For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాగ్నిజెంట్లో 4వేల మంది త‌గ్గారు

ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ కాగ్నిజెంట్‌ రెవెన్యూలో 3.5 శాతం వృద్ధి చోటు చేసుకుంది. కాగా కంపెనీలోని ఉద్యోగుల సంఖ్యలో మాత్రం 4,400 మంది తగ్గారు.

|

ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ కాగ్నిజెంట్‌ రెవెన్యూలో 3.5 శాతం వృద్ధి చోటు చేసుకుంది. కాగా కంపెనీలోని ఉద్యోగుల సంఖ్యలో మాత్రం 4,400 మంది తగ్గారు. భారతదేశంలో కొన‌సాగుతున్న ఐటీ కంపెనీల్లో అత్యధిక ఉద్యోగులు తగ్గింది కాగ్నిజెంట్‌లోనే కావడం గమనార్హం. క్రితం జూన్‌ ముగింపు నాటికి కాగ్నిజెంట్‌లో మొత్తంగా 2,56,800 పని చేస్తున్నారు. ఇంతక్రితం మార్చి త్రైమాసికం ముగింపు నాటికి ఈ సంఖ్య 2,61,200గా ఉంది.

 4వేల వ‌ర‌కూ త‌గ్గిన సిబ్బంది

ఈ కాలంలో టాప్‌ దేశీయ ఐటీ అవుట్‌సోర్స్‌ కంపెనీల్లో కెల్లా, దీనిలోనే అత్యధికంగా ఉద్యోగుల సంఖ్య పడిపోయింది. కాగ్నిజెంట్‌ పోటీ కంపెనీలు టిసిఎస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రాల్లోనూ సిబ్బంది సంఖ్య తగ్గింది. అయితే కాగ్నిజెంట్‌ స్థాయిలో ఉద్యోగుల సంఖ్య త‌గ్గిన కంపెనీ ఏదీ లేదు. ఖ‌ర్చు త‌గ్గించుకునే చర్యలో భాగంగానే సీటీఎస్ సిబ్బందికి కోత పెట్టింది. దీంతో జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ పెంచుకుంది. అదే విధంగా రెవెన్యూ అంచనాలను కూడా 8-10 శాతం నుంచి 9-10 శాతానికి పెంచుకున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. ప్రస్తుత ఏడాది జూన్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో కాగ్నిజెంట్‌ నికర లాభాలు 87 శాతం పెరిగి 470 మిలియన్‌ డాలర్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో 252 మిలియన్ల లాభాలు నమోదు చేసుకుంది. రెవెన్యూ 8.9 శాతం పెరిగి 3.67 బిలియన్‌ డాలర్లకు చేరింది.

Read more about: cts software cognizant
English summary

కాగ్నిజెంట్లో 4వేల మంది త‌గ్గారు | 4400 people left cognizant in June Quarter

cognizant employee strength reduced by 4000 in a year. cts had a headcount of 2,56,800 people in June quarter. Its annualised attrition rate stood at 23.6% in June quarter
Story first published: Friday, August 4, 2017, 15:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X