For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రైలు టిక్కెట్ క్యాన్సిలేషన్ రీఫండ్: ఇలాంటి సందర్భాల్లో మీ డబ్బు తిరిగి రాదు!

|

న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వేస్ (ఐఆర్‌సీటీసీ) ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ సౌకర్యం ఉన్న విషయం తెలిసిందే. టిక్కెట్లను ఆన్‌లైన్‌లోనే రద్దు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. టిక్కెట్ రద్దు చేస్తే క్యాన్సిలేషన్ ఛార్జీలను వసూలు చేస్తుంది. ఈ టిక్కెట్లను కేవలం ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ (www.irctc.co.in) ద్వారా మాత్రమే మనం రద్దు చేసుగోలం. అది కూడా రైలు చార్ట్ ప్రిపేర్ అవడానికి ముందు వరకే ఈ సౌలభ్యం ఉంది. రైల్వేకౌంటర్‌కు వెళ్లి క్యాన్సిల్ చేసుకోలేం. ఈ టిక్కెట్ రద్దు చేసుకోవడానికి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోని బుక్డ్ టిక్కెట్స్ (booked tickets) పైన క్లిక్ చేయాలి. ఏ టిక్కెట్ రద్దు చేసుకోవాలో దానిని ఎంపిక చేసి, క్యాన్సిల్ చేస్తే రిఫండ్ మీ ఖాతాలో పడుతుంది. మీరు ఏ అకౌంట్‌తో టిక్కెట్ బుక్ చేశారో అదే అకౌంట్లో పడుతుంది. అయితే, కొన్ని సందర్భాల్లో మాత్రం ఐఆర్‌సీటీసీ టిక్కెట్ రీఫండ్ మొత్తాన్ని అందించదు. అవేమిటో చూడండి...

రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు

రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు

1. రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు ఆన్‌లైన్‌లో కన్‌ఫర్మ్ అయిన టిక్కెట్‌ను క్యాన్సిల్ చేయకపోయినా, టీడీఆర్ ఫైల్ చేయకపోయినా రిఫండ్ ఉండదు. 2. ఆర్ఏసీ (రిజర్వేషన్ ఎగైనెస్ట్ క్యాన్సిలేషన్) లేదా వెయిట్‌లిస్ట్ టిక్కెట్స్ క్యాన్సిల్‌ను ట్రైన్ డిపార్చర్ షెడ్యూల్ కంటే 30 నిమిషాల ముందు రద్దు చేసుకోవాలి. లేదంటే డబ్బు రీఫండ్ కాదు. 3. కాంటిగ్నెంట్ క్యాన్సిలేషన్ లేదా వెయిట్ లిస్టెడ్ తత్కాల్ టిక్కెట్ క్యాన్సిలేషన్ విషయంలో రైల్వే నిబంధనల ప్రకారం క్యాన్సిలేషన్ ఛార్జీలు వసూలు చేస్తారు. పూర్తి మొత్తం డబ్బు వెనక్కి రాదు.

రైలు డిపార్చర్‌కు 30 నిమిషాల ముందు

రైలు డిపార్చర్‌కు 30 నిమిషాల ముందు

4. రైలు డిపార్చర్‌కు 30 నిమిషాల ముందు ఆర్ఏసీ ఈ టిక్కెట్స్ క్యాన్సిల్ చేసుకోకపోయినా లేదా టీడీఆర్ ఆన్‌లైన్‌లో ఫైల్ చేయకపోయినా రీఫండ్ కాదు. 5. ఒకవేళ రైలు మూడు గంటలు ఆలస్యంగా నడిస్తే, అప్పుడు ప్రయాణీకులు ప్రయాణం చేయవద్దనుకున్నప్పటికీ రీఫండ్ కాదు. 6. రైలు మూడు గంటలు ఆలస్యంగా నడిచిన సమయంలో రైలు బయలుదేరిన తర్వాత ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ రిక్వెస్ట్ పెట్టినా ఎలాంటి ఫలితం ఉండదు.

ఇలాంటి సందర్భంలోను

ఇలాంటి సందర్భంలోను

7. చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత ఆర్ఏసీ టిక్కెట్ వచ్చింది. అలాంటి సమయంలో ప్రయాణం రద్దు చేసుకుంటే రీఫండ్ రాదు. 8. ఐ-టిక్కెట్స్ పోయినా లేదా మిస్ ప్లేస్ అయినా రీఫండ్ రాదు. ఇక్కడ మరో విషయం, టిక్కెట్ పోయినా, చిరిగిపోయినా, ముక్కలైనా ప్రయాణీకుడికి డూప్లికేట్ టిక్కెట్ ఇస్తారు. రిజర్వ్‌డ్ అకామిడేషన్‌లో ప్రయాణించవచ్చు. 9. పార్షియల్‌గా కన్‌ఫర్మ్ అయిన ఈ-టిక్కెట్స్ ద్వారా ప్రయాణీకులు ట్రావెల్ చేయని సందర్భంలో. 10. ప్రీమియం స్పెషల్ రైళ్లలో సీఎన్ఎఫ్/ఆర్ఏసీ టిక్కెట్ల రద్దుకు అవకాశముండదు. కాబట్టి డబబులు వెనక్కి రావు.

English summary

రైలు టిక్కెట్ క్యాన్సిలేషన్ రీఫండ్: ఇలాంటి సందర్భాల్లో మీ డబ్బు తిరిగి రాదు! | IRCTC ticket cancellation rules 2019: Your refund claim will be rejected in these 10 situations

Indian Railways' tourism and catering arm IRCTC also offers online train ticket booking as well as cancellation services. With regard to the cancellation of train tickets, the IRCTC charges cancellation fees. According to IRCTC, train tickets can be cancelled only through the IRCTC website, www.irctc.co.in, till the preparation of train chart, no cancellations are allowed at face to face IRCTC PNR counters.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X