For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేతన జీవులందరూ ఐటీఆర్-1 ఫైల్ చేయవచ్చా?

By Jai
|

ప్రభుత్వం 2018-19 ఆర్ధిక సంవత్సరానికి సంబందించిన కొత్త ఆదాయ పన్ను రిటర్న్ (ఐటీఆర్) ఫారంలను నోటిఫై చేసింది. మీకు సంబందించిన రిటర్న్ ను ఫైల్ చేసేముందు సరైన ఫారంను ఎంచుకోవాల్సి ఉంటుంది. తప్పుడు ఫారంను ఎంచుకుంటే దాన్ని సరైనదిగా పరిగణించరు. సాధారణంగా ఒక కంపెనీలో పనిచేస్తూ నెలవారీగా వేతనం అందుకునే వారు ఐటీఆర్-1ను ఫైల్ చేయాల్సి ఉంటుంది. అధిక శాతం వేతన జీవులకు ఇదే వర్తిస్తుంది. ఒక సంవత్సరంలో వేతనం/పెన్షన్, ఒక ఇల్లు, బ్యాంక్ ఖాతా ద్వారా లభించే వడ్డీ ఆదాయం (లాటరీ గెలవడం, రేస్ గుర్రాల ద్వారా వచ్చే ఆదాయం మినహా) వంటి వాటి ద్వారా రూ. 50 లక్షల వరకు ఆదాయం పొందితే అలాంటి వారికీ ఐటీఆర్-1 అవసరం ఉంటుంది. అయితే వేతనం పొందుతున్న వారందరికీ కొన్ని సందర్భాల్లో ఐటీఆర్-1 వర్తించదు. అది ఎప్పుడంటే
- ఒక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ. 50 లక్షలు దాటినప్పుడు..
- ఒకటికన్నా ఎక్కువ గృహాల నుంచి ఆదాయం వచ్చినప్ప్పుడు
- వ్యవసాయం ద్వారా ఒక ఏడాదిలో వచ్చే ఆదాయం రూ. 5,000 దాటితే
- ఏదైనా కంపెనీకి డైరెక్టర్ గా ఉన్న సందర్భంలో...
- ఒక ఆర్థిక సంవత్సరంలో ఏవైనా ఆన్ లిస్టెడ్ ఈక్విటీ షేర్లను కలిగి ఉంటే..
- డివిడెండ్ ఆదాయం ఒక సంవత్సరంలో ఒక కంపెనీ నుంచి రూ. 10 లక్షల కన్నా ఎక్కువ పొందితే
- బిజినెస్, ప్రొఫెషన్ కింద ఆదాయం పొందితే
-దేశంలో నివాసితులు కాకపోతే...
ఒకవేళ ఇవి మీకు వర్తిస్తే వేతన జీవులు అయినప్పటికీ మీరు ఐటీఆర్-1 ను ఫైల్ చేయడానికి అవకాశం ఉండదు.

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు చేసే 6 పొరపాట్లు: తప్పు చేస్తే ఈ సమస్యలు తప్పవు!ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు చేసే 6 పొరపాట్లు: తప్పు చేస్తే ఈ సమస్యలు తప్పవు!

ఏ ఫారం సమర్పించాలంటే..

- వేతనం పొందుతున్న వారు 2018-19 సంవత్సరంలో అదనంగా వ్యవసాయం ద్వారా ఆదాయం పొందినా (రూ. 5,000 మించి) వారు ఐటీఆర్ను-1ను ఫైల్ చేయడానికి అవకాశం ఉండదు. ఇలాంటప్పుడు ఐటీఆర్-1కు బదులు ఐటీఆర్-2ను ఫైల్ చేయాల్సి ఉంటుంది.
- సంవత్సర కాలంలో క్యాపిటల్ గెయిన్స్ పొందితే, ఒకటికన్నా ఎక్కువ గృహాల నుంచి ఆదాయం వస్తే ఐటీఆర్-2ను ఉపయోగించుకోవాలి.
- ఒకవేళ వ్యాపారం ద్వారా ఆదాయం వస్తే ఐటీఆర్-3ని ఉపయోగించుకోవాలి.
- ఎట్టి పరిస్థితిలోను రెండు ఐటీఆర్ ఫారంలను సమర్పించడానికి అవకాశం ఉండదు.

Can salaried file ITR 1 Form?

జూలై 31 వరకు గడువు

2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ పన్ను రిటర్న్ ను ఫైల్ చేయడానికి చివరి తేదీ వచ్చే జూలై 31. ఈ తేదీ వ్యక్తులు, అవిభాజ్య కుటుంబాలు, ఇండివిడ్యుల్ పన్ను చెల్లింపుదారులకు వర్తిస్తుంది.
- ఒకవేళ ఈ గడువులోపు ఐటీఆర్ ను ఫైల్ చేయకపోతే జరిమానాతో వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఫైల్ చేయవచ్చు.

ఇవి ముఖ్యం

- ఐటీఆర్-1 ను ఫైల్ ఫైల్ చేయడానికి ముందు మీకు పాన్ ఉండాలి. దీన్ని ఆధార్ తో అనుసంధానం చేసి ఉండాలి.
- మీరు ఉద్యోగం చేస్తున్న కంపెనీ యజమాని జారీ చేసిన ఫారం-16 ఉండాలి.

English summary

వేతన జీవులందరూ ఐటీఆర్-1 ఫైల్ చేయవచ్చా? | Can salaried file ITR 1 Form?

ITR-1 is one of the most widely used forms by the salaried individuals to file their income tax return (ITR). The form is now available on the income tax department's e-filing website. Therefore, you can easily file your ITR once your employer gives you Form-16 for FY 2018-19.
Story first published: Friday, June 21, 2019, 15:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X