For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిలయన్స్ జియో దెబ్బ: వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌కు రూ.3,050 కోట్ల ఫైన్!!

|

న్యూఢిల్లీ: సేవా నిబంధనల విషయంలో నాణ్యతను విస్మరించినందుకు గాను భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలకు గతంలో రూ.3,050 కోట్ల జరిమానా విధించారు. 2016 అక్టోబర్‌లో వచ్చిన కొత్త రిలయన్స్ జియోకు ఇంటర్ కనెక్టివిటీని నిరాకరించినందుకు టెలికం సంస్థలకు జరిమానా విధించాలని టెలికం రెగ్యులేటరి అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సూచించింది. దీంతో డిపార్టుమెంట్ ఆప్ టెలికం (DOT) రూ.3,050 కోట్ల జరిమానా విధించింది. ఇప్పుడు DOT విధించిన జరిమానాను డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (DCC) సమర్థించిందని తెలుస్తోంది.

ఏపీలో స్కూల్‌కు పంపిస్తే రూ.15,000! ఏ పథకం.. ఎంత లబ్ధి!!ఏపీలో స్కూల్‌కు పంపిస్తే రూ.15,000! ఏ పథకం.. ఎంత లబ్ధి!!

DoT పెనాల్టీని DCC అప్రూవ్ చేసినట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్ షేర్లు 2.6 శాతం, వొడాఫోన్ ఐడియా షేర్లు 3.8 శాతం తగ్గాయి. కాగా, పెనాల్టీ విధించే ముందు రూ.3,050 కోట్ల జరిమానాపై తిరిగి సమీక్షించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ట్రాయ్ నుంచి అభిప్రాయం తీసుకోనున్నారు.

DoT backs Rs.3,050 crore fine on Airtel, Vodafone Idea

రిలయన్స్ జియో ఎంట్రీ తర్వాత వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ వంటి టెలికం సర్వీస్ ప్రొవైడర్లు భారీగా దెబ్బతింటున్నారు. మూడేళ్లలోనే రిలయన్స్ జియో.. కస్టమర్ల విషయంలో ఎయిర్‌టెల్‌ను దాటి, వొడాఫోన్ ఐడియాకు దరిదాపుల్లో ఉంది. డేటా ప్యాకేజీ, వాయిస్ కాల్స్‌తో జియో మిగతా టెలికం సంస్థలను తీవ్రంగా దెబ్బతీస్తోంది.

ఇదిలా ఉండగా, మొబైల్ లైసెన్స్ నిబంధనలు ఉల్లంఘించడాన్ని తప్పుబడుతూ ట్రాయ్.. పై కంపెనీలకు రూ.3.050 కోట్ల జరిమానా విధించాలని డీఓటీకి సూచించింది. దీని ప్రకారం నాడు.. వొడాఫోన్, ఎయిర్‌టెల్‌స పైన రూ.1050 కోట్ల చొప్పున, ఐడియా పైన రూ.950 కోట్ల చొప్పున జరిమానా విధించింది. జియో కాల్స్ కనెక్ట్ ఇవ్వడంలో ఈ కంపెనీలు అప్పుడు మొండికేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాయి.

English summary

రిలయన్స్ జియో దెబ్బ: వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌కు రూ.3,050 కోట్ల ఫైన్!! | DoT backs Rs.3,050 crore fine on Airtel, Vodafone Idea

The Digital Communications Commission (DCC), the highest decision-making body of the Department of Telecommunications (DoT), is reportedly ready to back the telecom regulator's stand on allegations of cartelisation made by Reliance Jio Infocomm against leading private sector incumbents three years back.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X