For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోట్ల ర‌ద్దు త‌ర్వాతి కంటే ముందు తెరిచిన జ‌న్ ధ‌న్ ఖాతాలే ఎక్కువ‌

ప్ర‌భుత్వం ఎప్పుడూ పెద్ద నోట్ల మార్పిడి(ర‌ద్దు) ద్వారా వ్య‌వ‌స్థీకృత బ్యాంకింగ్ చాన‌ళ్లను ఉప‌యోగించి చేసే లావాదేవీలు జ‌రిగాయ‌ని చెప్పుకుంటూ ఉంది. ముఖ్యంగా కార్డు లావాదేవీలు, ఆన్‌లైన్ చెల్లింపుల‌ను చేయ

|

ప్ర‌భుత్వం ఎప్పుడూ పెద్ద నోట్ల మార్పిడి(ర‌ద్దు) ద్వారా వ్య‌వ‌స్థీకృత బ్యాంకింగ్ చాన‌ళ్లను ఉప‌యోగించి చేసే లావాదేవీలు జ‌రిగాయ‌ని చెప్పుకుంటూ ఉంది. ముఖ్యంగా కార్డు లావాదేవీలు, ఆన్‌లైన్ చెల్లింపుల‌ను చేయ‌డం ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున చేస్తున్నార‌ని ఒక్కోసారి గ‌ణాంకాల స‌హితంగా సైతం తెలియ‌జేస్తోంది. నిజ‌మే పెరిగాయ‌ని లెక్క‌ల్లో తెలుస్తున్న‌ప్ప‌టికీ దీని వెనుక మ‌రో క‌ఠోర స‌త్యం ఉంది. ఆగ‌స్టు 2014న జ‌న్‌ధ‌న్ ప‌థ‌కం లాంచ్ చేసిన త‌ర్వాత నోట్ల రద్దు త‌ర్వాతి కంటే నోట్ల ర‌ద్దు కంటే ముందు తెరిచిన జ‌న్‌ధ‌న్ ఖాతాలే ఎక్కువ ఉన్నాయి. నోట్ల రద్దు కంటే ముందు వ‌రుస రెండేళ్ల‌లో ఎక్కువ సంఖ్య‌లో పీఎమ్‌జేడీవై(జ‌న్ ధ‌న్‌) ఖాతాల‌ను ప్ర‌జ‌లు బ్యాంకుల్లో తెరిచారు. ఈ తెరిచిన మొత్తం ఖాతాల‌ను విశ్లేషిస్తే నోట్ల ర‌ద్దు త‌ర్వాత కొత్త‌గా నిర్వ‌హిస్తున్న వాటిలో గ్రామీణ‌, సెమీ అర్బ‌న్ మ‌రియు అర్బ‌న్ లేదా మెట్రో న‌గ‌రాల శాఖ‌ల్లో తెరిచిన ఖాతాలు దాదాపు స‌మానంగా ఉన్నాయి.

 నోట్ల ర‌ద్దు, జ‌న్‌ధన్ యోజ‌న‌

నోట్ల ర‌ద్దు త‌ర్వాత తెరిచిన ఖాతాల సంఖ్య 5 కోట్లు ఉండ‌గా, ప‌ట్ట‌ణ గ్రామీణ ప్రాంతాల పోలిక చూడ‌గా గ్రామీణ‌, సెమీ అర్బ‌న్ కేంద్రాల్లో తెరిచిన ఖాతాలు ప‌ట్ట‌ణ‌, మెట్రో న‌గ‌రాల కంటే కేవ‌లం కాస్త మాత్ర‌మే ఎక్కువ‌గా ఉన్నాయట‌. అదే నోట్ల ర‌ద్దు ముందున్న ప‌రిస్థితి చూస్తే గ్రామీణ‌, సెమీ అర్బ‌న్ ప్రాంతాల్లో తెరిచిన ఖాతాలు ప‌ట్ట‌ణ‌, మెట్రో న‌గ‌రాల కంటే చాలా ఎక్కువ‌గా ఉన్నాయి. ఇక డిపాజిట్ల విష‌యానికి వ‌స్తే జ‌న్‌ధ‌న్ ఖాతాల్లోని డిపాజిట్లు రూ.26,800 కోట్ల‌ను చేరేందుకు దాదాపు 14 నెల‌లు పట్టింది. అయితే నోట్ల మార్పిడి(ర‌ద్దు) ప‌రిస్థితిని స‌మూలంగా మార్చేసింది. ఒక్క నెల‌లోనే రూ.28,900 కోట్లు బ్యాంకుల‌కు చేరాయి. డిసెంబ‌రు 7 నాటికి ఈ త‌ర‌హా డిపాజిట్ల మొత్తం సొమ్ము ఆల్ టైం గ‌రిష్టం రూ.74,609 కోట్ల వ‌ర‌కూ చేరింది.జ‌న్‌ధన్ యోజ‌న ఖాతాకు సంబంధించి రూ.1 ల‌క్ష బీమా

 నోట్ల ర‌ద్దు, జ‌న్‌ధన్ యోజ‌న‌

అయితే నోట్ల ర‌ద్దు, జ‌న్‌ధ‌న్ ఖాతాల‌కు మ‌ధ్య సానుకూల ప‌రిణామం విష‌యం గురించి ఆలోచిస్తే వెంట‌నే ఆర్థిక నిపుణుల‌కు వెంట‌నే త‌ట్టేది రూపే కార్డులే. రూపే కార్డుల సంఖ్య ఈ త‌ర‌హా ఖాతాల ప్రారంభం నుంచి న‌వంబ‌రు 11,2015 వ‌ర‌కూ 12.91 కోట్లుండ‌గా ఆ త‌ర్వాతి ప‌రిస్థితి కింది విధంగా ఉంది. త‌ర్వాత దాదాపు ఏడాది కాలంలో న‌వంబ‌రు 9, 2016 నాటికి సంభ‌వించిన పెరుగుద‌ల 2.92 కోట్లు, అప్ప‌టి నుంచి అంటే నోట్ల ర‌ద్దు కాలం నుంచి అక్టోబ‌ర్ 25,2017 నాటికి రూపే కార్డుల్లో పెరుగుద‌ల 3.51 కోట్లుగా ఉంది.

Read more about: notes ban pmjdy
English summary

నోట్ల ర‌ద్దు త‌ర్వాతి కంటే ముందు తెరిచిన జ‌న్ ధ‌న్ ఖాతాలే ఎక్కువ‌ | More Jan dhan accounts opened before notes ban than after

More bank accounts under PMJDY were opened in the two years preceding demonetisation than after (see table). Compared to the previous years, the increase in the number of accounts was almost equal in rural/semi-urban and urban/metro branches post demonetisation.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X