For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IT Returns: 6.6 లక్షలు తగ్గిన ఈ-ఫైలర్స్, 2013 కంటే భారీగా పెరిగిన రిజిస్టర్డ్ ఫైలర్స్

|

2018-19 ఆర్థిక సంవత్సరంలో ఐటీ రిటర్న్స్ దాఖలు 6.6 లక్షలకు పైగా తగ్గింది. నోట్ల రద్దు అనంతరం పన్ను చెల్లింపుదార్ల సంఖ్య పెరుగుతుందని భావించిన నిపుణులు, ఇది చూసి ఆశ్యర్యపోతున్నారు. ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ ఈ-ఫైలింగ్‌ వెబ్‌సైట్ ప్రకారం 2018-19లో 6.68 కోట్ల రిటర్న్స్, 2017-18 ఆర్థిక సంవత్సరంలో 6.74 కోట్ల రిటర్న్స్ దాఖలయ్యాయి. ఐటీ రిటర్న్స్ తగ్గడం ఆశ్చర్యపరిచిందని కొటక్ ఎకనామిక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది.

ఐటీ రిటర్న్స్ తగ్గడమంటే కార్యాచరణ బలహీనంగా ఉందనే అభిప్రాయాన్ని ఈ రిపోర్ట్ వ్యక్తం చేసింది. ఎన్నికల అనంతరం బాధ్యతలు స్వీకరించే కొత్త ప్రభుత్వం, ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీ రిటర్న్స్‌తో పాటు ఆదాయపన్ను చెల్లింపులు పెరిగేందుకు కృషి చేస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. నోట్ల రద్దు సమయంలో చేసిన అధికమొత్తం డిపాజిట్ల వివరాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తే మంచి ఫలితాలు రావచ్చని అభిప్రాయపడింది.

నోట్లరద్దు: 4ఏళ్లలో భారీగా పడిపోయిన ఐటీ కంప్లియన్స్, ఓట్ల కోసం నో కఠినవైఖరి! నోట్లరద్దు: 4ఏళ్లలో భారీగా పడిపోయిన ఐటీ కంప్లియన్స్, ఓట్ల కోసం నో కఠినవైఖరి!

Income tax e filers drop by over 6.6 lakh in FY19: Official data

ఐటీ రిటర్న్స్ దాఖలు సంఖ్య తగ్గినప్పటికీ, రిజిస్టర్డ్ ఫైలర్స్ మార్చి 31, 2019 నాటికి మాత్రం 15 శాతం పెరిగి 8.45 కోట్లకు పెరిగింది. 2013 మార్చి నాటికి రిజిస్టర్డ్ ఫైలర్స్ కేవలం 2.7 కోట్ల మంది ఉండగా, 2016 మార్చి నాటికి దాదాపు రెండింతలై 5.2 కోట్లు కోట్లకు పెరిగింది. 2017 మార్చిలో 6.2 కోట్లుగా ఉంది. 2013తో పోలిస్తే రిజిస్టర్డ్ ఫైలర్స్ భారీగా పెరిగారు.

English summary

IT Returns: 6.6 లక్షలు తగ్గిన ఈ-ఫైలర్స్, 2013 కంటే భారీగా పెరిగిన రిజిస్టర్డ్ ఫైలర్స్ | Income tax e filers drop by over 6.6 lakh in FY19: Official data

In a first in recent history of tax filings, income tax e-filings in FY2019 have dropped by more than 6.6 lakh, a trend that analysts said was surprising as tax base was expected to increase post demonetisation.
Story first published: Monday, May 6, 2019, 9:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X