జన్ ధన్ ఖాతాల్లో ఎక్కువగా ఖాతాలు తెరిచిన వారిలో ఉత్తర భారతదేశానికి చెందిన రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. డిపాజిట్ల విలువలో సైతం దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతమే ముందుంది. ఈ నేపథ్యంలో ఎక్కు
ప్రధాన మంత్రి జన్ దన్ యోజన పథకం ప్రారంభం నుంచి ప్రజల నుంచి మంచి స్పందన రాబడుతూనే ఉంది. 2015 మార్చి నుంచి 2017 మార్చి నాటికి ఖాతాలో సగటు డిపాజిట్ విలువ రెండింతలయింది. నోట్ల రద్దు తర్వాత గతేడాది నవంబరు నాటికి మొత్తం ఖాతాల్లోని డిపాజిట్ విలువ రూ.64,250 కోట్లుగా ఉంది. ఈ ఏడాది నవంబర్ 15 నాటికి 30.64 కోట్ల ఖాతాల్లో ఉన్న డిపాజిట్ల విలువ రూ. 64,528.84 కోట్లు. జన్ ధన్ ఖాతాల్లో ఎక్కువగా ఖాతాలు తెరిచిన వారిలో ఉత్తర భారతదేశానికి చెందిన రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. డిపాజిట్ల విలువలో సైతం దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతమే ముందుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ, తక్కువ డిపాజిట్లు, తెలుగు రాష్ట్రాల్లో ఆయా ఖాతాల్లో చేసిన డిపాజిట్ల విలువ వంటి విషయాలు తెలుసుకుందాం.

ఉత్తర ప్రదేశ్
దేశంలోని అత్యధిక జనాభా కలిగిన యూపీ రాష్ట్రం ఖాతాల సంఖ్య, డిపాజిట్ల విషయంలో అన్నిటి కంటే ముందుంది.
సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లో - 2,86,46,404
పట్టణ ప్రాంతాల్లో - 1,94,41,107
ఖాతాల్లోని డిపాజిట్ల విలువ- రూ.11,144.51 కోట్లు
రూపే కార్డుల సంఖ్య - 3,67,58,373

పశ్చిమ బెంగాల్
సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లో - 2,03,21,211
పట్టణ ప్రాంతాల్లో -91,86,059
ఖాతాల్లోని డిపాజిట్ల విలువ- రూ. 10,311.08 కోట్లు
రూపే కార్డుల సంఖ్య -2,18,77,826

రాజస్థాన్
జన్ ధన్ ఖాతాల్లో డిపాజిట్ల విషయంలో రాజస్థాన్ మూడో స్థానంలో ఉంది.
సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లో -1,26,47,634
పట్టణ ప్రాంతాల్లో - 78,09,240
ఖాతాల్లోని డిపాజిట్ విలువ- రూ.52114.71 కోట్లు
రూపే కార్డుల సంఖ్య -1,68,97,663

మహారాష్ట్ర
సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లో - 1,08,74,759
పట్టణ ప్రాంతాల్లో - 1,07,11,947
ఖాతాల్లోని డిపాజిట్ల విలువ- రూ. 3886 కోట్లు
రూపే కార్డుల సంఖ్య -1,48,39,141

బీహార్
సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లో -2,09,61,931
పట్టణ ప్రాంతాల్లో -1,15,04,597
ఖాతాల్లోని డిపాజిట్ల విలువ- రూ.5890 కోట్లు
రూపే కార్డుల సంఖ్య -2,19,54,408

ఆంధ్రప్రదేశ్
సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లో - 39,50,752
పట్టణ ప్రాంతాల్లో - 39,27,140
ఖాతాల్లోని డిపాజిట్ల విలువ- రూ. 1102కోట్లు
రూపే కార్డుల సంఖ్య -64,94,579

తెలంగాణ
సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లో - 50,37,345
పట్టణ ప్రాంతాల్లో - 37,91,918
ఖాతాల్లోని డిపాజిట్ విలువ- రూ. 1298.71కోట్లు
రూపే కార్డుల సంఖ్య - 71,76,708
ఖాతాల సంఖ్య విషయంలో కానీ, డిపాజిట్ల సొమ్ము విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ ముందుంది.
దీనికి రెండు కారణాలు ఉండొచ్చు. జన్ ధన్ యోజన పథకం ప్రారంభించకముందు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మందికి బ్యాంకు కాతాలు ఉండి ఉండకపోవచ్చు. లేదంటే ఎక్కువ మంది ఒకటి కంటే రెండు ఖాతాలు ప్రారంభించి ఉండొచ్చు. జన్ ధన్ బ్యాంకు ఖాతాల ద్వారా ప్రభుత్వం ఏం చేసింది?

నాగాలాండ్
డిపాజిట్ల విషయంలో కింద నుంచి మూడో స్థానంలో నాగాలాండ్ ఉంది.
సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లో - 1,15,508
పట్టణ ప్రాంతాల్లో -1,18,034
ఖాతాల్లోని డిపాజిట్ల విలువ- రూ. 36.65కోట్లు
రూపే కార్డుల సంఖ్య -1,79,590

సిక్కిం
సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లో- 72,497
పట్టణ ప్రాంతాల్లో - 21,678
ఖాతాల్లోని డిపాజిట్ల విలువ- రూ.30.67 కోట్లు
రూపే కార్డుల సంఖ్య -69,461

లక్షద్వీప్
లక్షద్వీప్లో పెద్దగా జనాభా లేని కారణంగా ఇక్కడ ఖాతాల సంఖ్య, డిపాజిట్ విలువ రెండూ అతి తక్కువ
సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లో - 5071
పట్టణ ప్రాంతాల్లో -5546
ఖాతాల్లోని డిపాజిట్ల విలువ- రూ. 7.10 కోట్లు
రూపే కార్డుల సంఖ్య -7683
లక్షద్వీప్ అనే దీవుల్లో జారీ అయిన రూపే కార్డుల విలువ కంటే యూపీలో జారీ అయిన కార్డులు 4784 రెట్లు ఎక్కువ.
అదే విధంగా డిపాజిట్ల విషయంలో లక్షదీవుల డిపాజిట్ల కంటే యూపీలో అయిన డిపాజిట్లు 1569 రెట్లు ఎక్కువ
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications