For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏడాదిలో రూ.10,000 కోట్ల బిజినెస్‌పై కన్ను: 300 మందికి అద్భుత అవకాశం!

|

అలీబాబా ఆధ్వర్యంలోని ఇండియన్ ఈ-కామర్స్ సంస్థ పేటీఎం మాల్ త్వరలో కొంతమందిని ఉద్యోగంలోకి తీసుకోనుంది. ఈ మేరకు ఆదివారం నాడు ప్రకటన చేసింది. వివిధ విభాగాల్లోకి దాదాపు 200 మందిని తీసుకున్నట్లు తెలిపింది. రానున్న మరికొన్ని నెలల్లో మరో 300 మందిని తీసుకుంటామని పేర్కొంది. భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న సంస్థల్లో పేటీఎం మాల్ ఒకటి.

<strong>టీసీఎస్, గూగుల్, అమెజాన్ దాటేసిన ఫ్లిప్‌కార్ట్!: ఇండియన్స్ జాబ్ కోరుకునే టాప్ కంపెనీలు ఇవే</strong>టీసీఎస్, గూగుల్, అమెజాన్ దాటేసిన ఫ్లిప్‌కార్ట్!: ఇండియన్స్ జాబ్ కోరుకునే టాప్ కంపెనీలు ఇవే

 మరో 300 మందిని తీసుకుంటామని ప్రకటన

మరో 300 మందిని తీసుకుంటామని ప్రకటన

గత ఆరు నెలల కాలంలో ఆన్‌లైన్ టు ఆఫ్‌లైన్ (ఓ-టు-ఓ)లో ఈ కంపెనీ వృద్ధిరేటు 200 శాతంగా ఉంది. పేటీఎం మాల్ ఎస్వీపీ శ్రీనివాస్ మోతే మాట్లాడుతూ... ఓ-టు-ఓ వ్యాపారంపై మరింత దృష్టి సారించామని, దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు మా టీంను రీఅలైన్ చేశామని, అలాగే బిజినెస్ వృద్ధి కోసం కొత్తగా 200 మందిని తీసుకున్నామని చెప్పారు. తాము త్వరలో మరో మూడు వందల మందిని వ్యాపార వృద్ధి కోసం తీసుకుంటామని చెప్పారు. వ్యాపారం, టెక్నాలజీ, ప్రాడక్ట్ విభాగాలలో వీరిని తీసుకుంటామని తెలిపారు. ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ద్వారా ఎన్నో ప్రాడక్ట్స్‌ను పేటీఎం మాల్ అందుబాటులోకి తీసుకువస్తోంది.

 500 మంది టెక్ టీం

500 మంది టెక్ టీం

మొత్తంగా 500 మంది టెక్ టీంను పేటీఎం మాల్ తీసుకుంటోంది. రానున్న ఏడాదిలో 10,000 కోట్ల వ్యాపారాన్ని టార్గెట్‌గా పెట్టుకుంది. ఆన్‌లైన్ మార్కెట్ స్పేస్‌పై సీరియస్‌గా దృష్టి సారించింది. వ్యాపార వృద్ధి కోసం లార్జ్ ఫార్మాట్ రిటైల్ స్టోర్స్‌తోను ఒప్పందం కుదుర్చుకుంటోంది. క్రోమా, రిలయెన్స్ డిజిటల్, బిగ్ బజార్ వంటి వాటిని భాగస్వామ్యం చేస్తోంది. సామ్‌సంగ్, అసుస్, డెల్, లెనోవా వంటి బ్రాండ్ ఎగ్జిక్యూటివ్ స్టోర్స్‌తోను ఒప్పందం కుదుర్చుకుంది.

 ఎక్కువ మంది ఉద్యోగం కోరుకునే సంస్థల్లో 4వ స్థానంలో పేటీఎం

ఎక్కువ మంది ఉద్యోగం కోరుకునే సంస్థల్లో 4వ స్థానంలో పేటీఎం

కాగా, భారతదేశంలో పని చేసేందుకు అనువైన సంస్థల్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఓయో తర్వాత పేటీఎం 4వ స్థానంలో నిలిచింది. మొదటిస్థానంలో వాల్‌మార్ట్ ఆధీనంలోని ఫ్లిప్‌కార్ట్ నిలిచింది. ఈ సంస్థలో ఉద్యోగం చేయాలనే ఆసక్తిని ఎక్కువ మంది వ్యక్తం చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో ఆమెజాన్, ఓయో (ఆన్‌లైన్ హాస్పిటాలిటీ కంపెనీ), వన్ 97 కామ్ (పేటీఎం), ఉబర్, స్విగ్గీ, టీసీఎస్, జొమాటో, అల్ఫాబెట్, రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ తర్వాత 11 నుంచి 25 స్థానాల్లో వరుసగా ఈవై, అడోబ్, బోస్టన్ కన్సల్ట్, యస్ బ్యాంక్, ఐబీఎం, డయమ్లర్ ఏజీ, ఫ్రెష్ వర్క్స్, యాక్సెంచర్, ఓలా, ఐసీఐసీఐ బ్యాంకు, పీడబ్ల్యుసీ ఇండియా, కేపీఎంజీ ఇండియా, లార్సెన్ అండ్ టుబ్రో, ఒరాకిల్, క్వాల్‌కామ్‌లు ఉన్నాయి. టాప్ 10లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఉబర్, అల్ఫాబెట్‌లు ఇంటర్నెట్‌కు సంబంధించినవి. ఓయో హాస్పిటాలిటీ, టీసీఎస్ ఐటీ అండ్ సర్వీసెస్, రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఆయిల్ అండ్ ఎనర్జీ ఫీల్డులో ఉన్నాయి. స్విగ్గీ, జొమాటోలు ఫుడ్ డెలివరీ సంస్థలు. టాప్ 25లో మాత్రం యస్ బ్యాంకు, ఐసీఐసీఐ వంటి బ్యాంకులు ఉన్నాయి.

English summary

ఏడాదిలో రూ.10,000 కోట్ల బిజినెస్‌పై కన్ను: 300 మందికి అద్భుత అవకాశం! | Paytm Mall plans to hire 300 people in next few months

Alibaba backed Indian e-commerce firm Paytm Mall Sunday said it has hired 200 people across various functions and is planning to hire another 300 in the coming months.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X