For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంటర్ విద్యార్థులకు HCL 'టెక్ బీ'సూపర్ ఆఫర్: ట్రెయినింగ్, రూ.10వేల స్టైఫండ్.. పూర్తి వివరాలు

|

హిందూస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్(HCL) టెక్నాలజీస్.. టెక్ బీ (Tech Bee)ని ప్రారంభించింది. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్లస్ టూ (ఇంటర్మీడియేట్) పూర్తి చేసిన విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీపై శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు HCL ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ శ్రీమతి శివశంకర్ మాట్లాడుతూ... Tech Bee పైలట్ ప్రోగ్రామ్‌ను రెండేళ్ల క్రితం ఉత్తర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో ప్రారంభించామని, ఇది మంచి ఫలితాలు ఇచ్చిందని చెప్పారు.

eSIMతో ఇక పోర్టబులిటీ ఎంతో సులభం: ఏమిటిది, ఎవరికి ఇబ్బందులు?eSIMతో ఇక పోర్టబులిటీ ఎంతో సులభం: ఏమిటిది, ఎవరికి ఇబ్బందులు?

ఇక్కడ శిక్షణ పొందినవారిలో దాదాపు 700 మంది విద్యార్థులు ఇప్పటికే ఉద్యోగం సంపాదించారని చెప్పారు. మరికొందరు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. తాము శిక్షణ నిమిత్తం పరిమిత సంఖ్యలో విద్యార్థులను తీసుకుంటామని చెప్పారు. ఇతర వేరే లేదా ఎక్కువ రాష్ట్రాలలో ట్రెయినింగ్ కోసం తాము సిద్ధపడటం ఇదే మొదటిసారి అని చెప్పారు. ఆసక్తి కలిగిన విద్యార్థులకు తాము ట్రెయినింగ్ ఇస్తామన్నారు.

HCL will roll out Tech Bee soon: To hire and train students for IT jobs

దక్షిణాదిలోని తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఉత్తరాది నుంచి హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలు ఉన్నాయన్నారు. ఈ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి కారణం ఉందని చెప్పారు. HCL ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుందో అక్కడి విద్యార్థులకు శిక్షణ సులువు అన్నారు. తాము పై రాష్ట్రాల్లో డెవలప్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, అందుకే అక్కడ శిక్షణ ఇస్తున్నామన్నారు.

HCL యొక్క Tech Bee ప్రోగ్రాం ఉద్దేశ్యం.. విద్యార్థులకు అవకాశాలు త్వరగా తీసుకు రావడం, ఆర్థిక స్వావలంబన, ట్రెండ్ సెట్టర్స్‌గా నిలబడం. ఈ ప్రోగ్రాం ద్వారా శిక్షణ పొందాలనుకునే విద్యార్థులు ఎంట్రెన్స్ టెస్ట్ రాయాలి. విద్యార్థులు ఈ ప్రోగ్రాంలో చేరాలనుకుంటే ఇంటర్‌లో మేథ్స్ ఒక సబ్డెక్టుగా ఉండి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఎన్‌రోల్ అయిన విద్యార్థులకు నెలకు రూ.10,000 స్టైఫండ్‍‌గా ఇస్తారు. HCLతో కలిసి పని చేస్తూనే విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్ పైన దృష్టి సారించవచ్చు. విద్యార్థులకు అవసరమైన శిక్షణ ఇచ్చిన అనంతరం వారి వారి వర్క్ స్ట్రీమ్‌ను బట్టి రూ.2.5 లక్షల వరకు ప్యాకేజీతో రిక్రూట్ చేసుకుంటుంది. అలాంటి వారు HCLలో మూడేళ్ళ అగ్రిమెంట్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.

Read more about: hcl students it jobs jobs it software
English summary

ఇంటర్ విద్యార్థులకు HCL 'టెక్ బీ'సూపర్ ఆఫర్: ట్రెయినింగ్, రూ.10వేల స్టైఫండ్.. పూర్తి వివరాలు | HCL will roll out Tech Bee soon: To hire and train students for IT jobs

HCL Technologies is all set to roll out Tech Bee, a company initiative under which it trains and hires students who have completed Plus Two, across several states, a senior official of the tech giant said here Thursday.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X