For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్ర‌పంచంలో ఆదాయ‌పు ప‌న్నులేని 10 దేశాలు

కొన్ని దేశాలు మ‌నుషుల‌కు వ్య‌క్తిగ‌త ఆదాయ‌పు ప‌న్ను నుంచి విముక్తిని క‌ల్పించాయి. ఇక్క‌డ ఉన్న 10 దేశాలు వ్య‌క్తుల‌పై ఎటువంటి ప‌న్ను ఆదాయం ప‌న్ను విధించ‌లేదు. అవేంటో మీ కోసం...

|

మామూలుగా ఒక మాట ఉంటుంది. మ‌నిషంటూ పుట్టుక త‌ర్వాత మ‌ర‌ణం, పన్నులు లేకుండా త‌ప్పించుకోలేరు అని. అయితే ప్ర‌పంచంలోని కొన్ని దేశాలు మ‌నుషుల‌కు వ్య‌క్తిగ‌త ఆదాయ‌పు ప‌న్ను నుంచి విముక్తిని క‌ల్పించాయి. ఇక్క‌డ ఉన్న 10 దేశాలు వ్య‌క్తుల‌పై ఎటువంటి ప‌న్ను ఆదాయం ప‌న్ను విధించ‌లేదు. అవేంటో మీ కోసం...

1. యూఏఈ(యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌)

1. యూఏఈ(యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌)

చ‌మురు నిల్వ‌లే ప్ర‌ధాన ఆదాయంగా సాగుతున్న దేశం యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌. ఇక్క‌డ ఆదాయపు ప‌న్ను లేదా మూల‌ధ‌న ప‌న్ను ఉండ‌దు. ఇక్క‌డ స‌గ‌టు వ్య‌క్తి ఆదాయం 49వేల డాల‌ర్లుగా ఉంటుంది.

2. సౌదీ అరేబియా

2. సౌదీ అరేబియా

సౌదీ అరేబియా ఎగుమతుల్లో 95% చ‌మురు ప‌రిశ్ర‌మ నుంచే జ‌రుగుతాయి. దీని ద్వారా ప్ర‌భుత్వానికి 70% ఆదాయం వ‌స్తున్న‌ది. జీడీపీ ప‌రంగా చూస్తే స‌గ‌టున ఒక్కో వ్య‌క్తి ప‌రంగా 32 వేల డాల‌ర్ల సంప‌ద ఉంటుంది. ఇక్క‌డ ఉద్యోగులు ఆదాయ‌పు ప‌న్ను చెల్లించ‌న‌క్క‌ర్లేదు.

ఆదాయ‌పు ప‌న్నుకు బ‌దులు అంద‌రూ జ‌కాత్‌, అంటే ఆర్థిక స్థితిని బ‌ట్టి దానం చేయాల్సిన నిబంధ‌న ఉంది.

3. ఖతార్

3. ఖతార్

ప్ర‌పంచంలో ధ‌నిక దేశాల్లో ఒక‌టైన ఖ‌తార్ ప‌ర్ క్యాపిటా జీడీపీ 10,300 డాల‌ర్లుగా ఉంటుంది. ఇక్క‌డ ఆదాయ‌పు ప‌న్ను ఉండ‌దు. ఇంకా డివిడెండ్లు, రాయ‌ల్టీలు, లాభాలు, స్థ‌లాల క్ర‌య‌విక్ర‌యాల మూల‌ధ‌న రాబ‌డులు వంటి వాటిపై ఎటువంటి ప‌న్ను చెల్లించ‌క్క‌ర్లేదు. అయితే సామాజిక భద్ర‌త కోసం పౌరులు 5%, ఉద్యోగులు 10% ఆదాయాన్ని ఒక ఫండ్‌కు చెల్లించాలి.

Trending articles in Goodreturns telugu

ఆస‌క్తి రేకెత్తిస్తున్న స‌న్నీ లియోనీ ఆర్థిక పాఠాలుఆస‌క్తి రేకెత్తిస్తున్న స‌న్నీ లియోనీ ఆర్థిక పాఠాలు

జియో డీటీహెచ్ ఫ్రాంచైజ్‌, డీల‌ర్‌షిప్ తీసుకోవ‌డం ఎలా?జియో డీటీహెచ్ ఫ్రాంచైజ్‌, డీల‌ర్‌షిప్ తీసుకోవ‌డం ఎలా?

