భారతదేశంలో బంగారం అంటే కేవలం ఆభరణాలు మాత్రమే కాదు. అదొక సెంటిమెంట్ , ఆర్థిక భద్రత. అయితే భవిష్యత్తులో దేశీయంగా బంగారం (Gold) డిమాండ్ కేవలం ఇళ్లకే పరిమితం కాకుండా, పెద్ద పెద్ద సంస్థలు, ఆర్థిక మార్కెట్ల వైపు మళ్ళబోతోందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) సీఈఓ డేవిడ్ టైట్ స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన 'రైజింగ్ భారత్ సమ్మిట్'లో ఆయన మాట్లాడుతూ.. పసిడి రంగంలో రాబోయే మార్పులపై ఆసక్తికర విశ్లేషణ చేశారు.

ధరలు ఎందుకు పెరుగుతూనే ఉన్నాయి?
ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని తాకడానికి కేవలం స్వల్పకాలిక కారణాలు లేవని, దీని వెనుక బలమైన 'స్ట్రక్చరల్ ఫోర్సెస్' ఉన్నాయని టైట్ చెప్పారు. అమెరికా ఆర్థిక వృద్ధి అనూహ్యంగా 6-7 శాతానికి పెరిగి, ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తే తప్ప.. ప్రస్తుతం పెరుగుతున్న బంగారం ధరల జోరు తగ్గదని, కేవలం అప్పుల భారం తగ్గినప్పుడు మాత్రమే పసిడి రేట్లు దిగివచ్చే అవకాశం ఉందని డేవిడ్ టైట్ షాకింగ్ విశ్లేషణ చేశారు. ఆయన ప్రకారం బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా 6 నుంచి 7 కారణాలు ఉన్నాయి.
- భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు: దేశాల మధ్య యుద్ధాలు, అస్థిరత.
- వడ్డీ రేట్లు: అమెరికా వంటి దేశాల్లో వడ్డీ రేట్ల మార్పులు.
- సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు: ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తమ నిల్వలను పెంచుకుంటున్నాయి.
- ప్రపంచ రుణ భయం: ప్రపంచవ్యాప్తంగా అప్పులు విపరీతంగా పెరిగిపోవడం వల్ల పెట్టుబడిదారులు భద్రత కోసం బంగారం వైపు చూస్తున్నారు.
మారుతున్న భారతీయ పెట్టుబడిదారుల తీరు
భారతదేశంలో బంగారం డిమాండ్ ఇప్పుడు సాంప్రదాయ పద్ధతుల నుంచి ఆధునిక పద్ధతులకు మారుతోంది. పెన్షన్ ఫండ్‌లు, ఇన్సూరెన్స్ కంపెనీలు తమ పోర్ట్‌ఫోలియోలో బంగారాన్ని చేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.
- యువత మొగ్గు: నేటి యువత కేవలం నగలను కొనుగోలు చేయడం కంటే, గోల్డ్-బ్యాక్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) , డిజిటల్ బంగారం వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు.
- సులభమైన పెట్టుబడి: బంగారాన్ని కలిగి ఉండటం సులభతరం చేసేందుకు, పారదర్శకత పెంచేందుకు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నిరంతరం కృషి చేస్తోందని ఆయన తెలిపారు.
సెంట్రల్ బ్యాంకులు ఏం చేస్తున్నాయి?
ధరలు ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ, అభివృద్ధి చెందుతున్న దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని విక్రయించడం లేదని, బదులుగా కొనుగోలు చేస్తున్నాయని టైట్ వెల్లడించారు. కరెన్సీల హెచ్చుతగ్గులు , అంతర్జాతీయ రాజకీయ ఒత్తిళ్ల నుంచి రక్షణ పొందేందుకు బంగారం అత్యుత్తమ మార్గమని వారు భావిస్తున్నారు.
డిజిటల్ బంగారం, భవిష్యత్తు
మున్ముందు డిజిటల్ గోల్డ్ మార్కెట్ మరింత విస్తరించనుందని డేవిడ్ టైట్ అభిప్రాయపడ్డారు. భౌతిక బంగారాన్ని ముక్కలు ముక్కలుగా (Fractional Ownership) కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించే సరికొత్త డిజిటల్ మార్కెట్ ను తీసుకురానున్నట్లు ఆయన హింట్ ఇచ్చారు. ఇది కేవలం పెట్టుబడిగా మాత్రమే కాకుండా, లోన్‌లకు షూరిటీగా (Collateral) కూడా ఉపయోగపడేలా తీర్చిదిద్దనున్నారు.
భారతీయ ఇన్వెస్టర్లకు సాంప్రదాయ నగలు, ఆధునిక గోల్డ్ ఈటీఎఫ్‌లు రెండూ సమాంతరంగా సాగుతాయని, అయితే సంస్థాగత పెట్టుబడులు పెరగడం వల్ల మార్కెట్ మరింత బలోపేతం అవుతుందని ఆయన విశ్లేషించారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications