For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌రువు నివార‌ణ ప్రాజెక్టుతో 1.5 ల‌క్ష‌ల రైతుల ఇక్క‌ట్లు దూరం

రాయ‌ల‌సీమ,ప్ర‌కాశం జిల్లాల్లో ప‌రిస్థితిని అరిక‌ట్ట‌డానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం, భార‌త ప్ర‌భుత్వం సంయుక్తంగా ఒక ప్రాజెక్టును చేప‌ట్టాయి. దాని పేరు ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌రువు నివార‌ణ ప్రాజెక్టు. దాని

|

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ద‌క్షిణ భాగం చాలా వ‌ర‌కూ క్షామ పీడితంగా ఉంది. ఇక్క‌డ వాతావ‌ర‌ణం, నేల స్వ‌భావం కార‌ణంగా నీరు నిల్వ ఉండే సామ‌ర్థ్యం ఎక్కువ ఉండ‌దు. వాతావ‌ర‌ణం త‌క్కువ రావ‌డం, త‌రుచూ క‌రువులు, ఎక్కువ బోర్లు వేయ‌డం వంటి కార‌ణాల రీత్యా భూగ‌ర్భ జ‌లాలు ప‌రిమితంగా ఉంటాయి. ప్ర‌భుత్వ నియంత్ర‌ణ సంస్థ‌లు స‌రిగా ప‌నిచేయ‌ని కార‌ణంగా విప‌రీతంగా బోర్లు వేశారు. దీంతో ఇప్పుడు భూగ‌ర్భ జ‌లాలు అడుగంటి పోయాయి. అనంత‌పురం లాంటి జిల్లాలో తాగ‌డానికి సైతం నీరు లేని పరిస్థితి నెల‌కొంది. ఈ ప‌రిస్థితిని అరిక‌ట్ట‌డానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం, భార‌త ప్ర‌భుత్వం సంయుక్తంగా ఒక ప్రాజెక్టును చేప‌ట్టాయి. దాని పేరు ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌రువు నివార‌ణ ప్రాజెక్టు. దాని గురించి ప‌లు ముఖ్య విష‌యాలు తెలుగు గుడ్‌రిట‌ర్న్స్ పాఠ‌కుల కోసం...

ప్రాజెక్టు ప‌రిధి

ప్రాజెక్టు ప‌రిధి

ఈ క‌రువు నివార‌ణ ప్రాజెక్టును ప్ర‌ధానంగా 5 జిల్లాలో చేప‌డుతున్నారు. రాయ‌ల‌సీమ‌లోని 4 జిల్లాలు, ప్ర‌కాశం జిల్లాల‌ను ఈ ప్రాజెక్టు కోసం ఎంచుకున్నారు. ఈ జిల్లాల్లో దాదాపు 330 గ్రామ పంచాయ‌తీల్లో ప్రాజెక్టు కింద ప‌నులు చేప‌డ‌తారు. హైద‌రాబాద్‌కు చెందిన వాట‌ర్‌షెడ్ స‌పోర్ట్ స‌ర్వీసెస్ అండ్ యాక్టివిటీ నెట్వ‌ర్క్(వాస‌న్) సాంకేతిక ఏజెన్సీగా ఎంపిక‌వ‌గా, ఇంకా హైద‌రాబాద్, రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన 9 ఎన్‌జీవోల‌ను ఎంచుకున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం నిర్వ‌హ‌ణ కోసం 1000 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చుపెట్ట‌బోతున్నారు. ప్రాజెక్టు వెబ్‌సైట్:http://www.apdmp.in/

అనంత‌పూర్ జిల్లాలో ఎంచుకున్న మండ‌లాలు

అనంత‌పూర్ జిల్లాలో ఎంచుకున్న మండ‌లాలు

అనంత‌పురం-1లో భాగంగా శింగ‌న‌మ‌ల‌, పుట్లూరు, పెద్ద‌ప‌ప్పూరు, నార్ప‌ల‌, గార్ల‌దిన్నె, య‌ల్ల‌నూరు, తాడిమ‌ర్రి, బ‌త్త‌ల‌ప‌ల్లి, ముదిగుబ్బ‌, బుక్క‌ప‌ట్నం, కొత్త చెరువు, పెనుకొండ‌, సోమందేప‌ల్లి, రొద్దం,

