For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డేటా భారత్‌లోనే స్టోర్ చేయాలి: ఆర్బీఐ

|

న్యూఢిల్లీ: డేటా ప్రొటక్షన్ పాలసీపై అభ్యంతరాలు సమర్పించాలని కంపెనీలకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చెప్పిన వారం రోజులకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI).. చెల్లింపులకు సంబంధించిన మొత్తం డేటాను భారత్‌లోనే స్టోర్ చేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ విదేశాల్లో ప్రాసెసింగ్ చేసిన పక్షంలో ఆ డేటాను 24 గంటల్లోగా భారత్‌కు తీసుకు రావాలని పేమెంట్ సిస్టం ఆపరేటర్లకు స్పష్టం చేసింది.

చెల్లింపుల వ్యవస్థకు సంబంధించిన మొత్తం డేటాను అందరు సిస్టమ్ ప్రొవైడర్లు ఆరు నెలల్లోగా భారత్‌లోనే నిల్వ చేయాలని గత ఏడాది ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ప్రీక్వెట్లీ ఆస్క్‌డ్ క్వశన్స్ రూపంలో ఆర్బీఐ పలు అంశాలు వెల్లడించింది. భారత్ వెలుపల చెల్లింపు లావాదేవీల ప్రాసెసింగ్‌పై ఎటువంటి నిషేధం లేదని, కానీ ప్రాసెసింగ్ తర్వాత ఆ డేటాను భారత్‌లో మాత్రమే నిల్వ చేయాలని పేర్కొంది. మొత్తం లావాదేవీల వివరాలు ఆ డేటాలో భాగంగా ఉండాలని తెలిపింది.

RBI Clarifies That Payments Data Must Be Stored In Systems Located In India

ప్రాసెసింగ్‌ను విదేశాల్లో జరిపిన పక్షంలో ఇరవై నాలుగు గంటల్లో లేదా ఒక పని దినంలోగా ఏది ముందు అయితే ఆ పద్ధతిలో డేటాను భారత్‌కు తెప్పించాలని పేర్కొంది. లావాదేవీలకు సంబంధించిన మొత్తం వివరాలు, సమాచారం అన్నీ కూడా డేటాలో భాగమేనని పేర్కొంది. ఇందులో వినియోగదారు పేరు, మొబైల్‌ నెంబర్, ఈ-మెయిల్‌, ఆధార్, పాన్‌కార్డు వంటి సమాచారం, చెల్లింపు సమాచారం, ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్ వంటి చెల్లింపు వివరాలు, లావాదేవీల సమాచారం వంటివి ఉంటాయి.

డేటాను దేశం వెలుపల నిల్వ చేసుకోవడానికి అనుమతి ఉన్న విదేశీ బ్యాంకుల వంటి సంస్థలు మాత్రం యథావిధిగా తమ విధానాన్ని కొనసాగించవచ్చని తెలిపింది. భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న గూగుల్‌, మాస్టర్ కార్డ్‌, వీసా, అమెజాన్ డేటా స్థానికీకరణ వల్ల తమ వ్యయాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.

అంగీకరించేది లేదని భారత్‌కు ట్రంప్ అల్టిమేటం!అంగీకరించేది లేదని భారత్‌కు ట్రంప్ అల్టిమేటం!

English summary

డేటా భారత్‌లోనే స్టోర్ చేయాలి: ఆర్బీఐ | RBI Clarifies That Payments Data Must Be Stored In Systems Located In India

A week after the Minister of Commerce and Industry, Piyush Goyal asked companies to submit their concerns over data protection policies in India, the Reserve Bank of India (RBI) said that all payments related data was to be stored within systems operated in the country.
Story first published: Thursday, June 27, 2019, 17:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X