For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆల్ ఫ్రీ అంటున్న రాజకీయ పార్టీలు?ఇంతకీ ఈ సంగతేంటో మిరే చూడండి?

దేశ ప్రజలకు ఆల్ ఫ్రీ అంటున్న ప్రభుత్వాలు ఏంటి అవాక్కయ్యారా అవునండి మీరు విన్నది నిజమే ఎన్నికల సీసన్ ముంచుకొస్తున్న తరుణంలో అన్ని పార్టీలు ప్రజారాలను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యాయి.

By bharath
|

దేశ ప్రజలకు ఆల్ ఫ్రీ అంటున్న ప్రభుత్వాలు ఏంటి అవాక్కయ్యారా అవునండి మీరు విన్నది నిజమే ఎన్నికల సీసన్ ముంచుకొస్తున్న తరుణంలో అన్ని పార్టీలు ప్రజలను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యాయి.ప్రజల సంక్షేమమే మా ప్రధాన ఎజండా అంటూ పలు రాజకీయ పార్టీలు నినాదాలు చేస్తున్నాయి.

ప్రజలకు వరాలు:

ప్రజలకు వరాలు:

ప్రజల సంక్షేమం తమకు ముఖ్యమని పలు వరాల జల్లు కురిపిస్తున్నాయి వీటిలో ప్రధానంగా పింఛన్లు,నిరుద్యోగ భృతి,విద్యుత్ బకాయిల రద్దు మరియు రైతు రుణ మాఫీ వంటి అంశాలు ఉన్నాయి.ప్రస్తుతం ప్రధాన పార్టీలు అన్ని రైతుల మద్దతు కోసం అనేక హామీలను కురిపిస్తున్నాయి.

ప్రధాన పార్టీలు:

ప్రధాన పార్టీలు:

ప్రస్తుతం కేంద్రం లో ఉన్న బిజెపి మరియు యుపిఎ ప్రభుత్వాలు ఆల్ ఫ్రీ పథకాలే రేపటి విజయానికి సోపానాలు అన్నట్టుగా ముందుకు వెళ్తున్నాయి.ప్రధానంగా రైతు రుణమాఫీ అనేది దేశవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం ఉంది.ప్రస్తుతం మన దేశంలో రైతుల పరిస్థితి అగమ్యగోచనంగా ఉంది సకాలంలో వర్షాలు రాక అలాగే పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకా చాల ఇబందులు పడుతున్న విషయం విదితమే.

సార్వత్రిక ఎన్నికలు:

సార్వత్రిక ఎన్నికలు:

మరో మూడు నెలల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మాఫీల మాట ఊపందుకుంది.ప్రధానంగా ఈ పోటీ బిజెపి మరియు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ పోటీ కనిపిస్తోంది.ఈ మధ్య జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల తరువాత పార్టీలన్నీ ఇప్పుడు సంక్షేమం పైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం:

కాంగ్రెస్ ప్రభుత్వం:

రైతు రుణమాఫీ మరియు పంట మద్దతు ధర హామీ ఇచ్చిన కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది ఇక మధ్యప్రదేశ్ సియం కమల్నాథ్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలిసంతకం రైతు రుణమాఫీ ఫైల్ పై చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.అంతే కాకుండా రాజస్థాన్ మరియు చత్తిస్గఢ్ రాష్ట్రాల్లో పది రోజుల్లో రుణమాఫీ చేస్తామని హామీకూడా ఇచ్చింది.

బిజెపి పై దండయాత్ర:

బిజెపి పై దండయాత్ర:

ఈ రుణమాఫీ అంశాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ దూకుడు పెంచింది,రైతులకు వ్యతిరేకంగా పాలసీ విధానాలను అవలంబిస్తున్న బిజెపి ప్రభుత్వం రుణమాఫీ చేసేవరకు నిద్రపోనివ్వనని రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేసారు.మోడీ సర్కార్ వచ్చి నాలుగేళ్లు గడిచినా రైతులకు ఒక్కరూపాయి కూడా రుణమాఫీ చేసిన పాపాన పోలేదని విపక్షాలు ఆరోపణలు చేసాయి.

మోడీ కి పెను సవాల్:

మోడీ కి పెను సవాల్:

కాంగ్రెస్ 2019 లో అధికారం లోకి వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా రైతుల రుణమాఫి చేస్తామని ఇప్పటికే ప్రకటించింది ఇందులో భాగంగానే గెలిచిన మూడు రాష్ట్రాల్లో రుణమాఫీ చేయడానికి రంగం సిద్ధం చేసింది,ఈ పరిణామం మోడీకి పెద్ద షాక్ అనే చెప్పవచ్చు.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇదే కీలకం కాబోతోంది.ఇక రాహుల్ గాంధీ మాటల తూటాలకు మోడీ సర్కార్ డిఫెన్స్ లో పడింది.

బిజెపి పాలిత రాష్ట్రాల్లో:

బిజెపి పాలిత రాష్ట్రాల్లో:

ప్రస్తుతం బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతుల నుండి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి ముక్యంగా ఉత్తరాదిన ఈ డిమాండ్ కమలనాథులకు చెమటలు పుట్టిస్తోంది.కమల్నాథ్ సంతకం చేసిన రెండురోజులకే గుజరాత్ లో బిజెపి సర్కార్ రైతులకు ఉన్న మొత్తం విద్యుత్ బకాయిలు మాఫీ చేసింది.మొత్తం వ్యయం రూ.650 కోట్ల రూపాయల బకాయిలను మాఫీ చేస్తూ ఆదేశాలు జారీచేసింది.ఐతే ఈ మాఫీ కేవలం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేసింది.

ప్రజల తీర్పు:

ప్రజల తీర్పు:

ప్రధాన పార్టీలు అన్ని ప్రజలపై హామీల వర్షాలు కురిపిస్తున్నాయి,ఐతే ప్రజలు ఎవరికీ మద్దతిస్తారో మరో ఆరు నెలలు వేచిచూడాలి.అంతిమంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఉన్న రైతుల మనసులు ఏ పార్టీ గెలుచుకుంటుందో వారినే విజయం వారించే అవకాశాలు చాల ఉన్నాయి.

English summary

ఆల్ ఫ్రీ అంటున్న రాజకీయ పార్టీలు?ఇంతకీ ఈ సంగతేంటో మిరే చూడండి? | Ahead Of Elections All Political Parties Focus On Welfare Schemes.

You have heard that all the political parties are engaged in appealing to the people during the election season. Many political parties are slogging our people's welfare.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X