For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లోకసభ ఎన్నికలు: అత్యధిక ధనవంతుడు గౌతమ్ గంభీర్, రూ.147 కోట్ల ఆస్తులు

|

ఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో లోకసభ ఎన్నికల్లో పోటీలో నిలిచిన అభ్యర్థుల్లో బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ అత్యధిక ధనవంతుడు. అఫిడవిట్లో సమర్పించిన లెక్కల ప్రకారం అతని ఆస్తులు రూ.147 కోట్లు. గంభీర్ తూర్పు ఢిల్లీ నుంచి బరిలో నిలిచాడు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో గంభీర్ దాదాపు రూ.12.40 కోట్లు, తన భార్య నటాషా పేరిట రూ.6.15 కోట్ల ఇన్‌కం చూపించారు. ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ తన ఆస్తులను రూ.24 కోట్లుగా చూపించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం అతని ఆస్తులు 2014 నుంచి అతని ఆస్తులు రూ.4.33 కోట్లు పెరిగాయి. ఇతను 2017-18 ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయాన్ని రూ.48.03గా చూపించాడు. 2014లో రూ.85 లక్షలుగా చూపించాడు.

నరేంద్ర మోడీ పాలన: తొలి ఏడాది, ఇప్పుడు చమురు దిగుమతులు ఇలా..నరేంద్ర మోడీ పాలన: తొలి ఏడాది, ఇప్పుడు చమురు దిగుమతులు ఇలా..

రూ.18 కోట్ల ఆస్తులు చూపిన బీజేపీ ఎంపీ

రూ.18 కోట్ల ఆస్తులు చూపిన బీజేపీ ఎంపీ

దక్షిణ ఢిల్లీ బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి తన ఆస్తులను రూ.18 కోట్లుగా చూపించాడు. అఫిడవిట్ ప్రకారం ఈ అయిదేళ్లలో ఇతని ఆస్తులు రూ.3.5 కోట్లు పెరిగాయి. బిధూరి తన, తన భార్య, తన డిపెండెంట్ హిమాంశు ఆస్తులను 2017-18 ఏడాదిలో వరుసగా రూ.16.72 లక్షలు, రూ.3.09 లక్షలు, రూ.3.18 లక్షలుగా చూపించాడు. తన మూవబుల్ ఆస్తులు రూ.1.37 కోట్లుగా, తన భార్య క్యాష్, జ్యువెల్లరీ రూ.13.21 లక్షలుగా చూపించాడు. ఇమ్మూవబుల్ ఆస్తులను రూ.11.80 కోట్లుగా, అతని భార్య ఆస్తులు రూ.4.57 కోట్లుగా చూపించాడు. అతను రూ.20.38 లక్షల లయబులిటీస్ చూపించాడు.

షీలా దీక్షిత్ ఆస్తులు ఇవి

షీలా దీక్షిత్ ఆస్తులు ఇవి

దక్షిణ ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజేందర్ సింగ్ తన ఆస్తులను రూ.3.57 కోట్లు (మూవబుల్), రూ.5.05 కోట్లు (ఇమ్మూవబుల్) చూపించాడు. కాంగ్రెస్ నాయకురాలు, మాజీ సీఎం షీలా దీక్షిత్ తన ఆస్తులను రూ.4.92 కోట్లుగా చూపించారు. ఈమె నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి పోటీ చేస్తోంది. నిజాముద్దీన్ ఏరియాలో రూ.1.88 కోట్లు విలువ చేసే అపార్టుమెంట్ ఉన్నట్లు పేర్కొంది.

గంభీర్ ఆస్తులు రూ.147 కోట్లు

గంభీర్ ఆస్తులు రూ.147 కోట్లు

గంభీర్ తన మూవబుల్, ఇమ్మూవబుల్ ఆస్తులను రూ.147 కోట్లుగా చూపించాడు. తనపై కేసు ఉన్నట్లు పేర్కొన్నాడు. గంభీర్ తన మూవబుల్ ఆస్తులను రూ.116 కోట్లుగా, ఇమ్మూవబుల్ ఆస్తులు రూ.28 కోట్లుగా పేర్కొన్నాడు. రూ.34.20 కోట్ల లయబులిటీస్ ఉన్నట్లు పేర్కొన్నాడు. గంభీర్ బారకాంబ రోడ్డులోని మోడర్న్ స్కూల్లో చదువుకున్నాడు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని హిందూ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.

English summary

లోకసభ ఎన్నికలు: అత్యధిక ధనవంతుడు గౌతమ్ గంభీర్, రూ.147 కోట్ల ఆస్తులు | Gautam Gambhir richest among Lok Sabha candidates in Delhi

Former Indian opener Gautam Gambhir is the richest among all the candidates in fray for the Lok Sabha election in Delhi with total assets worth ₹147 core.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X