For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్త రైడ్ హైరింగ్ యాప్: హైదరాబాద్‌వాసులకు, క్యాబ్ డ్రైవర్లకు గుడ్‌న్యూస్

|

హైదరాబాద్: రైడ్ హైరింగ్ సర్వీసుల్లోకి మరో కొత్త సంస్థ వచ్చింది. యాప్ ఆధారిత సంస్థ టోరా క్యాబ్స్ హైదరాబాదులో అడుగు పెట్టింది. కొరియా సంస్థ భాగస్వామ్యంతో ఏర్పాటైన టోరా క్యాబ్స్ టెక్నాలజీస్ సర్వీసెస్ అనే సంస్థ దేశీయంగా క్యాబ్ సర్వీసులను ఇదివరకే ప్రారంభించింది. తాజాగా హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది.

తిరస్కరిస్తే.. క్రెడిట్ కార్డ్ కోసం మళ్లీ దరఖాస్తు చేయొచ్చాతిరస్కరిస్తే.. క్రెడిట్ కార్డ్ కోసం మళ్లీ దరఖాస్తు చేయొచ్చా

రోజుకు రూ.199 చెల్లిస్తే చాలు

రోజుకు రూ.199 చెల్లిస్తే చాలు

మొబైల్‌ యాప్‌ ఆధారిత క్యాబ్‌ సేవల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాలనేది తమ లక్ష్యమని సంస్థ డైరెక్టర్ ఎస్‌బీ షిన్‌, మార్కెటింగ్ డైరెక్టర్ కవితా భాస్కరన్ తెలిపారు. తమ క్యాబ్‌ డ్రైవర్లు వినియోగదార్ల నుంచి వసూలు చేసే మొత్తంలో తాము ఎటువంటి కమీషన్‌ తీసుకోవడం లేదని చెప్పారు. తమకు రోజు వారీ చందా రూ.199 చొప్పున నెలలో 25 రోజులకు మాత్రమే చెల్లిస్తే సరిపోతుందన్నారు. దీంతో క్యాబ్‌ డ్రైవర్లకు ఎక్కువ ఆదాయం మిగులుతుందని చెప్పారు.

ప్రయాణీకులకు ప్రయోజనం

ప్రయాణీకులకు ప్రయోజనం

అలాగే, ప్రయాణీకులపై కూడా తాము భారం మోపదలుచుకోలేదని చెప్పారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో పలు రైడ్ హైరింగ్ యాప్ సంస్థలు ధరలు పెంచుతాయి. కానీ అలాంటి సందర్భాల్లో అధిక ఛార్జీలు వసూలు చేయమని చెప్పారు. ఈ కొత్త పద్ధతుల ద్వారా క్యాబ్‌ సేవల రంగంలో మార్పులు తీసుకురావాలనేది తమ ఉద్దేశమన్నారు. ప్రయాణీకుల నుంచి సర్ ఛార్జ్ వసూలు చేయమన్నారు. మినిమం చార్జీగా 3 కిలో మీటర్లకు రూ.39 వసూలు చేస్తామని, ఆ తర్వాత ఒక్కో కిలోమీటరుకు రూ.8 విధిస్తామన్నారు.

క్యాబ్ డ్రైవర్లకూ ప్రయోజనం

క్యాబ్ డ్రైవర్లకూ ప్రయోజనం

టోరా క్యాబ్స్ సబ్‌స్క్రిప్షన్ కోసం డ్రైవర్లు రోజువారీ అయితే రూ.199, వారానికి రూ.199X6 చెల్లించాలి. ఒకరోజు మినహాయింపు ఇస్తారు. నెలకు రూ.199X25 చెల్లించాలి. నెలకు ఐదురోజులు మినహాయింపు ఉంటుంది. ఇక్కడ కమిషన్ మోడల్ కాకుండా, రోజుకు రూ.199 చెల్లిస్తే సరిపోతుంది. కంపెనీ నుంచి డ్రైవర్లు 5 లక్షల ఇన్సురెన్స్ పొందుతారు. ఈ నెలలోనే హైదరాబాద్‌లో సేవలు ప్రారంభించిన తమకు ఇప్పటికే 1,500 మంది క్యాబ్ డ్రైవర్లు ఉన్నారని, ఈ సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. రానున్న 45 రోజుల్లో 4వేలకు చేరుతుందన్నారు. ఓలా, ఉబేర్ క్యాబ్‌లకు ఇది

English summary

కొత్త రైడ్ హైరింగ్ యాప్: హైదరాబాద్‌వాసులకు, క్యాబ్ డ్రైవర్లకు గుడ్‌న్యూస్ | Tora Cabs launches ride hailing service in Hyderabad

Toracabs Technology Services Private Limited, a New Delhi-based technology company, on Thursday announced the launch of Tora Cabs, an app-based ride hailing platform in Hyderabad.
Story first published: Friday, June 28, 2019, 17:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X