For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాన్ -ఆధార్ అనుసంధానానికి గ‌డువు పెంపు

ప‌న్ను చెల్లింపుదార్ల సౌక‌ర్యార్థం పాన్ నంబ‌ర్ల‌తో ఆధార్ అనుసంధానించేందుకు ఆగ‌స్టు 31తో ముగిసిన గ‌డువును కేంద్రం పొడిగించింది. గ‌డువును డిసెంబ‌రు 31 వ‌ర‌కూ పొడిగించిన‌ట్లు సీబీడీటీ వెల్ల‌డించింది.

|

ప‌న్ను చెల్లింపుదార్ల సౌక‌ర్యార్థం పాన్ నంబ‌ర్ల‌తో ఆధార్ అనుసంధానించేందుకు ఆగ‌స్టు 31తో ముగిసిన గ‌డువును కేంద్రం పొడిగించింది. గ‌డువును డిసెంబ‌రు 31 వ‌ర‌కూ పొడిగించిన‌ట్లు సీబీడీటీ వెల్ల‌డించింది. ఆర్థిక శాఖ సైతం పాన్-ఆధార్ గ‌డువు అనుసంధాన విష‌యాన్ని ప్ర‌స్తావించింది.

పాన్ -ఆధార్ అనుసంధానానికి గ‌డువు పెంపు

అంతే కాకుండా ఆదాయ‌పు ప‌న్న రిట‌ర్నులకు, ఆడిట్ రిపోర్టులు స‌మ‌ర్పించేందుకు ఉన్న‌ డ్యూ డేట్‌ను సైతం అక్టోబ‌ర్ 31 వ‌ర‌కూ పొడిగించారు. నిజానికి వాటి ఫైలింగ్ చివరి తేదీ సెప్టెంబ‌రు 30,2017తో ముగియాలి.
ఇప్ప‌టికే దాదాపు 13 కోట్ల మంది పాన్ కార్డుదారులు ఈ ప‌ని పూర్తిచేశారు. సుప్రీంకోర్టు వ్య‌క్తిగ‌త గోప్య‌త ప్రాథ‌మిక హ‌క్కులో భాగ‌మా, కాదా అని నిర్ధారిస్తూ,ఆధార్ చ‌ట్ట‌బ‌ద్ద‌త అనుసంధానంపై వివిధ పిటీష‌న్ల‌ను విచారిస్తోంది. త‌దుప‌రి విచార‌ణ‌ను న‌వంబ‌రుకు వాయిదా వేసింది. ఒక ప‌క్క వివిధ సంక్షేమ‌ ప‌థ‌కాల‌కు ఆధార్ గ‌డువు పొడిగించిన విధంగానే పాన్ కార్డు అనుసంధానానికి సైతం పెంచారు. సుప్రీంకోర్టులో విచార‌ణ కొన‌సాగుతున్నందున పాన్-ఆధార్ లింకేజీకి తదుప‌రి తేదీ వ‌ర్తిస్తుంద‌ని ఒక అధికారి చెప్పారు. సుప్రీంకోర్టు ఆధార్ కేసులో భాగంగా వ్య‌క్తిగ‌త గోప్య‌త ప్రాథ‌మిక హ‌క్కులో భాగ‌మే అని తెలిపినప్ప‌టికి, ఆధార్ కోసం ప్ర‌త్యేక చ‌ట్టం తెచ్చిన మూలంగా ఆధార్-పాన్ అనుసంధానానికి సంబంధించి ప్ర‌భుత్వ ఆదేశాల‌ను ఇది ప్రభావితం చేయ‌జాల‌ద‌ని కేంద్రం, ఆర్థిక శాఖ వ‌ర్గాలు ఇదివ‌ర‌కే స్ప‌ష్ట‌త‌నిచ్చాయి.

Read more about: aadhar pan
English summary

పాన్ -ఆధార్ అనుసంధానానికి గ‌డువు పెంపు | Deadline For Aadhaar-PAN Linkage Extended Till December 31

The government on Thursday extended by four months the deadline for linking PAN with biometric identifier Aadhaar till December 31. The deadline for linking PAN with Aadhaar for taxpayers was to end on Thursday.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X