ఉజ్వ‌ల భార‌త భ‌విత‌కు .. భార‌త్‌మాల ... 7 ల‌క్ష‌ల కోట్లుఉజ్వ‌ల భార‌త భ‌విత‌కు .. భార‌త్‌మాల ... 7 ల‌క్ష‌ల కోట్లు

ఆధార్ -మొబైల్ సిమ్ లింకింగ్ ఇక సులువు... కేంద్ర నిర్ణ‌య‌మే కార‌ణంఆధార్ -మొబైల్ సిమ్ లింకింగ్ ఇక సులువు... కేంద్ర నిర్ణ‌య‌మే కార‌ణం

4. ఒమ‌న్

4. ఒమ‌న్

ఒమ‌న్ దేశ జీడీపీ స‌గ‌టున ఒక్కొక్క‌రి మీద 29వేల డాల‌ర్లు. ఇది ఫిలిప్పైన్స్ స‌గ‌టు జీడీపీ కంటే 7 రెట్లు ఎక్కువ‌. మ‌ధ్య ఆసియా దేశాల్లోని చాలా స‌రిహ‌ద్దు దేశాల్లో లాగానే ఒమ‌న్ దేశం సైతం ఎక్కువ‌గా ఆదాయం కోసం ముడి చ‌మురు నిల్వ‌ల‌పైనే ఆధార‌ప‌డి ఉంది. కేవ‌లం సామాజిక భ‌ద్ర‌త ప‌థ‌కాల కోసం ఆదాయంలో 6.5% పౌరుల ఆదాయం నుంచి సేకరించే ఒమ‌న్, ఇక ఏ ఇత‌ర ఆదాయపు ప‌న్నులు, మూల‌ధ‌న రాబ‌డి ప‌న్నులు విధించ‌దు.

5. మొనాకో

5. మొనాకో

ప‌శ్చిమ యూర‌ప్‌లోని సార్వ‌భౌమ దేశ‌మైన మొనాకో ప్ర‌పంచంలోని సంప‌న్న దేశాల్లో ఒక‌టి. ప‌ర్ క్యాపిటా జీడీపీ ఈ దేశంలో 1,32,000 డాల‌ర్లుగా ఉంటుంది. ఈ దేశంలో వ్య‌క్తుల‌పై ఎటువంటి ఆదాయ‌పు ప‌న్ను ఉండ‌దు.

6. కువైట్‌

6. కువైట్‌

కువైట్ రాజ్యాంగం ప్ర‌కారం దేశంలో ఉండే అన్ని స‌హ‌జ వ‌న‌రులు, దాని ద్వారా వ‌చ్చే ఆదాయాల‌న్నీ ప్ర‌భుత్వానికి చెందుతాయి. దాంతో అర్థం అయ్యేదేంటంటే కువైట్ చ‌మురు నిల్వ‌ల ద్వారా ప్ర‌భుత్వానికి ఎక్కువ ఆదాయం స‌మ‌కూరుతుంది అని. కువైట్ దేశ స‌గ‌టు జీడీపీ ఒక్కో వ్య‌క్తి మీద 59వేల డాల‌ర్లు. ఇందులో 90% పైగా ఎగుమ‌తుల కార‌ణంగా సంక్ర‌మిస్తుంది. అంటే 80% ప్ర‌భుత్వాదాయం చ‌మురు, స‌హజ వాయు నిల్వ‌ల నుంచే. కేవ‌లం 7% మంది మాత్ర‌మే ప్రైవేటు రంగంలో, ఎక్కువ మంది పైరులు ప్ర‌భుత్వ చ‌మురు కంపెనీల్లో ప‌నిచేస్తారు. కువైట్‌లో సైతం వ్య‌క్తిగ‌త ఆదాయ‌పు ప‌న్ను ఉండ‌క‌పోగా, సామాజిక భ‌ద్ర‌త కోసం మాత్రం ప్ర‌తి ఒక్క‌రూ వేత‌నంలో నుంచి 7.5% సొమ్ము చెల్లించాలి.

 7. కెమాన్ ఐల్యాండ్స్‌

7. కెమాన్ ఐల్యాండ్స్‌

బ్రిట‌న్ ప్రాదేశిక ప్రాంతంలో ఉండే ప‌శ్చిమ క‌రేబియ‌న్ స‌ముద్రంల కెమాన్ ఐల్యాండ్స్ ఉన్నాయి. ప్ర‌పంచంలో సంప‌న్న దేశాల్లో ఒక‌టైన ఈ దేశం సగ‌టు జీడీపీ 43,800 డాల‌ర్లు.

ఈ దేశానికి ఎక్కువ ఆదాయం ప‌ర్యాట‌కం, ఆర్థిక సేవ‌ల నుంచే వ‌స్తోంది. ప్ర‌పంచంలోనే ఐదో అతిపెద్ద బ్యాంకింగ్ రంగ వ్య‌వ‌స్థ‌ను క‌లిగి ఉంది. ఇక్క‌డి బ్యాంకుల్లో 1.5 ట్రిలియ‌న్ డిపాజిట్ నిల్వ‌లు ఉన్నాయి.

