For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మధ్యంతర బడ్జెట్ లో ఉద్యోగస్తులకు భారీ ఊరట.

మధ్యంతర ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ భారీ పన్నుల ఉపశమనాన్ని అందించడం ద్వారా మధ్యతరగతిని ఆకట్టుకున్నాడు.

By bharath
|

ముందుగా ఊహించినట్టే బడ్జెట్ లో పలు విధాల అంశాలు ఉండటం గమనార్హం. రైతులకు మరియు పేదలకు పెద్ద ఎత్తున తాయిలాలు ఇచ్చిన తరువాత, మధ్యంతర ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ భారీ పన్నుల ఉపశమనాన్ని అందించడం ద్వారా మధ్యతరగతిని ఆకట్టుకున్నాడు.

పన్నుచెల్లింపుదారులకు

పన్నుచెల్లింపుదారులకు

గోయల్ తన తాత్కాలిక బడ్జెట్ 2019 ప్రసంగంలో వ్యక్తుల పన్నుచెల్లింపుదారులకు రూ .5 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపును ప్రకటించారు.

బడ్జెట్ లో ప్రభుత్వం ముక్యంగా రైతులు మరియు మధ్యతరగతి ప్రజలపై ఎక్కువ దృష్టి సారించిందనే చెప్పవచ్చు.

మధ్యతరగతి ప్రజలు

మధ్యతరగతి ప్రజలు

మధ్యతరగతి ప్రజలు సాంప్రదాయకంగా బిజెపి కి పెద్ద ఓటు బ్యాంకు అని అంటున్నారు. వేతన జీవులకు పన్ను మినహాయింపు పరిమితిని రెట్టింపు చేసింది. ఆదాయపు పన్ను పరిమితి పెంపును రూ.5లక్షల వరకు పెంచింది. ప్రస్తుతం పన్ను మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలుగా ఉన్న విషయం తెలిసిందే.

వ్యవసాయ రంగానికి

వ్యవసాయ రంగానికి

కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుతం ప్రకటించిన రుణ మాఫీ ఎదుర్కొనేందుకు మోడి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద మొత్తాలను అందించిందని భావిస్తున్నారు. కానీ ET బడ్జెట్ సర్వే ఆధారంగా మధ్యతరగతి కుటుంబాలు పెద్ద ఉపశమనం కావాలని కోరుకుంటున్నట్టు తెలిపింది.

ఉద్యోగులకు

ఉద్యోగులకు

పన్ను మినహాయింపు పరిమితి రెట్టింపు వల్ల ఉద్యోగులకు రూ.12,500 వరకు భారం తగ్గుతుంది. సెక్షన్ 80 సీ కింద రూ.1.5 లక్షల ఇన్వెస్ట్‌మెంట్లు, రూ.5 లక్షల పన్ను మినహాయింపు కలుపుకుంటే మొత్తంగా రూ.6.5 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. దీని వల్ల 3 కోట్ల ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది.

పన్ను

పన్ను

ప్రస్తుతం, 2.5 లక్షల రూపాయల వ్యక్తిగత ఆదాయం నుండి పన్ను మినహాయించబడింది. 2.5 నుండి 5 లక్షల రూపాయల మధ్య ఆదాయం 5 శాతం పన్ను వసూలు చేస్తుండగా, 5-10 లక్షల మధ్య 20 శాతం పన్ను విధించబడుతుంది. 10 లక్షల రూపాయల కన్నా ఆదాయం ఉంటే 30 శాతం పన్ను విధించబడుతుంది.

పరిశ్రమల సభ

పరిశ్రమల సభ

5 లక్షల రూపాయల ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు స్థాయిని డబుల్ చేయాలని పరిశ్రమల సభ CII ని కోరింది. 5 లక్షల రూపాయలకు లోబడి ఆదాయం ఉంటే పన్ను మినహాయించాలని అలాగే 5-10 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వారికీ 10 శాతం కంటే తక్కువ పన్ను విధించాలి అని పరిశ్రమల విభాగం సిఫార్సు చేసింది మరియు రు.10-20 లక్షల మధ్య ఆదాయం కోసం, పన్ను రేటు 20 శాతం ఉండాలి. 20 లక్షల రూపాయలకు పైగా సంపాదించినవారికి 25 శాతం పన్ను విధించాలి అని కోరింది.

English summary

మధ్యంతర బడ్జెట్ లో ఉద్యోగస్తులకు భారీ ఊరట. | Mega Relief For Middle Class: No Tax Up To Rs 5 Lakh

A pre-poll Budget which was expected to have a please-all package has lived up to expectations. After offering big sops to farmers and the poor, Interim Finance Minister Piyush Goyal impressed the middle class by offering a huge tax relief.
Story first published: Friday, February 1, 2019, 16:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X