For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐటీ కంపెనీలకు గుడ్ న్యూస్ .. వచ్చే ఏడాది కూడా పన్ను ప్రోత్సహకాలు ?

|

హైదరాబాద్ : ఐటీ సంస్థలకు గుడ్ న్యూస్. ఆయా సంస్థలకు పన్ను ప్రోత్సాహకాలను వచ్చే ఏడాది తర్వాత కూడా కొనసాగించాలని కేంద్రం భావిస్తోంది. దీనికి సంబంధించి ఇటీవల ఆర్థికశాఖకు నాస్కామ్ కోరడంతో .. ఐటీ సంస్థలకు ట్యాక్స్ బెనిఫిట్స్ కొనసాగుతాయనే అంచనాలు నెలకొన్నాయి.

వచ్చే ఏడాది కూడా ..
వచ్చే ఏడాది మార్చి తర్వాత కూడా ప్రత్యేక ఆర్థిక మండళి (సెజ్)లోని ఐటీ యూనిట్లకు పన్ను ప్రోత్సాహకాలను కొనసాగించాలని ఆర్థికశాఖను నాస్కామ్ కోరింది. దీంతో ఐటీ ఇండస్ట్రీ దీర్ఘకాలిక లక్ష్యంతో మరింత నిశ్చయంగా పెట్టుబడులు పెడతాయని అంచనా వేస్తోంది. దీంతోపాటు స్థూల దేశియోత్పత్తి (జీడీపీ)లో ఐబీ బీవీఎం రంగ వాటా 6.6 శాతంగా ఉందని .. ఈ పరిశ్రమ 41 లక్షల మంది నిపుణులకు ఉపాధి కల్పిస్తుందని లెక్కగట్టింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి రూ.13 వేల కోట్ల డాలర్ల విదేశీ మారక ఆదాయ సమకూరుతుందని నాస్కాం అంచనా వేసింది.

good news to it companies

ఇవీ ప్రయోజనాలు ...
కొత్తగా ప్రవేశపెట్టిన పన్ను అనుకూల సెజ్ పాలసీలో కల్పించిన రాయితీలను కొనసాగించాలని .. కనీస ప్రత్యామ్నాయ పన్నును 9 శాతంగా ఉంచాలని అభిప్రాయపడింది. డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్ (డీడీటీ) నుంచి మినహాయింపు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరినట్టు నాస్కాం సీనియర్ డైరెక్టర్ ఆశిష్ అగర్వాల్ పేర్కొన్నారు.

English summary

ఐటీ కంపెనీలకు గుడ్ న్యూస్ .. వచ్చే ఏడాది కూడా పన్ను ప్రోత్సహకాలు ? | good news to it companies

Nasscom asked the Finance Ministry to continue tax incentives for IT units in the Special Economic Zone (SEZ) after March next year. It is expected that the IT Industry will invest more and more with a long term goal. In addition, IBM's share of GDP is 6.6 per cent of GDP, which is estimated to be employing 41 lakh professionals.
Story first published: Saturday, June 15, 2019, 20:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X