For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీఎస్టీలో లావాదేవీల విలువ‌ను ఎలా చూస్తారు?

జులై 1 నుంచి జీఎస్టీ అమ‌లు ప్రారంభ‌మైంది. రూ.20 ల‌క్ష‌ల పైబ‌డి ట‌ర్నోవ‌ర్ క‌లిగిన వ్యాపారులంతా జీఎస్టీ నెట్‌వ‌ర్క్‌లో న‌మోదు కావాల్సిందే. అయితే ఈ నేప‌థ్యంలో జీఎస్టీకి సంబంధించి లావాదేవీల్లో ప‌న్ను లెక

|

జులై 1 నుంచి జీఎస్టీ అమ‌లు ప్రారంభ‌మైంది. రూ.20 ల‌క్ష‌ల పైబ‌డి ట‌ర్నోవ‌ర్ క‌లిగిన వ్యాపారులంతా జీఎస్టీ నెట్‌వ‌ర్క్‌లో న‌మోదు కావాల్సిందే. అయితే ఈ నేప‌థ్యంలో జీఎస్టీకి సంబంధించి లావాదేవీల్లో ప‌న్ను లెక్కింపు ఎలా ఉంటుంద‌నేది తెలియ‌క చాలా మంది తిక‌మ‌క‌ప‌డుతున్నారు. అయితే సీబీఈసీ(సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ క‌స్ట‌మ్స్) జీఎస్టీకి సంబంధించి కొన్ని ప్ర‌శ్న‌లు-స‌మాధానాల‌ను విడుద‌ల చేసింది. అందులో లావాదేవీల‌కు సంబంధించిన వివ‌ర‌ణ‌లు మీ కోసం...

 1. జీఎస్టీ లావాదేవీల్లో విలువ లెక్కింపు ఎలా?

1. జీఎస్టీ లావాదేవీల్లో విలువ లెక్కింపు ఎలా?

ప‌న్ను విధించాల్సిన స‌రుకులు, సేవ‌ల స‌ర‌ఫ‌రా విలువ అనేది సాధార‌ణంగా లావాదేవీ విలువ‌గా ప‌రిగ‌ణింప‌బ‌డుతుంది. అంటే రెండు వైపులా ఉన్న వ్యాపార ప‌క్షాలు ప‌ర‌స్ప‌ర సంబంధం క‌లిగి ఉండ‌ని సంద‌ర్భాల్లో ధ‌ర చెల్లింపు అనేది మాత్ర‌మే ఏకైక ఉద్దేశ‌మైన‌ప్పుడు లావాదేవీ కింద చెల్లించిన లేదా చెల్లించాల్సిన ధ‌ర అన్న‌మాట‌. న‌మూనా జీఎస్టీ చ‌ట్టం లావాదేవీల విలువ నుంచి కొన్ని చేర్పులు, మిన‌హాయింపుల గురించి వివ‌రిస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు వావ‌సు చేసే ధ‌రావ‌తు, స‌ర‌ఫ‌రాకు ముందు లేదా త‌ర్వాత ఇచ్చే తగ్గింపు అనేది లావాదేవీల విలువ కింద‌కు రావు.

 2. లావాదేవీల విలువ అంటే ఏమిటి?

2. లావాదేవీల విలువ అంటే ఏమిటి?

లావాదేవీ విలువ అనేది సాధార‌ణంగా ఇరు వ్యాపార ప‌క్షాలు ప్ర‌త్య‌క్ష సంబంధం క‌లిగి ఉండ‌ని సంద‌ర్భాల్లో ఒక‌రు మ‌రొక‌రికి చెల్లించే ధ‌ర‌కు సంబంధించి లావాదేవీ ప్ర‌క్రియ అవ‌స‌రం ఏర్ప‌డుతుంది. స‌ర‌ఫ‌రాదారు చెల్లించాల్సి ఉండి, స‌ర‌ఫ‌రా గ్ర‌హీత భ‌రించిన మొత్తం కూడా లావాదేవీ విలువ‌లో భాగ‌మే.

3. సీజీఎస్‌టీ, ఎస్‌జీఎస్‌టీ, ఐజీఎస్టీ, స‌రుకుల సేవ‌ల కింద వేర్వేరు విలువ లెక్కింపు విధానాలు ఉంటాయా?

3. సీజీఎస్‌టీ, ఎస్‌జీఎస్‌టీ, ఐజీఎస్టీ, స‌రుకుల సేవ‌ల కింద వేర్వేరు విలువ లెక్కింపు విధానాలు ఉంటాయా?

లేదు. మూడు ప‌న్నుల‌కు సెక్ష‌న్ 15 ఉమ్మ‌డిగానే ఉంటుంది. అలాగే స‌రుకులు, సేవ‌ల‌కూ ఇది ఉమ్మ‌డిగానే వ‌ర్తిస్తుంది.

 4. కాంట్రాక్టు ధ‌ర అనేది స‌ర‌ఫ‌రా విలువ లెక్కింపున‌కు స‌రిపోతుందా?

4. కాంట్రాక్టు ధ‌ర అనేది స‌ర‌ఫ‌రా విలువ లెక్కింపున‌కు స‌రిపోతుందా?

