For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యథాతథంగా ఫెడ్ వడ్డీరేట్లు: నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వరమేనా?

|

న్యూఢిల్లీ: ఫెడ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కలిసి వస్తుందా అంటే అవుననే వాదన వినిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు రూపాయి గతంలో లేనంతగా బలహీనపడింది. గత ఏడాది అక్టోబర్ నెలలో ఓసారి రూపాయి విలువ దాదాపు రూ.74కు పడిపోయింది. ఆర్బీఐ రంగంలోకి దిగి డాలర్ రిజర్వ్‌లను తగ్గించుకుంది.

బంపరాఫర్: వొడాఫోన్ ఐడియా 52 శాతం డిస్కౌంట్!బంపరాఫర్: వొడాఫోన్ ఐడియా 52 శాతం డిస్కౌంట్!

చమురు ధరలు పెరిగాయి. దీనికి తోడు ఫెడ్‌ వడ్డీరేట్లను పెంచుతూ వెళ్లింది. ఫలితంగా భారత్‌లో విదేశీ పెట్టుబడులకు ఊపు వచ్చింది. విదేశీ మదుపుదార్లు... రూపాయల్లో ఉన్న తమ పెట్టుబడులను అమ్మేసి డాలర్లను కొనుగోలు చేశారు. దీంతో రూపాయి మరింత బలహీనపడింది.

Fed hints at no rate hike in 2019; move positive for Indian equities

రూపాయి బలహీనపడడంతో ప్రతిపక్షాలు నిప్పులు చెరిగాయి. ఈ పరిస్థితుల్లో చమురు దిగుమతులను ఆపలేని పరిస్థితి. బంగారం దిగుమతులను మాత్రం కాస్త అదుపు చేయవచ్చు. అప్పటికే ఫెడ్ వడ్డీ రేట్లు 2.25 స్థాయిని చేరుకున్నాయి. దీంతో 2.25-2.50 మధ్య వడ్డీ రేట్లు ఉండాలన్న లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో ఆ తర్వాత ఫెడ్‌ వడ్డీరేట్లను పెంచడం నిలిపివేసింది. దీంతో రూపాయి విలువ నెమ్మదిగా పుంజుకుంది. కొన్ని నెలల తర్వాత తాజగా రూ.68 మార్కు దిగువకు రూపాయి చేరింది.

రూపాయి విలువ తగ్గుతూ వచ్చిన నేపథ్యంలో మరోసారి ఫెడ్ వడ్డీ రేట్లను పెంచవచ్చుననే ఊహాగానాలు వినిపించాయి. ఇదే సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఈ సమయంలో రూపాయి విలువ పడిపోతే ధరలు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో ఫెడ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఊరటనిచ్చింది.

English summary

యథాతథంగా ఫెడ్ వడ్డీరేట్లు: నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వరమేనా? | Fed hints at no rate hike in 2019; move positive for Indian equities

The US Federal Reserve at its March meeting said it would be patient in changing policy rates. The move comes in the backdrop of global economic concerns and muted inflationary pressures.
Story first published: Thursday, March 21, 2019, 16:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X