For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెలంగాణ, హైదరాబాద్ జీఎస్టీ రికార్డ్: ఇండియాలో 4% రెవెన్యూ

|

న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (GST)లో రెవెన్యూలో తెలంగాణ రాష్ట్రం భారీ వసూళ్లు చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు రూ.36,212 కోట్లు ఇది భారత్ దేశంలోని మొత్తం జీఎస్టీ వసూళ్లలో 4 శాతం కావడం గమనార్హం. అలాగే, హైదరాబాద్ జోన్... జీఎస్టీ వసూలు మంత్లీ యావరేజ్ పెరుగుదలలో ముందు నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే మంత్లీ యావరేజ్ వసూళ్లు ఇక్కడ 28 శాతం పెరిగాయి.

డబ్బు సంపాదించడం ఎలా?, మీకు ఫేస్‌బుక్ ఫ్రీగా చెప్పనుందిడబ్బు సంపాదించడం ఎలా?, మీకు ఫేస్‌బుక్ ఫ్రీగా చెప్పనుంది

హైదరాబాద్ జోన్ టాప్!

హైదరాబాద్ జోన్ టాప్!

దేశంలోని ట్యాక్స్ పేయర్స్‌లో తెలంగాణలోనే దాదాపు మూడు శాతం మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. సెంట్రల్ జీఎస్టీ అధికారులు రూ.19,420 టార్గెట్ పెట్టుకోగా రూ.18,565 కోట్ల జీఎస్టీ రెవెన్యూ వచ్చింది. అలాగే, 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను పెండింగ్ ట్యాక్స్‌కు సంబంధించిన వాటిలో అత్యధిక రికవరీలో హైదరాబాద్ జోన్ మొదటి స్థానంలో ఉంది. రూ.175 కోట్ల బకాయిలు వసూలయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో బకాయిల వసూలులో హైదరాబాద్ జోన్ మొదటి స్థానంలో నిలిచింది.

రికవరి, ఫేక్ ఇన్వాయిస్...

రికవరి, ఫేక్ ఇన్వాయిస్...

ఇదిలా ఉండగా, జీఎస్టీ హైదరాబాద్ జోన్ అధికారులు రూ.458 కోట్లు ఫేక్ ఇన్వాయిస్ కేసులు గుర్తించారు. ఇందులో రూ.272 కోట్లు వసూలయ్యాయి. మే 31, 2019 నాటికి హైదరాబాద్ జోన్‌లో ఫేక్ ఇన్వాయిస్ కేసులలో 36 కంపెనీలు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ అమౌంట్ రూ.277 కోట్లుగా గుర్తించారు ఇందులో రూ.34 కోట్లు రికవరీ చేశారు. జీఎస్టీ యాంటీ ఎవాషియన్ కేసు (జీఎస్టీ ఎగవేతదారులు) కింద పదిహేను మందిని అరెస్ట్ చేశారు.

కన్స్యూమర్లకు జీఎస్టీ ప్రయోజనాలు

కన్స్యూమర్లకు జీఎస్టీ ప్రయోజనాలు

జీఎస్టీ ప్రిన్సిపల్ కమిషనర్, హైదరాబాద్, ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ... జీఎస్టీ ప్రయోజనాలను కన్స్యూమర్లకు అందించాలని, అలా అందించని వారి పైన కేసులు పెడుతున్నామని చెప్పారు. ముఖ్యంగా జీఎస్టీ రేట్ తగ్గింపు ప్రయోజనాలు సినీ ప్రేక్షకులకు అందేలా థియేటర్లపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

English summary

తెలంగాణ, హైదరాబాద్ జీఎస్టీ రికార్డ్: ఇండియాలో 4% రెవెన్యూ | Telangana nets Rs.36,000 crore revenue through GST, 4% of India's revenue

The state has collected Rs 36,212 crore through GST in 2018-19 financial year which is 4 per cent of the overall GST revenues in the country.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X