For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లో నైపుణ్యం పెంచుకోవాలి ,పెరగనున్న ఉద్యోగాలు

|

డిజిటల్ టెక్నాలజీ పెరుగుదల ఓవైపు ప్రజల అవసరాలను తీర్చుతుందని భావిస్తున్న నేపథ్యంలోనే వాటి ప్రభావంతో కోత్త ఉద్యోగాలు సృష్టించకపోగా ఉన్న ఉద్యోగాలు కాస్త ఊడుతున్నాయయి.దీంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.అయితే రానున్న రోజుల్లో మాత్రం డిజిటల్ ప్రభావంతో ఊడిన ఉద్యోగాల కంటే ఎక్కువే కోత్త ఉద్యొగాలను సృష్టించబోతుంది డిజిటల్ రంగం.ఇందుకు సంబంధించి పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

2025 నాటికి 6.5 కోట్ల ఉద్యోగాలు

2025 నాటికి 6.5 కోట్ల ఉద్యోగాలు

ఆధునిక సాంకేతికతతో 2025 నాటికి ప్రపంచంలో సుమారు 4.5 కోట్ల ఉద్యోగాలు రూపాంతరం చెందనున్నాయి.అంటే దాదాపు వాటికి ఫుల్ స్టాప్ పెట్టనున్నారు.అయితే ఇదే సమయంలో వీటికి అదనంగా ఉద్యోగాలు సృష్టిబడతయాని ,నాలుగున్నర కోట్ల ఉద్యోగాల స్థానంలో కొత్త టెక్నాలజీతో లాభాలతో ఇదే సమయంలో ఆరున్నర కోట్ల ఉద్యోగాలు సృష్టించబడతాయని మెకిన్సె గ్లోబల్ ఇనిస్టిట్యూట్ తన రిపోర్ట్ లో వెల్లడిచింది.అయితే ఈనేపథ్యంలోనే భవిష్యత్ టెక్నాలజీల్లో శిక్షణ ఇవ్వాలని అప్పుడే వారికి కోత్త ఉద్యోగాలు అప్పగించాలని తెలిపింది.

 డిజిటల్ రంగం పెరుగుదుల

డిజిటల్ రంగం పెరుగుదుల

వచ్చే అయిదేళ్లలో స్థూల దేశీయోత్పత్తిలో ఐటి,సాఫ్ట్ వేర్, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ ,డిజిటల్ కమ్యూనికేషన్ ,ఎలక్ట్రానిక్ వంటీ డిజిటల్ రంగాల వాటా రెట్టింపు స్థాయి లో ఉండి సుమారు 43వేల కోట్ల డాలర్లకు పెరగవచ్చని మెకిన్సే సంస్థ తన రిపోర్ట్ లో పేర్కోంది.

నైపుణ్యం కోసం పలు సూచనలు చేసిన నివేదిక

నైపుణ్యం కోసం పలు సూచనలు చేసిన నివేదిక

కాగా ఇందుకోసం పలు సూచనలు చేసింది.ముఖ్యంగా కంపనీలు తమ సాంకేతిక సామర్ధ్యాలను పెంచుకునేందుకు తగినన్ని పెట్టుబడులు పెట్టాలని సూచించింది.ఇందుకోసం అవసరమైతే విశ్వవిద్యాలయాలు తో కలిసి ముందుకు సాగాలని పేర్కేంది. ఇక స్టార్టప్ లపై కూడ ప్రత్యేక దృష్టి ప్రభుత్వాలు సారించాలని తెలిపింది.ఇండస్ట్ర్రీలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనించి తమ ఉద్యోగంకు సంబంధించి ప్రభావం చూపవచ్చన్న విషయాలపై అవగహన కల్పించాలని పేర్కోంది.కాగా డిజిటల్ టెక్నాలజీ వినియోగంతో వ్యవసాయం, ఇంధనం,ఆర్ధిక సేవలు ,హెల్త్ కేర్, లాజిస్టిక్స్, రిటైల్ రంగాలు ఓక్కోక్కటి 15000 కోట్ల డాలర్ల మేర లబ్ధి పోందందేందుకు అవకాశం ఉన్నట్టు తెలిపింది.

భారీతీయులు సాంకేతిక నైపుణ్యం పెంచుకోవాలి

భారీతీయులు సాంకేతిక నైపుణ్యం పెంచుకోవాలి

అయితే భారతీయ టెకీల నైపుణ్యాలపై సాంకేతిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు ,భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు ప్రస్తుతం ఉన్న నైపుణ్యం పనికొస్తాయా అనుమానాలు నెలకోన్నాయి.ఇందుకు కారణం దేశీయ వ్యాపారాల్లో డిజిటలైజేషన్ ,శరవేగంగా జరుతున్నప్పటికి సమవృద్ది జరగడం లేదు,అన్ని రంగాల్లోనూ డిజిటలైజేషన్ విషయంలో వెనుకబడుతున్న వ్యాపారులుండడం ఇందుకు కారణం

Read more about: jobs india ఇండియా
English summary

సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లో నైపుణ్యం పెంచుకోవాలి ,పెరగనున్న ఉద్యోగాలు | Digital Tecnology to transform in india

With the impact of digital technology ,jobs are getting down, However, in the coming days, the digital sector is going to create more cuts than digital jobs.Mckinsey global Institute report
Story first published: Saturday, March 30, 2019, 14:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X