అనంత‌పురం-2లో భాగంగా కళ్యాణ‌దుర్గం, కూడేరు, కంబదూరు, బ్ర‌హ్మ‌స‌ముద్రం, కుందుర్పి, కంగాన‌ప‌ల్లి, బెళుగుప్ప‌, రాప్తాడు, ఆత్మ‌కూరు, రామ‌గిరి, గుమ్మ‌గట్ట‌,

అనంత‌పురం-3 లో భాగంగా త‌న‌క‌ల్లు, ఓబుళ‌దేవ‌ర చెరువు, నంబుల‌పూల‌కుంట‌, అగ‌ళి, అమ‌రాపురం, రొళ్ల‌, అమ‌డ‌గూరు, మ‌డ‌క‌శిర, ప‌రిగి, లేపాక్షి, గాండ్ల‌పెంట‌, గుడిబండ‌, తలుపుల‌, న‌ల్ల‌మాడ మొద‌లైన మండ‌లాల‌ను ఎంచుకున్నారు.

చిత్తూరు జిల్లాలో ఎంచుకున్న మండ‌లాలు

చిత్తూరు జిల్లాలో ఎంచుకున్న మండ‌లాలు

బి.కొత్త కోట‌, తంబ‌ళ్ల‌ప‌ల్లె, రామ‌స‌ముద్రం, పుంగ‌నూరు, పెద్ద తిప్ప స‌ముద్రం, నిమ్మ‌న‌ప‌ల్లి, చౌడేప‌ల్లి, ముల‌క‌ల‌చెరువు, పెద్ద‌మాండ్యం, గుర్రంకొండ‌, పెద్ద‌పంజని, రామ‌కుప్పం త‌వ‌నంప‌ల్లి, శాంతిపురం, గుడుప‌ల్లె, చిన్న‌గొట్టిగ‌ల్లు, శ్రీ‌రంగ‌రాజ‌పురం, గంగాధ‌ర‌నెల్లూరు, పులిచెర్ల‌, పూత‌ల‌ప‌ట్టు, కారువేటిన‌గ‌ర్, క‌ల‌క‌డ‌, పాల‌స‌ముద్రం, కంభంవారిప‌ల్లి

క‌ర్నూలు జిల్లాలో ఎంచుకున్న మండ‌లాలు

క‌ర్నూలు జిల్లాలో ఎంచుకున్న మండ‌లాలు

Peddakadubur, Jupadu Bunglow, Midthur, C.Belegal, Kallur 2, Kodumur, Gudur1, Mantralayam, Nandavaram, Krishnagiri,Alur, Chippagiri, Maddikera East, Tuggali, Pattikonda, Peapaly, Dhone, Aspari, Devanakonda, Halaharvi, Holagunda,Kolimigundla,

 క‌డ‌ప జిల్లాలో ఎంచుకున్న మండ‌లాలు

క‌డ‌ప జిల్లాలో ఎంచుకున్న మండ‌లాలు

Vemula, Pendlimarri, Kondapuram1, Simhadripuram,Sambepalle, Peddamudium, Thondur, Mylavaram1,

మొత్తం రాయ‌ల‌సీమ‌లోనే క‌డ‌ప నుంచి అతి త‌క్కువ‌గా మండ‌లాల‌ను ఎంచుకున్నారు.

