For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీడియా, వినోద రంగంలో 7-8 ల‌క్ష‌ల ఉద్యోగాలు

ఈ రంగంలో ఉద్యోగాలు పెరిగే అవ‌కాశం ఉంది. వ‌చ్చే 5 సంవ‌త్స‌రాల్లో ఈ రంగం ఎలా ఉంటుంద‌నే దానిపై సీఐఐ-బీసీజీ సంయుక్తంగా ఒక నివేదిక రూపొందించాయి. దాని వివ‌రాలన్నీ మీ కోస‌మే...

|

డిజిట‌లీక‌ర‌ణ పెర‌గ‌డంతో మీడియా, వినోద రంగాల్లో వ‌చ్చే ఐదేళ్ల‌లో 8 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉద్యోగాల క‌ల్ప‌న జ‌రుగుతుంద‌ని సీఐఐ బీసీజీ నివేదిక వెల్ల‌డించింది.
భార‌తదేశంలో ఇప్పుడిప్పుడే రియాల్టీ షోల‌కు, సామూహిక వినోద కార్య‌క్ర‌మాల‌కు ఆద‌ర‌ణ పెరుగుతున్న‌ది. దీని కార‌ణంగా ఇబ్బ‌డిముబ్బ‌డిగా ఈ రంగంలో ఉద్యోగాలు పెరిగే అవ‌కాశం ఉంది. వ‌చ్చే 5 సంవ‌త్స‌రాల్లో ఈ రంగం ఎలా ఉంటుంద‌నే దానిపై సీఐఐ-బీసీజీ సంయుక్తంగా ఒక నివేదిక రూపొందించాయి. దాని వివ‌రాలన్నీ మీ కోస‌మే...

సంస్థ‌లే త‌యారుచేసుకోవాలి

సంస్థ‌లే త‌యారుచేసుకోవాలి

మీడియా, వినోద ప‌రిశ్ర‌మ‌కు అవ‌స‌ర‌మైన మేర‌ ఇంత పెద్ద‌ సంఖ్యలో ఉద్యోగుల లభ్యత ఉండకపోవచ్చు. అందువ‌ల్ల ఈ రంగమే అమ సంస్థ‌ల‌కు అవ‌స‌ర‌మైన నిపుణుల‌ను తయారుచేసుకోవాల్సి ఉంటుంద‌ని నివేదిక‌ వెల్ల‌డించింది. ఈ రంగాలు ఏటా 11-12 శాతం వృద్ధిని సాధిస్తాయని పేర్కొంది.

గ్రామీణ ప్రాంతాల్లే త‌దుప‌రి ఆశావ‌హ ప్రాంతాలు

గ్రామీణ ప్రాంతాల్లే త‌దుప‌రి ఆశావ‌హ ప్రాంతాలు

గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న గిరాకీ వల్ల వినియోగం అధికమవుతోందని తెలిపింది. డిజిటల్ మాధ్య‌మాల‌తో అనుసంధానం అవుతున్న వినియోగదారుల సంఖ్య పెరుగుతోందని వివరించింది. టీవీల నుంచి డెస్క్‌టాప్‌ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్‌ఫోన్లలో కూడా వీక్షిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని విశ్లేషించింది.

 మీడియా, వినోదం

మీడియా, వినోదం

ఈ రంగం విస్త‌ర‌ణ‌కు నైపుణ్య‌మే ప్ర‌ధానం. దీన్ని సాధించ‌డానికి మీడియా పరిశ్ర‌మ‌లు, ప్ర‌భుత్వం, విద్యాసంస్థ‌లు అందుకు త‌గ్గ‌ట్లుగా ప్ర‌ణాళిక రూపొందించుకోవాలి. ప్ర‌స్తుతం ఈ రంగంలో జ‌రుగుతున్న వ్యాపారం 1,35,000 కోట్ల రూపాయలు కాగా మీడియా, వినోదం వంటి ప‌రిశ్ర‌మ‌ల మీద ఆధార‌పడి 10 లక్ష‌ల మంది జీవిస్తున్నారు.

 జీడీపీకి 2.8%

జీడీపీకి 2.8%

ఈ రంగం నుంచి నేరుగా ఉపాధి పొందే వారి కంటే అనుబంధ రంగాలు, ప‌రోక్ష ఉపాధి చాలా ఎక్కువ‌. ఆర్థిక వ్య‌వ‌స్థ మొత్తం చూసుకుంటే వినోద‌,మీడియా ప‌రిశ్ర‌మ 2022 నాటికి రూ.4,50,000 కోట్ల‌కు ఎద‌గ‌గ‌ల‌దు. దీంతో ఈ రంగం జీడీపీకి సాలీనా 2.8% వృద్దిని స‌ముపార్జించ‌గ‌ల‌దు.

Read more about: media entertainment jobs
English summary

మీడియా, వినోద రంగంలో 7-8 ల‌క్ష‌ల ఉద్యోగాలు | The media and entertainment industry will be able to generate lakhs of jobs

The media and entertainment industry will be able to generate both direct and indirect employment of four million jobs in the next four to five years, according to a report.The finding is part of the CII-BCG Report Media and Entertainment - The Nucleus of Indias Creative Economy, to be released at the CII Big Picture Summit 2017 on Tuesday.
Story first published: Monday, December 4, 2017, 14:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X