మొబైల్ డేటా అందించడంతో ఇతర నెట్‌వర్క్‌లు భారీ నష్టాలను చవిచూశాయి. దీంతో శత్రు సంస్థలతో చేతులు కలిపాయి.

Tata completes the sale of mobile business,settles Rs.50000 crore to lenders and govt

సాల్ట్ నుంచి సాఫ్ట్‌వేర్‌ వరకు అన్ని రంగాల్లో లాభాలు ఆర్జించిన టాటా సంస్థ.. ఒక్క టెలికాం రంగంలో మాత్రం అనుకున్నంత స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయింది. నష్టాల బాట పడుతుండటంతో 2017 అక్టోబరులో టాటా టెలీసర్వీసెస్‌ను సునిల్ మిట్టల్ భారతీ ఎయిర్‌టెల్‌కచు అమ్మాలని భావించి ఒప్పందం కుదుర్చుకుంది. భారతీ ఎయిర్‌టెల్, జియోలను మినహాయిస్తే ఇంకా వొడాఫోన్ సంస్థలో కుమారమంగళం బిర్లాకు చెందిన ఐడియా సెల్యులర్ కూడా విలీనం అయ్యింది.

English summary

టాటా టెలీ సర్వీసెస్‌‌ అమ్మకాన్నిసెటిల్ చేసిన టాటా గ్రూపు, ప్రభుత్వానికి రుణదాతలకు భారీగా చెల్లింపులు | Tata completes the sale of mobile business,settles Rs.50000 crore to lenders and govt

Tata Group paid lenders and the government about ₹50,000 crore ($7.3 billion) to help complete the sale of its mobile-phone services business to Bharti Airtel Ltd., a deal that was announced almost two years ago.
Story first published: Monday, July 8, 2019, 20:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X