కాంట్రాక్టు ధ‌ర అనేది లావాదేవీ విలువ‌గా చెప్ప‌బడుతుంది. ప‌న్ను లెక్కింపున‌కు అదే ప్రాతిప‌దికగా ఉంటుంది. అయితే ధ‌ర అనేది వ్యాపార ప‌క్షాల మ‌ధ్య‌న గ‌ల సంబంధం మీద ఆధార‌ప‌డి ఉండ‌టం, కొన్ని లావాదేవీలు ఎలాంటి ధ‌ర లేకుండానే జ‌రిగ‌నట్లుగా భావించ‌డం వ‌ల్ల‌, లావాదేవీ విలువ స‌రిగా అంచ‌నాను ఈ అంశాల‌ను అధిగ‌మించి నిర్దారించాల్సి ఉంటుంది.

5. అన్ని సంద‌ర్భాల్లోనూ జీఎస్టీ మందిపు నిబంధ‌న‌ల అన్వ‌యం అవ‌స‌ర‌మా?

5. అన్ని సంద‌ర్భాల్లోనూ జీఎస్టీ మందిపు నిబంధ‌న‌ల అన్వ‌యం అవ‌స‌ర‌మా?

అవ‌స‌రం లేదు.

చ‌ట్టంలోని సెక్ష‌న్ 15(స‌బ్ సెక్ష‌న్‌(1)) కింద విలువ‌ను నిర్దారించ‌లేని సంద‌ర్భాల్లో మాత్ర‌మే జీఎస్టీ మ‌దింపు నిబంధ‌న‌ల‌ను అన్వ‌యించ‌డం అవ‌స‌రం.

6. సెక్ష‌న్ 15(1) కింద ప్ర‌క‌టించిన లావాదేవీ విలువ‌కు ఆమోదం ఉంటుందా?

6. సెక్ష‌న్ 15(1) కింద ప్ర‌క‌టించిన లావాదేవీ విలువ‌కు ఆమోదం ఉంటుందా?

ఉంటుంది. సెక్ష‌న్ 15(2) కింద చేరిక‌లేవైనా ఉన్నాయోమో ప‌రిశీలించిన అనంతరం ఆమోదించ‌వ‌చ్చు. అంతేకాకుండా స‌ర‌ఫ‌రాదారు, స్వీక‌ర్త‌ల మ‌ధ్య ఏదైనా సంబంధం ఉన్న‌ప్ప‌టికీ అది ధ‌ర‌ల‌ను ప్ర‌భావితం చేయ‌ని ప‌క్షంలో లావాదేవీ ప్ర‌క‌టిత విలువ‌ను ఆమోదించే వీలుంది.

7. స‌ర‌ఫ‌రా అనంత‌ర రాయితీ లేదా ప్రోత్సాహ‌కాల‌ను లావాదేవీ విలువ‌లో చేర్చ‌వ‌చ్చా?

7. స‌ర‌ఫ‌రా అనంత‌ర రాయితీ లేదా ప్రోత్సాహ‌కాల‌ను లావాదేవీ విలువ‌లో చేర్చ‌వ‌చ్చా?

చేర్చ‌వ‌చ్చు.. ఒప్పందం ప్ర‌కారం స‌ర‌ఫ‌రా అనంత‌ర రాయితీ ఖ‌రారైన‌ట్లు స‌ర‌ఫ‌రా స‌మ‌యంలోనే స‌మాచారం ఉన్న‌ప్పుడు, స‌ద‌రు రాయితీ నిర్దిష్టంగా బిల్లుతో ముడిప‌డి ఉన్న‌ప్పుడు, స‌ద‌రు రాయితీకి వ‌ర్తించే ఉత్పాద‌క ప‌న్ను జ‌మ‌ను స్వీక‌ర్త వాప‌సు చేసిన సంద‌ర్భాల్లో జీఎస్టీ న‌మూనా చ‌ట్టంలోని సెక్ష‌న్ 15 కింద స‌ర‌ఫ‌రా అనంతర రాయితీని లావాదేవీ విలువ‌లో చేర్చేందుకు అనుమ‌తించ‌వ‌చ్చు.

8. స‌ర‌ఫ‌రాకు ముందు లేదా స‌ర‌ఫ‌రా స‌మ‌యంలో అనుమ‌తించే ముంద‌స్తు రాయితీలు లావాదేవీ విలువ‌లో చేర్చ‌ద‌గిన‌వేనా?

8. స‌ర‌ఫ‌రాకు ముందు లేదా స‌ర‌ఫ‌రా స‌మ‌యంలో అనుమ‌తించే ముంద‌స్తు రాయితీలు లావాదేవీ విలువ‌లో చేర్చ‌ద‌గిన‌వేనా?

లేదు... సాధార‌ణ వ‌ర్త‌క వ్య‌వ‌హారాల‌లో భాగంగా అనుమ‌తించి ఉండి, బిల్లులో త‌గువిధంగా న‌మోదు చేసి ఉంటే త‌ప్ప అలా చేసేందుకు వీల్లేదు.

