For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిరవ్ మోడీ కి సంబందించిన ఆభరణాలు సీజ్?

వజ్రాభరణాల వ్యాపారులు నీరవ్‌ మోదీకి సంబంధించిన నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌, సీబీఐ సోదాలు నిర్వహిస్తున్నాయి. గత మూడు రోజులుగా జరిపిన సోదాల్లో రూ.26 కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి.

|

వజ్రాభరణాల వ్యాపారులు నీరవ్‌ మోదీకి సంబంధించిన నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌, సీబీఐ సోదాలు నిర్వహిస్తున్నాయి. గత మూడు రోజులుగా జరిపిన సోదాల్లో రూ.26 కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి.

నిరవ్ మోడీ కి సంబందించిన ఆభరణాలు సీజ్?

వీటిల్లో పురాతన నగలు కూడా ఉన్నాయి. వీటివిలువ దాదాపు రూ.15 కోట్ల పైమాటే. వీటితోపాటు రూ.1.4 కోట్ల విలువైన డైమండ్‌ వాచ్‌‌తోపాటు... రూ.10 కోట్ల విలువైన ఒక డైమండ్‌ రింగ్‌ కూడా లభ్యమైంది. ఎంఎఫ్‌ హుస్సేన్‌, అమ్రితా షేర్‌-గిల్‌, కెకె హెబ్బార్‌ వంటి ప్రముఖ చిత్రకారులు గీచిన దాదాపు రూ.10 కోట్ల విలువైన పెయింటింగ్స్‌ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

తాజాగా జరుగుతున్న సోదాలతో... ఇప్పటి వరకు నీరవ్‌ మోదీ నివాసాలు, వ్యాపార సంస్థల నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ రూ.7,664 కోట్లకు చేరింది.

వజ్రాల వ్యాపారులు.. నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు రూ.13,000 కోట్లు ఎగనామం పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ... విదేశాల్లో ఉంటున్నారు. వీరిని భారత్‌ రప్పించేందుకు... ఎన్‌ఫోర్స్‌మెంట్‌, సీబీఐ సంస్థలు ఇంటర్‌పోల్‌ సహాయాన్ని కోరాయి.

English summary

నిరవ్ మోడీ కి సంబందించిన ఆభరణాలు సీజ్? | ED Seizes Assets Wworth RS 26 CR From NIRAV MODI’S City Aapartment

A fresh seizure of antique jewellery, costly watches and paintings of Amrita Sher-Gil and M F Hussain, together worth Rs 26 crore, has been made by the ED from the sea-facing Mumbai apartment of diamantaire Nirav Modi in connection with the over Rs 12,000 crore PNB fraud case.
Story first published: Monday, March 26, 2018, 11:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X