హర్యానాలో బీటీ వంకాయలను రైతులు ప్రభుత్వం అనుమతి లేకుండా పండిస్తున్నారనే విషయం బయటకు పొక్కింది. బీటీ వంకాయలను పండించేందుకు ప్రభత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాలేదు. కానీ పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో మాత్రం బీటీ వంకాయలను విరివిగా పండిస్తున్నారు.అక్టోబర్ 2013లో బంగ్లా ప్రభుత్వం బీటీ వంకాయల సాగుకు అనుమతి ఇవ్వడంతో పెద్ద ఎత్తున్న వీటి సాగు జరుగుతోంది . 2014లో కేవలం 20 మంది రైతులు మాత్రమే బీటీ వంకాయలను బంగ్లాదేశ్‌లో పండించేవారు. ఆ తర్వాత 2017 నాటికి ఈ సంఖ్య 6512కు చేరుకుంది. ఇక 2018 నాటికి 27,012 మంది రైతులు బీటీ వంకాయలను సాగు చేస్తున్నారు. దీంతో పంటలు పండిస్తున్న రైతుల్లో దాదాపు 17శాతం మంది బీటీ వంకాయను పండిస్తున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లో కూరగాయలు పండించే ప్రతి జిల్లాలో బీటీ వంకాయను పండిస్తుండటం విశేషం.
బీటీ వంకాయకు పురుగులు పట్టవు. అంతేకాదు పంటకూడా చేతికి త్వరగా అంది వస్తుంది. బీటీ జీన్ అనే రసాయనం పంటకు పురుగుపట్టకుండా రక్షణ కల్పించడమే కాకుండా మనుషులకు ఎలాంటి హానీ తలపెట్టదు.దీంతో బీటీ వంకాయ ఉత్పత్తి చాలా అధికంగా ఉంటుంది. బీటీ వంకాయలు పండిచడం గురించి తెలియని రోజుల్లో వంకాయ పంటకు రైతులు ఆ సీజన్‌లో దాదాపు 84 సార్లు పిచకారీ చేసేవారు. ఈ పురుగుల మందు కొట్టడం వల్ల రైతులు కొన్ని సందర్భాల్లో అనారోగ్యానికి గురయ్యేవారని సర్వేల ద్వారా తెలుస్తోంది. ఇక బీటీ వంకాయ సాగులోకి రావడంతో దాదాపు తమ పంట ఖర్చు 61శాతం తగ్గిందని రైతులు చెబుతున్నారు.ఇక సీజన్‌లో 11 సార్లు మాత్రమే వారు పంటకు పిచకారీ చేస్తున్నట్లు చెప్పారు.

ఇక పంట చేతికి వచ్చాక ఒక్కసారి సాధారణ వంకాయ పంటకు, బీటీ వంకాయ సాగుకు వస్తున్న ధరలు చూస్తే బీటీ వంకాయకు ధర చాలా పలుకుతున్నట్లు సర్వేలా ద్వారా తెలుస్తోంది. ఒక హెక్టార్‌లో పండే బీటీ వంకాయకు రూ. 1.5 లక్షల రూపాయలు వస్తుంటే... అదే సాధారణ వంకాయలకు హెక్టారుకు రూ. 25వేలు మాత్రమే వస్తోందని రైతులు చెబుతున్నారు. అంటే బీటీ వంకాయలు సాగు చేస్తున్న రైతులకు సాధారణ వంకాయలు సాగు చేస్తున్న రైతులకంటే ఆరు రెట్టు లాభం వస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే బంగ్లాదేశ్‌లో బీటీ వంకాయలు సాగు అదికంగా ఉంది. భారత్‌లో కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అవలంబిస్తే మనకున్న రీసోర్స్‌కు అధికంగానే పండించగల సత్తా రైతులకు ఉంది.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications