For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏకంగ రూ.600 కోట్ల రూపాయల కుచ్చుటోపీ?అక్షరాలా 57 కేజీల బంగారు దేనికోసం?

బెంగళూరులోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు గనుల ఘనుడు, మాజీ మంత్రి గలి జనార్దన్ రెడ్డి నివాసంపై సోమవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు.

By bharath
|

మనకు ఎవరిపేరు గుర్తొస్తే మైనింగ్ మాఫియా గుర్తొస్తుందో,ఎవరిపేరు చెబితే వామ్మో అతన అని అందరు అవాక్కవుతారో అతడే కర్ణాటక రాష్ట్రము బళ్లారికి చెందిన మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి.ఇతను బళ్లారిలో అత్యంత కీలకమైన రాజకీయ నేత.కర్ణాటక ఎన్నికలు ఒకప్పుడు ఈయన కనుసన్నల్లో నడిచాయి అంటే అర్థంచేసుకోండి ఈయన కథ ఎంత ఉంటుందో.

మైనింగ్ సామ్రాజ్యం:

మైనింగ్ సామ్రాజ్యం:

గాలి బళ్లారిలో అక్రమ గనులు తవ్వకాలు అనుమతులు లేకుండా ఇష్టానుసారం తవ్వేసి వేలకోట్ల రూపాయలు కొల్లగొట్టాడు.అడ్డు వచ్చిన అధికారులందర్కి డబ్బు ఎర చూపి తనకు ఎదురులేకుండా చేసుకునేవారు.అతి తక్కువ కాలం లోనే అత్యంత సంపన్నులో ఒక్కడుగా గాలి నిలిచాడు.

ఖరీదయిన జీవితం:

ఖరీదయిన జీవితం:

గాలి ఖరీదయిన జీవితం గురించి తెలిస్తే ప్రతిఒక్కరు నోళ్లు ఎళ్ళబెట్టాల్సిందే ఔను ఇది ముమ్మాటికీ నిజం ఇతను తినే పళ్లెం బంగారు తో తాయారు చేసినవి అలాగే స్పూన్లు కూడా బంగారంతో తయారుచేసినవే ఆఖరికి బాత్ రూమ్ లో ఉండే పరికరాలు మొత్తం బంగారం తో తయారు చేసినవే.ఇతనికి ఏకంగ మూడు ఖరీదయిన హెలికాఫ్టర్లు ఉన్నాయి ఉదయం అల్పాహారం అలాగే భోజనం చేయడానికి ఇతర దేశాలకు హెలీకాఫ్టర్లలో వెళ్లి వస్తాడు.

కర్ణాటక ఉప ఎన్నికలు:

కర్ణాటక ఉప ఎన్నికలు:

మొన్న జరిగిన కర్ణాటక ఉప ఎన్నికల్లో బళ్లారిలో గత రెండు దశాబ్దాలుగా గాలి గుప్పెట్లో ఉండే పార్లమెంటు స్తానం గోర పరాజయం పాలయినది ఏకంగ లక్ష కు పైన మెజారిటీ తో గాలి అనుచరుడు పరాజయం పాలయ్యాడు.ఇదిలా ఉండగా గాలి మెడకు మరో అక్రమ కేసు చుట్టుకుంది.

రూ.600 కోట్లు కుచ్చుటోపీ:

రూ.600 కోట్లు కుచ్చుటోపీ:

ప్రజల నుండి డబ్బు వాసులు చేసి ఏకంగ రూ.600 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన అంబిడెంట్ట్ కంపెనీ ని ED కేసు నుండి కాపాడేందుకు గాలి రూ. 20 కోట్లు ఒప్పందం చేసుకున్నాడని నిరూపణ జరిగింది.ఇది తెలిసిన వెంటనే అప్రమత్తమైన గాలి ప్రస్తతం పరారీలో ఉన్నాడు.ఇతడి కోసం కర్ణాటక పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు:

సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు:

బెంగళూరులోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు గనుల ఘనుడు, మాజీ మంత్రి గలి జనార్దన్ రెడ్డి నివాసంపై సోమవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు, నగదు బదిలీ కేసులో రెడ్డి రూ. 20 కోట్లు తీసుకోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. బెంగళూరు కు సంబందించిన ఒక ప్రైవేటు సంస్థ ను కేసు నుండి తప్పించేందుకు గాలి అక్రమాలకు పాల్పడ్డాడని పేర్కొన్నారు.

ఉదయం 6 గంటలకు

ఉదయం 6 గంటలకు

ఉదయం 6 గంటలకు దాడులు నిర్వహించామని ఆ సమయంలో గాలి భార్య లక్ష్మి అరుణ అలాగే ఆమె తండ్రి పరమేశ్వర్ మరియు తల్లి నగలక్ష్మమ్మ ఇంట్లో ఉన్నారని అధికారులు వెల్లడించారు.

సయ్యద్ అహ్మద్ ఫరీద్:

సయ్యద్ అహ్మద్ ఫరీద్:

అంబిడెంట్ మార్కెటింగ్ ప్రెసిడెంట్ స్థాపకుడు సయ్యద్ అహ్మద్ ఫరీద్ ఈ కేసుకు సంబంధించి రెడ్డి కి రూ.20 కోట్ల రూపాయలు చెల్లించగా, నగదు రూపంలో 2 కోట్ల రూపాయలు మరియు రూ.18 కోట్ల విలువైన బంగారు కడ్డీలను ఇచ్చాడని విచారణలో వెల్లడయినది.

దాడులు వార్త తెలిసిన వెంటనే

దాడులు వార్త తెలిసిన వెంటనే

రెడ్డి నివాసంలో సి.సి.బి. పోలీసుల దాడులు వార్త తెలిసిన వెంటనే, ఆయన సన్నిహితుడు, మోలాకల్ముర్ బిజెపి ఎమ్మెల్యే స్థిరములు అలాగే ఆంధ్రప్రదేశ్ లోని రాయదుర్గానికి చెందిన మాజీ వైఎస్ఆర్సి శాసనసభ్యుడు కపు రామచంద్రరెడ్డి గాలి నివాసానికి చేరుకున్నారు.

సి.సి.బి సోదాల సమయంలో

సి.సి.బి సోదాల సమయంలో

సి.సి.బి సోదాల సమయంలో గాలి అత్తగారు నగలక్ష్మమ్మ తీవ్ర అభ్యన్తరం తెలిపింది అధికారులపై తీవ్రంగా మండిపడింది పండుగ రోజు సోదాలు చేయడం ఏంటని ప్రశ్నించింది అలాగే గాలి సన్నిహితుడు శ్రీరాములు మాట్లాడుతూ సరైన సమాచారం లేడకుండా దాడులు నిర్వహిస్తున్న అధికారులపై మండిపడ్డాడు.

Read more about: ed money laundering fraud mining
English summary

ఏకంగ రూ.600 కోట్ల రూపాయల కుచ్చుటోపీ?అక్షరాలా 57 కేజీల బంగారు దేనికోసం? | Karnataka Police Raid Gali Janardhan Reddy’s Home

Central Crime Branch officials from Bengaluru swooped down on the palatial residence of mining baron and former minister Gali Janardhan Reddy in Ballari on Thursday in a money laundering case
Story first published: Friday, November 9, 2018, 11:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X