For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్త టెక్నాలజీలు: మహిళా ఉద్యోగులకు సవాళ్లు?

By Jai
|

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కంపెనీలు కొత్త టెక్నాలజీలను అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇటీవల ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, వర్చ్యువల్ రియాలిటీ, డిజిటల్ మార్కెటింగ్ వంటి కొత్త టెక్నాలజీలు వచ్చి చేరాయి. అయితే ఈ టెక్నాలజీలు మహిళా ఉద్యోగులకు కొత్త సవాళ్లు విసురుతున్నట్లు వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. కొత్తగా ఉద్యోగం లో చేరే మహిళల తో పాటు, వివిధ కారణాలతో కొంత కాలం ఉద్యోగాలకు దూరంగా ఉన్న మహిళలు కెరీర్ రీ ఎంట్రీ ఇవ్వడం లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది సారాంశం.

మూడు నాలుగేళ్ల క్రితం వరకు ఇప్పుడు వినిపిస్తున్న టెక్నాలజీలు ఎవరికీ పెద్దగా పరిచయం లేనివే. ఆ సమయం లో ఏదేని కారణం తో ఉద్యోగాలు మానేసిన వారికి , ఇప్పుడు రే ఎంట్రీ అంటే కష్టమే. టెక్నాలజీ మారటమే ఇందుకు ప్రధాన కరంగా చెబుతున్నారు. ఉదాహరణకు రెండు దశాబ్దాలుగా ఒక వెలుగు వెలిగిన సాఫ్ట్ వేర్ టెస్టింగ్ జాబ్స్ ఇప్పుడు ఆటోమేషన్ దిశగా వేగంగా మారిపోయింది. మానుల్ టెస్టింగ్ లో క్యారీ ప్రారంభించి మధ్యలో మానేసిన మహిళా ఉద్యోగులకు ఇప్పుడు ఆటోమేషన్ రంగ ప్రవేశం తో కొత్తగా వాటిని నేర్చుకోక తప్పనిసరి ఐంది. అలాగే , సాధారణ మార్కెటింగ్ రంగంలో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వేగంగా విస్తరిస్తోంది. ఇలాగె ప్రతీ సెగ్మెంట్ లోనూ కొత్త సవాళ్లు ఎదురు అవుతున్నాయి.

మీ కార్డులను కాపాడుకోవచ్చు ఇలా..మీ కార్డులను కాపాడుకోవచ్చు ఇలా..

Challenges for Women with technology

పని ప్రాంతాల్లో జెండర్ ఈక్వాలిటీ ఉండాలని ప్రపంచ వ్యాప్తంగా బహుళ జాతి కంపెనీలు మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తుంటాయి. అందుకే మధ్యలో ఉద్యోగాలు మానేసిన మహిళలకు మళ్ళీ రే ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తుంటాయి. ఇందులో మైక్రోసాఫ్ట్, ఐబీఎం , ఇంగెర్సొల్ రాండ్ వంటి కంపెనీలు ప్రధాన వరుసలో ఉన్నట్లు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. గ్లోబల్ జెండర్ గ్యాప్ నివేదిక ప్రకారం ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ రంగంలో మహిళా ఉద్యోగుల సంఖ్యా కేవలం 22% కాగా, పురుషుల నిష్పత్తి 78% ఉండటం ఇదే ట్రెండ్ ను సూచిస్తోందని ఈ పత్రిక వెల్లడించింది.

చెన్నై కి చెందిన అవతార్ గ్రూప్ కన్సల్టెన్సీ నివేదిక ప్రకారం భరత్ లోని ప్రధాన పట్టణాలు, నగరాల్లో దాదాపు 2 కోట్ల మంది మహిళలు ఉద్యోగాలు చేస్తుండగా, అందులో కనీసం 70 లక్షణాలకు పైగా మంది ఉద్యోగాలు వివిధ కారణాలతో మధ్యలో మానేస్తున్నారట. వీరందరికి మళ్ళీ కెరీర్ ను ప్రారంభించే అవకాశం ఉంటుందని పేర్కొన్నట్లు ది ఎకనామిక్ టైమ్స్ తెలిపింది.

మిగితా రంగాలతో పోలిస్తే సాఫ్ట్ వేర్, ఐటీ రంగం లో మహిళా ఉద్యోగుల సంఖ్యా అధికంగానే ఉంటుంది. ఐనా కూడా కొత్త టెక్నాలజీలు వారికీ సవాళ్లు విసురుతుండటంతో మొత్తంగా జెండర్ ఈక్వాలిటీ దెబ్బతింటోందనేది నిపుణుల మాట.

English summary

కొత్త టెక్నాలజీలు: మహిళా ఉద్యోగులకు సవాళ్లు? | Challenges for Women with technology

Challenges for employee Women with new technology. Overcoming challenges facing Women in Technology. Despite progress in employment gender equality, men continue to substantially.
Story first published: Monday, July 1, 2019, 7:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X