ప్ర‌కాశం జిల్లా

ప్ర‌కాశం జిల్లా

Dornala, Pedaaraveedu, Racherla, Giddalur, Hanumanthunipadu, Donakonda, Konakanamitla, ChandrasekharaPuram, Pamur, Marripudi, Darsi, Podili, Mundlamuru, Tarlupau, Komarolu

భార‌త‌దేశంలో వృద్ది, పేద‌రికంలో మార్పులు

భార‌త‌దేశంలో వృద్ది, పేద‌రికంలో మార్పులు

మ‌న దేశం ప్ర‌స్తుతం మూడో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ స్థాయిలో ఉంది. 2004 నుంచి 2013 మ‌ధ్య దేశ వృద్ది రేటు 7.5% సాధించింది. పేద‌రికం బాగా త‌గ్గుతూ వ‌స్తోంది. 2005 సంవ‌త్స‌రంలో 39% ఉన్న పేద‌రిక స్థాయి 2014కు వ‌చ్చేసరికి 22శాతానికి త‌గ్గింది. పేద‌రికాన్ని అనుకున్న విధంగా త‌గ్గించ‌గ‌లిగారు. మిలినీయం డెవ‌ల‌ప్‌మెంట్ ల‌క్ష్యం 1లో భాగంగా పేద‌రికాన్ని స‌గానికి స‌గం త‌గ్గించ‌గ‌లిగారు. అయితే ఆర్థిక వ్య‌వ‌స్థ వృద్ది ఆశాజ‌న‌కంగా ఉన్న‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ రోజుకు 1.25 డాల‌రు కంటే త‌క్కువ సంపాదించే జ‌నాభా 23.6 శాతం ఉండ‌టం శోచ‌నీయం,

వ్యవ‌సాయ ప్రాముఖ్య‌త‌-భార‌త‌దేశం

వ్యవ‌సాయ ప్రాముఖ్య‌త‌-భార‌త‌దేశం

గ‌త కొన్ని ద‌శాబ్దాల్లో దేశంలో వ్య‌వ‌సాయంలో జ‌రుగుతున్న అభివృద్ది సైతం సానుకూలంగానే ఉంది. ముఖ్యంగా మ‌నం ఆహారాన్ని ఎగుమ‌తి చేయ‌డంలో ఎంతో ముందున్నాం. ఇంకా బియ్యం, ప‌త్తి, చ‌క్కెర‌, పంది మాంసానికి సంబంధించి ఎగుమ‌తుల ద్వారా దేశానికి ఎంతో విదేశీ మార‌క‌ద్ర‌వ్యం స‌మ‌కూరుతున్న‌ది. అయినప్ప‌టికీ మొత్తం ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో వ్య‌వ‌సాయం ద్వారా స‌మ‌కూరుతున్న వాటా 17 శాతంగానే ఉంది. ఇది మొత్తంలో ఐదింట ఒక వంతు క‌న్నా త‌క్కువ‌. వ్య‌వ‌సాయ భూమి ఉన్న దానిలోనే ఉత్పాద‌క‌త పెంచ‌కుండా, కార్మికుల ద్వారా జ‌రిగే ప‌ని అవుట్‌ఫుట్ వ‌ల్ల మంచి ప్ర‌యోజ‌నాలు పొంద‌కుండా దేశానికి ఆహార భ‌ద్ర‌త క‌ల్పించ‌డం క‌ష్టం. అంతే కాకుండా మార్కెటింగ్ స‌దుపాయాలు, పండ్లు భ‌ద్ర‌ప‌రుచుకునే వ్య‌వ‌స్థ‌, కూలింగ్‌తో కూడిన ర‌వాణా వంటివి క‌ల్పించ‌కుండా పెరుగుతున్న జ‌నాభాకు త‌గ్గ మంచి ఆహారాన్ని త‌యారుచేయ‌లేం.

Read more about: farmers agriculture
English summary

ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌రువు నివార‌ణ ప్రాజెక్టుతో 1.5 ల‌క్ష‌ల రైతుల ఇక్క‌ట్లు దూరం | Droughts May Be a Thing of the past for 1.65 Lakh Farmer Families in Andhra Pradesh

Five districts, namely Chittoor, Kadapa, Anantapur, Kurnool and Prakasam, were identified for the pilot project, which will be implemented in 330 gram panchayats in 110 mandals. Nine NGO’s will be the lead facilitating agencies, working as a consortium, while Hyderabad-based WASSAN (Watershed Support Services and Activity Network) will be the technical agency. The International Fund for Agriculture Development will put Rs 1000 crore into the project.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X