For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తప్పుడు సమాచారంపై జాగ్రత్త: కస్టమ్స్ ఆఫీసర్లకు మరిన్ని పవర్స్

|

న్యూఢిల్లీ: తాజా కేంద్ర బడ్జెట్ కస్టమ్స్ ఆఫీసర్లకు మరిన్ని పవర్స్ ఇచ్చిందని ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆదాయ ప్రయోజనాలు లేదా అక్రమ రవాణాను నిరోధించే ఉద్దేశ్యంలో భాగంగా ఎవరినైనా అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం కల్పించిందని అంటున్నారు. అయితే ఇది దుర్వినియోగానికి గురయ్యే అవకాశం కూడా లేదని అంటున్నారు.

ఆదాయపన్ను నిబంధనల్లో మార్పులు ఇవే...: బ్యాంక్ విత్‌డ్రా రూ.1 కోటి దాటితే 2 శాతం TDSఆదాయపన్ను నిబంధనల్లో మార్పులు ఇవే...: బ్యాంక్ విత్‌డ్రా రూ.1 కోటి దాటితే 2 శాతం TDS

తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు

తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు

అలాంటి వ్యక్తులు తమ ఆధార్, ఇతర వివరాలు సమర్పించవలసి ఉంటుంది. తప్పుడు సమాచారం ఇస్తే కనుక కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. రీఫండ్‌ను నిలిపివేయడం, కస్టమ్స్ యాక్ట్ కింద ఇచ్చిన రిజిస్ట్రేషన్‌పై సస్పెన్షన్ విధించడం వంటి చర్యలకు ఆస్కారం ఉందని చెబుతున్నారు. ఈ నియమాలు దుర్వినియోగమయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇలాంటి చర్యల వల్ల స్మాల్ ఇండస్ట్రీ సౌకర్యంగా ఉండలేదని, ఇది సరైన విధానం కాదని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (FISME) ప్రెసిడెంట్ చెప్పారని ఇంగ్లీష్ మీడియా పేర్కొంది.

తీవ్ర చర్యలు

తీవ్ర చర్యలు

కొన్ని బోగస్ సంస్థలు రాయితీలు, ఎగుమతి ప్రోత్సాహకాలు పొందేందుకు అక్రమ మార్గాల్లో వెళ్తున్నాయని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటామని, అలాంటి నేరాలకు పాల్పడితే జరిమానా, ప్రాసిక్యూషన్ వంటి అంశాలను నిబంధనల్లో చేర్చినట్లు చెప్పారు. దుర్వినియోగానికి పాల్పడితే నాన్ బెయిలబుల్ నేరంగా చూడనున్నారు. ఇటీవల కొన్ని కంపెనీలు కొందరు ట్రేడర్స్ ప్రభుత్వాన్ని చీట్ చేసిన విషయం వెలుగు చూసింది.

చిన్న వ్యాపారులకు వరాలు

చిన్న వ్యాపారులకు వరాలు

అదే సమయంలో చిన్న వ్యాపారులకు బడ్జెట్‌లో వరాలు ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలోని సుమారు 3 కోట్ల చిన్న వ్యాపారులకు పెన్షన్ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. వార్షికాదాయం రూ.1.5 కోట్ల కంటే తక్కువ ఉన్న రిటైల్ వ్యాపారులు, దుకాణ యజమానులకు ప్రయోజనాలు కల్పిస్తామన్నారు. ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన కింద ఈ కొత్త పెన్షన్ పథకం రానుంది. జీఎస్టీ కింద రిజిస్టర్ చేసుకున్న మధ్యశ్రేణి సంస్థలకు 2 శాతం వ్డీతో రుణాలు కూడా ఇవ్వనున్నారు. ఇందుకోసం రూ.350 కోట్ల నిధులను కేటాయించారు. నిధుల సమీకరణ కోసం సోషల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ ఏర్పాటు చేయనున్నారు.

జీఎస్టీ రిటర్న్స్ సరళతరం

జీఎస్టీ రిటర్న్స్ సరళతరం

పన్ను విధానాల్లో సవరణలు చేయని కేంద్రం, జీఎస్టీకి సంబంధించి మాత్రం కొన్ని సవరణలు చేసింది. జీఎస్టీ రిటర్న్స్ విధానాన్ని సరళతరం చేసింది. జీఎస్టీ పరిధిలోకి వచ్చే వ్యాపారస్తుల టర్నోవర్ ఇదివరకు రూ.20 లక్షలు ఉండగా తాజాగా రూ.40 లక్షలకు ఇది వరకే పెంచారు. తాజా బడ్జెట్‌లో రూ.5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్న వారు 3 నెలకోసారి రిటర్న్స్ దాఖలు చేయవచ్చు. రిటర్న్స్ ఫైల్ చేసేందుకు చిన్న వ్యాపారుల కోసం ఉచితంగా అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వివిధ రకాల పన్ను లెడ్జర్లను ఒకే గొడుకు కిందకు తీసుకొస్తారు. ఈ-ఇన్వాయిస్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. ఇది పన్ను చెల్లింపుదారులకు రిటర్న్స్ దాఖలు సమయంలో ఉపయోగపడుతుంది. ఇది అమల్లోకి వస్తే ఈ-వే బిల్లు అవసరం లేదు. జనవరి 2020 నుంచి అమల్లోకి వస్తుంది.

English summary

తప్పుడు సమాచారంపై జాగ్రత్త: కస్టమ్స్ ఆఫీసర్లకు మరిన్ని పవర్స్ | Union Budget gives more powers to customs officers

It is said that, Union Budget gives more powers to customs officers. The Budget proposal has authorised customs officers.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X