For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియన్ రైల్వేతో 2 ఏళ్ల పోరాటం, రూ.33 రీఫండ్ పొందిన ఇంజినీర్

|

కోటకు చెందిన ఇంజినీర్‌కు రెండేళ్ల తర్వాత ఇండియన్ రైల్వేస్ నుంచి రూ.33 రీఫండ్ అయింది. సాధారణంగా ప్రయాణీకుడు తాను బుక్ చేసుకున్న టిక్కెట్‌ను నిబంధనలను అనుసరించి నిర్ణీత సమయంలో దానిని రద్దు చేసుకుంటే క్లరికల్ ఖర్చులు పోగా మిగిలిన మొత్తం ఏడు వర్కింగ్ డేస్‌లో రీఫండ్ అవుతుంది. కానీ ఇతనికి మాత్రం రెండేళ్ల తర్వాత ఈ చిన్నమొత్తం రీఫండ్ అయింది.

ఏప్రిల్ 2017లో ఈ టిక్కెట్ బుక్ అయింది. జీఎస్టీ అమలులోకి రాకముందు దీనిని బుక్ చేసుకున్నాడు. ఆ తర్వాత తానిని రద్దు చేసుకున్నాడు. జూలై 2, 2017 న ప్రయాణం కోసం ఈ టిక్కెట్ బుక్ చేశాడు. అంతకుముందు రోజు నుంచి జీఎస్టీ అమలులోకి వచ్చింది. దీంతో రీఫండ్ విషయంలో అతను చిక్కులు ఎదుర్కొన్నాడు.

ICICI శాలరీ అకౌంట్ ఉందా?: కొన్ని క్లిక్స్‌తో మీరు హోంలోన్ICICI శాలరీ అకౌంట్ ఉందా?: కొన్ని క్లిక్స్‌తో మీరు హోంలోన్

 టిక్కెట్ క్యాన్సిలేషన్

టిక్కెట్ క్యాన్సిలేషన్

సుజీత్ స్వామి అనే 30 ఏళ్ల ఇంజినీర్ కోట నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు ఐఆర్‌సీటీసీ టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. అనివార్య కారణాల వల్ల ఆ తర్వాత దానిని రద్దు చేసుకున్నాడు. ఏప్రిల్ 2017లో అతను కోట నుంచి న్యూఢిల్లీ వెళ్లేందుకు గోల్డెన్ టెంపుల్ మెయిల్‌లో టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. అతని జర్నీ జూలై 2వ తేదీన ఉంది. టిక్కెట్ ఖరీదు రూ.765. రద్దు చేసుకున్నాక అతనికి రూ.665 రీఫండ్ వచ్చింది. అంటే రూ.100 క్యాన్సిలేషన్ ఛార్జీల కింద ఇవ్వలేదు.

రూ.65కు బదులు రూ.100 ఛార్జ్

రూ.65కు బదులు రూ.100 ఛార్జ్

క్యాన్సిలేషన్ టిక్కెట్‌కు రూ.65కు బదులు రూ.100 వసూలు చేశారని స్వామి వాపోయాడు. జీఎస్టీ అమలు కంటే ముందే టిక్కెట్ రద్దు చేసుకున్నానని, కానీ రూ.35 సర్వీస్ ట్యాక్స్ ఎక్కువగా తీసుకున్నారని చెప్పాడు. తన వద్ద ఎక్కువ సర్వీస్ ఛార్జ్ వసూలు చేయడంపై అతను ఆర్టీఐ ద్వారా ముందుకు వెళ్లాడు. దీనిపై రైల్వే శాఖ వివరణ ఇస్తూ... మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కమర్షియల్ సర్క్యులర్ 43 ప్రకారం జీఎస్టీ అమలు కాకముందు టిక్కెట్ బుక్ చేసుకున్నప్పటికీ, జీఎస్టీ అమలు తర్వాత రద్దయినప్పటికీ బుక్ చేసిన సమయంలోని సర్వీస్ ట్యాక్స్ రీఫండ్ కాదని స్పష్టం చేశారు. ఇందులో రూ.65 క్లరికల్ ఛార్జ్, రూ.35 సర్వీస్ ట్యాక్స్.

రీఫండ్

రీఫండ్

అయితే, జూలై 1, 2017లోపు టిక్కెట్ తీసుకొని, రద్దయిన నేపథ్యంలో టిక్కెట్ బుకింగ్ సమయంలో తీసుకున్న సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలని ఆర్టీఐ తెలిపింది. రూ.35 సుజిత్‌కు తిరిగివ్వాలని చెప్పింది. ఈ అమౌంట్ అతని అకౌంట్లో మే 1, 2019లో పడింది. తాను రూ.35 కోసం పోరాటం చేశానని, తన ఆర్టీఐ పదిసార్లు వివిధ డిపార్టుమెంట్లకు ట్రాన్సుఫర్ అయిందని, చివరకు తన అమౌంట్ పడిందని చెప్పారు.

English summary

ఇండియన్ రైల్వేతో 2 ఏళ్ల పోరాటం, రూ.33 రీఫండ్ పొందిన ఇంజినీర్ | Engineer gets Rs 33 refund for cancelled ticket after 2 yrs' arduous battle with IRCTC

After two years of battle a Kota-based engineer received Rs. 33 as refund from the Indian Railways which charged him the amount as service tax despite him cancelling the ticket prior to the implementation of GST.
Story first published: Thursday, May 9, 2019, 13:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X