జన్‌ధన్ యోజన ద్వారా కుటుంబంలో ఒకరికి ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం లభిస్తుంది. ఇంకా ఖాతాదారుకు రూ. 1 లక్ష ప్రమాద బీమా, రూ. 30 వేల జీవిత బీమా కల్పిస్తారు.
పేదలందరికీ బ్యాంకు ఖాతాలను తెరవడం ద్వారా ఆర్థిక అస్పృశ్యతను, తద్వారా పేదరికాన్ని నిర్మూలించే లక్ష్యంతో ప్రధానమంత్రి జన్ ధన యోజన పథకాన్ని రూపొందించారు. సున్నా నిల్వతో ఖాతా, లక్ష రూపాయల వరకూ ప్రమాద బీమా, రూ. 30 వేల వరకూ జీవిత బీమా సౌకర్యాలను ఈ ఖాతాలకు కల్పించారు. ఈ పథకం కింద ఖాతా తీసుకున్నవారు నెలకు రూ. 10 వేల బదిలీకి మాత్రమే సౌకర్యం కలిగి ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ పథకంపై తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానాలను చూడండి.

ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద ఉమ్మడి ఖాతా తెరవొచ్చా?
తెరిచే అవకాశం ఉంది.

ఈ పథకం వల్ల నాకు కలిగే లబ్ది ఏంటి?
పథకంలోని ప్రధాన వివరాలు
* ఖాతాదారుకు రూ. 5వేల ఓవర్‌డ్రాఫ్ట్
* రూ. 1 లక్ష ప్రమాద బీమా
* రూ. 30 వేల జీవిత బీమా
* రూపే డెబిట్ కార్డు

రూపే డెబిట్ కార్డు అంటే ఏమిటి?
దేశీయంగా రూపొందించిన డెబిట్ కార్డే రూపే డెబిట్ కార్డు. దీన్ని ఎన్‌పీసీఐ(నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ప్రవేశపెట్టింది. ఈ కార్డును అన్ని ఏటీఎమ్‌ల్లోనూ, చాలా పాయింట్ ఆఫ్ సేల్స్ మెషీన్లలోనూ అంగీకరిస్తున్నారు. నగదు రహిత చెల్లింపులు జరపాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

నా సందేహాలకు సమాధానాలు ఎవరిస్తారు?
పథకం టోల్ ఫ్రీ నంబర్లు
నేషనల్ టోల్‌ఫ్రీ : 1800 11 0001 ; 1800 180 1111
తెలంగాణ: 1800 425 8933
ఆంధ్రప్రదేశ్: 1800 425 8525
పథకానికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా ఆయా నంబర్లకు ఫోన్ చేయవచ్చు. నేషనల్ టోల్‌ఫ్రీ నంబర్లలో హిందీ, ఆంగ్ల భాషల్లో మాట్లాడవచ్చు.

జన్‌ధన్ యోజన ప్రగతి నివేదిక:
జన్‌ధన్ యోజన పథకం కింద ఇప్పటిదాకా 24.98 కోట్ల ఖాతాలను తెరిచారు. ఇందులో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఖాతాలు 15.33 కోట్లుండగా, పట్టణ ప్రాంతాలకు సంబంధించి 9.66 కోట్ల ఖాతాలున్నాయి. రూపే కార్డులు 19 కోట్లకు పైగా జారీ కాగా ఆధార్ కార్డులతో ఖాతాల అనుసంధానం నెమ్మదిగా జరుగుతోంది. సున్నా నిల్వ ఉన్న ఖాతాల శాతం 23.67% ఉండగా ఖాతాల్లోని మొత్తం నిల్వ ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం మొత్తం ఖాతాల్లోని నిల్వ 44వేల 221 కోట్లుగా ఉంది. ఈ విధంగా చూస్తే ఒక్కో ఖాతాలోని సగటు నిల్వ రూ. 1700కు పైగానే ఉంది.

ఇదివరకే ఖాతా ఉన్నవారు ఈ పథకం కింద ఖాతా తెరవొచ్చా?
ఇదివరకే ఏదో బ్యాంకులో ఖాతా ఉన్నవారు మళ్లీ ఖాతా తెరవాల్సిన అవసరం లేదు. రూపే కార్డుతో మీకు ప్రయోజనాలన్నీ కల్పిస్తారు. మీరు చేయాల్సిందల్లా మీకు రూపే కార్డు లేకపోతే బ్యాంకుకు వెళ్లి రూపే కార్డు కోసం దరఖాస్తు చేయాలి. ఓవర్‌డ్రాప్ట్ సౌకర్యం నిబంధనల ప్రకారం కల్పిస్తారు.

భార్యా,భర్తలిద్దరికీ జన్ ధన్ ఖాతాలుంటే
ఒక కుటుంబంలో భార్యా,భర్తలిద్దరూ జన్‌ధన్ ఖాతాలు తెరిచి ఉన్నా ఖాతాకు ప్రత్యేకంగా ప్రయోజనాలు లభిస్తాయి. రెండు ఖాతాలకు వేర్వేరుగా ప్రమాద బీమా, జీవిత బీమా ప్రయోజనాలను కల్పిస్తారు. ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం మాత్రం కుటుంబంలో ఒకరికే అందజేస్తారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications