For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏడాదికి రూ.60 లక్షల సంపాదన, సమోసా వ్యాపారికి ట్యాక్స్ చిక్కులు

|

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని అలీఘర్‌లో ఓ సమోసా, కచోరీ వ్యాపారికి ఏడాదికి రూ.60 లక్షల ఆదాయం వస్తోందట. ఆయనకు ఏకంగా ఆదాయపన్ను శాఖ నోటీసులు అందాయి. చూడటానికి దుకాణం చిన్నగా ఉన్నప్పటికీ ఏడాదికి అరకోటికి పైగా ఆదాయం ఉండటంతో జీఎస్టీ కింద నమోదు చేసుకొని పన్ను చెల్లించాలని పేర్కొంటూ వ్యాపారికి అధికారులు నోటీసులు జారీ చేశారు. సదరు వ్యాపారి పేరు ముఖేష్.

మోడీ ప్రభుత్వం కనీస వేతన బిల్లు గురించి తెలుసుకోండిమోడీ ప్రభుత్వం కనీస వేతన బిల్లు గురించి తెలుసుకోండి

సమోసా, కచోరీ దుకాణం.. సేల్స్ రూ.60 లక్షలకు పైగా

సమోసా, కచోరీ దుకాణం.. సేల్స్ రూ.60 లక్షలకు పైగా

ముఖేష్ కచోరీ పేరుతో ఓ సినిమా హాలు సమీపంలో దుకాణాన్ని నడుపుతున్నాడు అతను. ఉదయం నుంచి రాత్రి వరకు ఇక్కడ దొరికే సమోసాలు, కచోరీలకు బాగా క్రేజ్. ప్రతి రోజు కస్టమర్ల తాకిడి బాగా ఉంటుంది. ఇక్కడి సమోసా, కచోరీ కోసం స్థానికులు క్యూ కడుతుంటారు. అయితే ఇటీవలే ఈ దుకాణంపై కమర్షియల్ ట్యాక్స్ డిపార్టుమెంటుకు ఫిర్యాదు అందింది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. అధికారులు మరో దుకాణం వద్ద కూర్చొని ఈ సమోసా, కచోరీ దుకాణంలోని అమ్మకాలపై ఆరా తీశారు. ముఖేష్ ఏడాదికి రూ.60 లక్షల నుంచి రూ.1 కోటి వరకు సేల్ చేస్తాడని అంచనా వేశారు.

జీఎస్టీ, ట్యాక్స్ తెలియదన్న ముఖేష్

జీఎస్టీ, ట్యాక్స్ తెలియదన్న ముఖేష్

ఇంత పెద్ద మొత్తంలో సేల్ అవుతున్నా ముఖేష్ తన సమోసా, కచోరీ దుకాణాన్ని జీఎస్టీ కింద నమోదు చేసుకోలేదు. అతను ఎలాంటి పన్నులు చెల్లించడం లేదు. దీనిపై ముఖేష్ మాట్లాడుతూ... తనకు ఇవన్నీ (జీఎస్టీ, పన్నులు) తెలియవని, ఈ దుకాణాన్ని తాను గత 12 ఏళ్లుగా నిర్వహిస్తున్నానని, కానీ తనకు ఎవరు కూడా ఈ విషయాలు చెప్పలేదని, తాము బతికేందుకు సమోసాలు, కచోరీలు అమ్ముకుంటున్నామని చెప్పాడు. ముఖేష్‌ తన వ్యాపారం గురించి పూర్తిగా చెప్పాడని, ఎంత ఆదాయం వస్తుంది.. నూనె, సిలిండర్‌ వంటి ముడి సరుకులకు ఎంత ఖర్చవుతుందనేది చెప్పాడని ఈ కేసును విచారించిన స్టేట్ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (SIB) సభ్యుడు తెలిపారు.

రూ.40 లక్షల టర్నోవర్ దాటితే జీఎస్టీ రిజిస్ట్రేషన్

రూ.40 లక్షల టర్నోవర్ దాటితే జీఎస్టీ రిజిస్ట్రేషన్

కాగా, రూ.40 లక్షల వార్షిక టర్నోవర్‌ను మించిన వారంతా జీఎస్టీ రిజిస్ర్టేషన్‌ చేయించుకోవాలి. సిద్ధం చేసిన ఆహారంపై 5 శాతం పన్ను విధిస్తారు. ముఖేష్‌కు నోటీసు జారీ చేశారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించారు. ఏడాది వ్యాపారానికి పన్ను కట్టించుకునే ప్రక్రియ చేపట్టారు. అసంఘటిత రంగంలోని వ్యాపారులు అవగాహనలేమితో జీఎస్టీ కట్టడం లేదని, వారిని పన్ను వ్యవస్థలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తామని అధికారులు చెబుతున్నారు.

English summary

ఏడాదికి రూ.60 లక్షల సంపాదన, సమోసా వ్యాపారికి ట్యాక్స్ చిక్కులు | Kachori seller Mukesh earns over Rs.60 lakh every year

A simple shop selling kachoris in Uttar Pradesh's Aligarh has left the commercial tax sleuths astounded.
Story first published: Tuesday, June 25, 2019, 17:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X