For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొబైల్ పోయిందా? ఇకపై ఏ సిమ్ వేసినా ఫోన్ పనిచేయదు!

By Chanakya
|

మొబైల్ పోయిందా ? అందులో ఉన్న మీ డేటాపై ఆందోళన ఉందా ? ఇకపై మీ డేటా గురించి ఆందోళన వద్దే వద్దు.. అంతే కాదు.. పోయిన మీ ఫోన్‌ను ఇకపై మళ్లీ ఎవరూ వాడే అవకాశమే లేకుండా చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. త్వరలో రాబోతున్న కొత్త ట్రాకింగ్ వ్యవస్థతో ఇకపై మొబైల్ దొంగతనాలకు పూర్తిగా పుల్ స్టాప్ పడేట్టు కనిపిస్తోంది.

మీ కార్డులను కాపాడుకోవచ్చు ఇలా..మీ కార్డులను కాపాడుకోవచ్చు ఇలా..

వచ్చే నెలలోనే..

వచ్చే నెలలోనే..

కేంద్ర ప్రభుత్వానికి చెందిన ది సెంటర్ ఆఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సి-డాట్)ఆధ్వర్యంలో కొత్త సేవలను ఆగస్టులో లాంఛ్ చేయబోతోంది. ఇప్పటికే టెక్నాలజీని రెడీ చేసిన సి-డాట్ కేవలం కేంద్ర మంత్రి అనుమతి కోసం వేచి ఉంది. పార్లమెంటు సమావేశాలు జూలై 26వ తేదీన పూర్తైన వెంటనే.. మంత్రిని కలిసి సేవల ప్రారంభ తేదీని ప్రకటించబోతున్నారు.

ఏంటీ టెక్నాలజీ

ఏంటీ టెక్నాలజీ

సి-డాక్ రూపొందించిన కొత్త టెక్నాలజీ పేరు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెండిటీ రిజిస్టర్ (సీ.ఈ.ఐ.ఆర్.). ఇది మొబైల్ దొంగతాలను పూర్తిగా అడ్డుకట్ట వేసే బ్రహ్మాస్త్రం లాంటిది. ఇందుకోసం కేంద్రం రూ.15 కోట్లను ఖర్చు చేసేందుకు సమాయత్తమవుతోంది.

ఈ సిస్టమ్ ప్రకారం పోయిన లేదా దొంగలించబడిన మొబైల్ వివరాలన్నీ దేశవ్యాప్తంగా ఏకీకృతం చేస్తుంది. ఐఎంఈఐ నెంబర్‌ను ఆధారంగా తీసుకుని ఇక ఏ నెట్వర్క్ సిమ్ అందులో వేసినా ఫోన్ పనిచేయదు. ఎందుకంటే.. ఈ ఐఎంఈఐ డేటానంతటినీ అన్ని టెలికాం ఆపరేటర్ల దగ్గర ఉంటుంది. ఒకసారి ఈ రిజిస్ట్రీలో మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెండిటీ నమోదైన తర్వాత ఇక ఏ సిమ్ కార్డ్ వేసినా పనిచేయదు.

ఏంటి దీని వల్ల ప్రయోజనం

ఏంటి దీని వల్ల ప్రయోజనం

పోయిన మన మొబైల్‌ను ఎవరూ వాడుకోవడానికి అవకాశం ఉండదు. ఇది ఫస్ట్ బెస్ట్ థింగ్. వాడుకోవడానికో, లేదా అమ్ముకోవడానికో మొబైల్‌ను దొంగతనం చేసే వారు ఇక ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒకసారి కేంద్ర ప్రభుత్వ సంస్థ దగ్గర ఈ నెంబర్ రిజిస్టర్ అయితే ఇక ఏ నెట్వర్క్ సిమ్ పనిచేయదు.

మరొక అంశం.. దుర్మార్గుల చేతుల్లోకి మన ఫోన్ వెళ్లకుండా ఇది అడ్డుపడ్తుంది. మొబైల్ ఫోన్లు దొంగతనం చేసి వాటి ద్వారా అక్రమంగా కాల్స్ చేసుకునే అక్రమ మార్గానికి కూడా బ్రేక్ పడ్తుంది.

మొత్తం సెంట్రలైజ్డ్ వ్యవస్థ కావడం వల్ల దేశంలో ఉన్న మొబైల్ ఆపరేటర్స్ అందరికీ దీని యాక్సెస్ ఉంటుంది. అందుకని వేగంగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది.

ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ) అంటే ప్రతీ మొబైల్ ఫోన్‌కూ యూనిక్‌గా వచ్చే 15 డిజిట్ సీరియల్ నెంబర్. దీన్ని ప్రపంచ ఇండస్ట్రీ బాడీ అయినా జీఎస్ఎంఏ ధృవీకరిస్తుంది.

English summary

మొబైల్ పోయిందా? ఇకపై ఏ సిమ్ వేసినా ఫోన్ పనిచేయదు! | Soon technology to enable detection of lost or stolen mobile phones

The government will launch a technology solution next month to enable detection of lost or stolen mobile phones that are operating in the country, an official said. The tracking system would make the detection of stolen mobile phones possible even if the SIM card is removed or unique code IMEI number is changed, the official revealed.
Story first published: Monday, July 8, 2019, 15:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X