ఈ దేశంలో ఎటువంటి ఆదాయపు ప‌న్ను, మూల‌ధ‌న రాబ‌డి ప‌న్ను, వ్యాట్, ప్ర‌భుత్వ సేల్స్ ట్యాక్స్ వంటివి ఉండ‌వు.

8. బెర్ముడా

8. బెర్ముడా

ఆఫ్‌షోర్ ఫైనాన్స్ హ‌బ్‌గానే కాకుండా, ప‌ర్యాట‌కుల ద్వారా ఎక్కువ ఆదాయం స‌మ‌కూర్చుకుంటున్న దేశం బెర్ముడా. అమెరికా తూర్పు తీరంలో బ్రిటన్ ప్రాదేశిక ప్రాంతంలో ఇది ఉంది. ఈ దేశ స‌గ‌టు జీడీపీ 97వేల డాల‌ర్లు. ప‌రోక్ష పన్నుల ద్వారా ఎక్కువ ఆదాయం సంక్ర‌మిస్తుండ‌టంతో ఇక్క‌డ వ్య‌క్తిగ‌త ఆదాయ‌పు ప‌న్ను ఉండ‌దు.

9. బ‌హ్రెయిన్‌

9. బ‌హ్రెయిన్‌

అన్ని మిడిల్ ఈస్ట్ దేశాల్లో లాగానే ఇక్క‌డ ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు చ‌మురు నిల్వ‌లే.

పెట్రోలియం ఉత్ప‌త్తి, ప్రాసెసింగ్ ప‌రిశ్రమ దేశానికి ఇలా దోహ‌ద‌ప‌డుతోంది:

-60% ఎగుమతులు

- 70% ప్ర‌భుత్వ ఆదాయం

- 11% దేశ జీడీపీ

బ‌హ్రెయిన్ దేశ ప‌ర్ క్యాపిటా జీడీపీ 27,500 డాల‌ర్లు

వ్య‌క్తుల‌కు సంబంధించి ఇక్క‌డ ఎటువంటి దాయ‌పు ప‌న్ను ఉండ‌దు. అయితే ప‌రోక్ష ప‌న్నులు ఉంటాయి.

10. బ‌హ్మాస్‌

10. బ‌హ్మాస్‌

క‌రేబియ‌న్ దీవుల్లో మ‌రో దేశ‌మైన బ‌హ్మాస్ ఆర్థిక సేవ‌లు, టూరిజం ద్వారా ఎక్కువ రెవెన్యూను ఆర్జిస్తోంది. దేశ మొత్తం జీడీపీలో 60% ప‌ర్యాటకం నుంచే వ‌స్తోంది. అయితే ఉద్యోగాల క‌ల్ప‌న విష‌యానికి వ‌స్తే స‌గం జ‌నాభాకు ఇదే ఆధారం. ఇంకా ఆర్థిక సేవ‌ల కార‌ణంగా జీడీపీలో 15% వాటా ఆదాయం స‌మ‌కూరుతోంది. ప్రాప‌ర్టీ ట్యాక్స్ 1% విధించే బ‌హ్మాస్‌లో ఎటువంటి ఆదాయ‌పు ప‌న్ను, కార్పొరేట్ ప‌న్ను, మూల‌ద‌న రాబ‌డి ప‌న్ను, వ్యాట్ వంటి ప‌న్నులు ఉండ‌వు. సంప‌ద ప‌న్ను సైతం ఇక్క‌డ లేదు.

11. హాంకాంగ్

11. హాంకాంగ్

హాంకాంగ్ దేశంలో వ్య‌క్తుల ఆర్జ‌న‌పై త‌క్కువ ఆదాయ‌పు ప‌న్ను ఉంటుంది.

మొద‌ట 40 వేల డాల‌ర్ల వ‌రకూ 2%, 40 వేల డాల‌ర్ల నుంచి 80 వేల సంపాద‌న వ‌ర‌కూ 7%, ఆ త‌ర్వాతి 40 వేల వ‌ర‌కూ 12%, 120000 డాల‌ర్ల‌పైన ఎంతైనా 17% వ్య‌క్తిగ‌త ఆదాయ‌పు ప‌న్ను ఉంటుంది.

Read more about: income tax countries
English summary

ప్ర‌పంచంలో ఆదాయ‌పు ప‌న్నులేని 10 దేశాలు | Countries where there is No Income tax

Countries that are not having income tax on persons
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X