For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఔట్ ఆఫ్ కవరేజ్ ఏరియా!: బీఎస్ఎన్ఎల్‌కు ప్రైవేటు షాక్, జియో కంటే తక్కువ మార్కెట్!

|

ప్రభుత్వరంగ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అంతేకాదు, గత పదేళ్లలో బీఎస్ఎన్ఎల్ కంటే ప్రయివేటు ఆపరేటర్లు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లాయి. మూడేళ్ల క్రితం వచ్చిన రిలయెన్స్ జియో కంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీఎస్ఎన్ఎల్ వెనుకబడి ఉండటం గమనార్హం. గత దశాబ్దకాలంగా గ్రామీణ ప్రాంతాల్లోని బీఎస్ఎన్ఎల్, ఇతర ప్రయివేటు ప్రొవైడర్ల లెక్కలు చూస్తే వైర్‌లెస్ మార్కెట్లో ప్రభుత్వరంగ సంస్థ ఎంత వెనుకబడి ఉందో అర్థమవుతోందని అంటున్నారు.

మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆర్థికంగా ప్రిపేర్ అయ్యారా?మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆర్థికంగా ప్రిపేర్ అయ్యారా?

 సగం కంటే ఎక్కవ వాటాను కోల్పోయిన బీఎస్ఎన్ఎల్

సగం కంటే ఎక్కవ వాటాను కోల్పోయిన బీఎస్ఎన్ఎల్

గత పదేళ్ల కాలంలో గ్రామీణ ప్రాంతంలో బీఎస్ఎన్ఎల్ సగానికంటే ఎక్కువ వైర్‌లెస్ మార్కెట్‌ను కోల్పోయిందని లెక్కలు చెబుతున్నాయి. వీరంతా ప్రయివేటు ఆపరేటర్ల వైపుకు వెళ్లారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డేటా ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ వైర్ లెస్ మార్కెట్ 2009 జూన్‌లో 15.36 శాతం కాగా, 2018 డిసెంబర్ నాటికి అది 6.82 శాతానికి పడిపోయింది. అదే సమయంలో 2016 సెప్టెంబర్‌లో వచ్చిన రిలయన్స్ జియో వాటా 19.01 శాతంగా ఉంది. అంటే అప్పుడే వచ్చిన జియో కంటే ఎంతో వెనుకబడి ఉంది.

బీఎస్ఎన్ఎల్ కంటే జియో వాటా ఎక్కువ

బీఎస్ఎన్ఎల్ కంటే జియో వాటా ఎక్కువ

2009 జూన్ నాటికి బీఎస్ఎన్ఎల్ గ్రామీణ వైర్‌లెస్ వాటా 15.36 శాతం ఉండగా, ఎయిర్‌టెల్ వాటా 26.82, వొడాఫోన్ 19.72, ఐడియా 15.72 శాతంగా ఉంది. 2018 డిసెంబర్ నాటికి బీఎస్ఎన్ఎల్ గ్రామీణ వైర్‌లెస్ వాటా 6.82 శాతానికి పడిపోయింది. అదే సమయంలో ప్రయివేటు ఆపరేటర్ల వాటా పెరిగింది. ఎయిర్‌టెల్ వాటా 31.91 శాతం, వొడాఫోన్ ఐడియా వాటా 41.76 శాతం, రిలయన్స్ జియో వాటా 19.01 శాతంగా ఉంది.

బీఎస్ఎన్ఎల్ తగ్గుదలకు ఎన్నో కారణాలు

బీఎస్ఎన్ఎల్ తగ్గుదలకు ఎన్నో కారణాలు

బీఎస్ఎన్ఎల్ వైర్ లెస్ క్రమంగా తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. నిర్ణయాల్లో ఆలస్యం, ఉద్యోగులకు అధిక వేతనం ఉండటమే కాకుండా మార్కెట్లో తక్కువ నైపుణ్యం (ప్రయివేటు పోటీదారులతో) కలిగి ఉండటం, సమయానుకూలంగా లేదా సకాలంలో విస్తరణ చేయకపోవడం, నెట్ వర్క్ అప్‌గ్రేడ్ కూడా అలాగే ఉండటం వంటి ఎన్నో కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఉదారణకు ప్రయివేటు ఆపరేటర్లతో పోలిస్తే 3జీ సేవలను ఏడాదికి ముందే ప్రారంభించవచ్చు. ఎందుకంటే స్పెక్ట్రం ముందుగానే కేటాయించబడింది. కానీ దానిని క్యాష్ చేసుకోలేకపోయింది. ప్రయివేటు ఆపరేటర్లు గ్రామీణ ప్రాంతాల్లోకి ప్రవేశించి యూజర్స్‌ను సంతృప్తి పరిచాయి. వినూత్న ప్యాకేజీలు ఇచ్చాయి. కానీ బీఎస్ఎన్ఎల్ అలా చేయలేకపోయిందని అంటున్నారు.

English summary

ఔట్ ఆఫ్ కవరేజ్ ఏరియా!: బీఎస్ఎన్ఎల్‌కు ప్రైవేటు షాక్, జియో కంటే తక్కువ మార్కెట్! | BSNL hits rock bottom after losing rural edge

Even Reliance Jio, which launched its services in September 2016, has a higher rural market share than BSNL’s at 19.01%.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X