For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్‌కు అమెరికా షాక్, GSP ప్రభావం ఉండదని ఇండియా

|

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వాణిజ్య రంగంలో భారత్‌కు ఇస్తున్న పన్ను రాయితీలను రద్దు చేశారు. జూన్ 5వ తేదీ నుంచి ఇది అమలులోకి రానుంది. ఇది ఆర్థికంగా భారత్‌కు నష్టం కలిగించే అంశం. ఆమెరికాకు దాదాపు రూ.39 వేల కోట్ల మేర జరుగుతున్న ఎక్స్‌పోర్ట్స్‌పై ఇస్తున్న రాయితీలు రద్దు చేశారు. 1976 నుంచి అమెరికా జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ (GSP) కింద భారత్‌కు లబ్ధి చేకూరుతోంది.

రూ.69.22 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపదరూ.69.22 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద

జీఎస్పీ వల్ల

జీఎస్పీ వల్ల

GSP వల్ల ఇతర దేశాలకు చెందిన ఉత్పత్తులు ఎలాంటి పన్నులు లేకుండా ఎగుమతి చేసే సౌకర్యం ఉంది. అయితే అమెరికా ఉత్పత్తులకు భారత్ సరైన మార్కెట్ కల్పించడం లేదని చెబుతూ ట్రంప్ జీఎస్పీని రద్దు చేశారు. అమెరికా ఉత్పత్తులకు సరైన మార్కెట్‌ను ఇస్తామనే భరోసాను భారత్ కల్పించలేదని, ఈ కారణంగా జీఎస్పీని రద్దు చేస్తున్నామని అమెరికా ప్రకటించింది. మార్చి 4వ తేదీనే అమెరికా ఈ ప్రకటన చేసింది. అరవై రోజుల గడువుతో నోటీసు ఇచ్చింది. ఆ గడువు మే 3వ తేదీన ముగియడంతో, 5వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించింది.

అమెరికా ఆరోపణ

అమెరికా ఆరోపణ

అమెరికా కాంగ్రెస్ నిర్ధారించిన ప్రామాణికాలు పాటిస్తే భారత్ తన ఉత్పత్తులను పన్నులు లేకుండా ఎక్స్‌పోర్ట్ చేయవచ్చునని, అందులో అమెరికాకు చెందిన వస్తువులను భారత మార్కెట్లో అందుబాటులో ఉంచాలని, దీనిపై ఎన్నోసార్లు చర్చలు జరిగాయని, కానీ అమలు కాలేదని అమెరికా తెలిపింది. అమెరికా నిర్ణయంతో 1,900 వస్తువులపై ఎగుమతి ప్రభావం పడనుంది. డెయిరీ, మెడికల్ వంటి అమెరికా పరికరాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

భారత్ స్పందన

భారత్ స్పందన

GSPని అమెరికా రద్దు చేయడంపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంతో ఇరు దేశాల వాణిజ్య సంబంధాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అమెరికా పంపిన పలు అభ్యర్థనలపై భారత్ కొన్ని తీర్మానాలు చేశామని, కానీ వాటిని అమెరికా అంగీకరీంచకపోవడం బాధాకరమని తెలిపింది. ఇతర దేశాల వలే భారత్ కూడా తమ ప్రయోజనాలకు తొలి ప్రాధాన్యతం ఇస్తుందని పేర్కొనంది. హోదా రద్దును తాము ఓ సాధారణ ప్రక్రియగా భావిస్తున్నామని, అమెరికాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కృషి జరుగుతుందని పేర్కొంది.

English summary

భారత్‌కు అమెరికా షాక్, GSP ప్రభావం ఉండదని ఇండియా | US move unfortunate, says India as Trump ends GSP trade privileges

The Indian government said on Saturday it will continue to seek to build strong economic ties with the United States despite a decision by US President Donald Trump to end preferential trade treatment for India from June 5.
Story first published: Sunday, June 2, 2019, 13:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X