న్యూఢిల్లీ: ప్రపంచంలోని చవకైన నగరాల్లో భారతదేశం నుంచి మూడు ఉన్నాయి. ప్యారిస్, సింగపూర్, హాంగ్‌కాంగ్ వంటి నగరాలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో ఉన్నాయి. భారత్‍లోని ఢిల్లీ, చెన్నై, బెంగళూరు నగరాలు చవకైన నగరాల జాబితాలో ఉన్నాయి.
ఎకనామిక్ ఇంటెలిజెంట్ యూనిట్‌కు చెందిన 2019 వరల్డ్‌వైడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ఈ వివరాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 133 నగరాల్లో 150 వస్తువుల ధరలను సమీక్షించి ఈ జాబితాను రూపొందించారు. ఖరీదైన నగరాల జాబితాలో స్విట్జర్లాండ్‌లోని జురిచ్ నాలుగో స్థానంలో ఉండగా, జపాన్‌లోని ఒసాకో, స్విట్జర్లాండ్‌లోని జెనీవా కలిసి అయిదో స్థానాన్ని పంచుకున్నాయి.

ప్రపంచంలోనే నివాసానికి అత్యంత చౌకైన నగరాల జాబితాలో కరాకస్ (వెనుజువేలా), డమస్కస్ (సిరియా), తాష్కెంట్ (ఉజ్జెకిస్థాన్), అలమటీ (కజకిస్థాన్, కరాచి (పాకిస్థాన్), లాగోస్ (నైజీరియా)లతో పాటు భారత్‌కు చెందిన బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఉన్నాయి.


Click it and Unblock the Notifications