9. మ‌దింపు నియ‌మాల‌లోని నిబంధ‌న‌లు ఎప్పుడు వ‌ర్తిస్తాయి? మ‌దింపు నిబంధ‌న‌లు ఎప్పుడు వ‌ర్తిస్తాయంటే...

9. మ‌దింపు నియ‌మాల‌లోని నిబంధ‌న‌లు ఎప్పుడు వ‌ర్తిస్తాయి? మ‌దింపు నిబంధ‌న‌లు ఎప్పుడు వ‌ర్తిస్తాయంటే...

(i) ప్ర‌తిఫ‌లం పూర్తిగా లేదా పాక్షికంగా న‌గ‌దు రూపంలో లేన‌ప్పుడు

(ii) లావాదేవీలోని ప‌క్షాల మ‌ధ్య బంధుత్వం ఉన్న‌ప్పుడు లేదా స‌ర‌ఫ‌రా దారు ప్ర‌త్యేక వ‌ర్గానికి చెందిన సంద‌ర్భాల్లో

(iii) ప్ర‌క‌టించిన లావాదేవీ విలువ న‌మ్మ‌దగిన‌ది కాన‌ప్పుడు

10. లావాదేవీ విలువ‌కు జోడించ‌ద‌గిన‌విగా సెక్ష‌న్ 15(2)లో చేర్చిన అంశాలేవి?

10. లావాదేవీ విలువ‌కు జోడించ‌ద‌గిన‌విగా సెక్ష‌న్ 15(2)లో చేర్చిన అంశాలేవి?

లావాదేవీ విలువ‌కు జోడించ‌ద‌గిన‌విగా సెక్ష‌న్ 15(2)లో చేర్చిన అంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి..

ఎ) సీజీఎస్టీ లేదా ఎస్‌జీఎస్టీ చ‌ట్టంతో పాటు వ‌స్తు-సేవ‌ల ప‌న్ను(ఆదాయ న‌ష్టంపై రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ప‌రిహారం)చ‌ట్టం-2016 కాకుండా ఇత‌ర చ‌ట్టాల కింద స్వీక‌ర్త‌పై స‌ర‌ఫ‌రాదారు విధించే ప‌న్ను, సుంకం, రుసుము, ఫీజు, ఇత‌ర చార్జీలు;

బి) స‌ర‌ఫ‌రాల‌కు సంబంధించి స్వీక‌ర్త భ‌రించిన వ్య‌యాన్ని అత‌డు పొందిన వ‌స్తువులు లేదా సేవ‌ల‌కు చెల్లించిన లేదా చెల్లించాల్సిన వాస్త‌వ ధ‌ర‌లో చేర్చ‌ని ప‌క్షంలో స‌ర‌ఫ‌రాదారు చెల్లించాల్సిన మొత్తం

సి)వ‌స్తువులు లేదా సేవ‌లు లేదా రెండింటి స‌ర‌ఫ‌రాలో స్వీక‌ర్త‌పై స‌ర‌ఫ‌రాదారు విధించే క‌మీష‌న్‌, ప్యాకింగ్ వంటి యాదృచ్చిక ఖ‌ర్చుల‌తో పాటు ఇత‌ర‌త్రా సేవ‌లు లేక స‌ద‌రు వ‌స్తు సేవ‌ల చేర‌వేత‌కు ముందు లేదా త‌ర్వాత విధించద‌గ్గ ఇత‌ర చార్జీలు

డి) వ‌డ్డీ లేదా ఆల‌స్య రుసుము లేదా స‌ర‌ఫరాకు ప్ర‌తిఫ‌లం చెల్లింపులో ఆల‌స్యంపై జ‌రిమానా

ఇ) కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇచ్చే రాయితీలు కాకుండా ధ‌ర‌తో ప్ర‌త్య‌క్షంగా ముడిప‌డ్డ రాయితీలు

ప్ర‌క‌టిత లావాదేవీ విలువ‌ను ఎప్పుడు అనుమానించాల్సి వ‌స్తుంది?

ముసాయిదా జీఎస్టీ విలువ లెక్కింపు నిబంధ‌న‌ల్లోని రూల్ 7(బీ)లో ఇందుకు సంబంధించిన కార‌ణాలు వివ‌రించ‌డ‌మైన‌ది.

అవి: (1) సాపేక్ష స‌ర‌ఫ‌రాల్లో అధికంగా విలువ పెరుగుద‌ల ఉండ‌టం

(2) స‌ర‌ఫ‌రాల మార్కెట్ విలువ‌లో గ‌ణ‌నీయ‌మైన త‌గ్గుద‌ల లేదా హెచ్చుద‌ల ఉండ‌టం

(3) వివ‌ర‌ణ‌, ప‌రిమాణం, నాణ్య‌త‌, త‌యారైన సంవ‌త్స‌రం వంటి వివ‌రాల్లో త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు ఉండ‌టం మొద‌లైన‌వి. ఇది కేవ‌లం సూచ‌న‌ప్రాయ జాబితా అని సీబీఈసీ పేర్కొంది.

11. ముసాయిదా జీఎస్టీ విలువ లెక్కింపు నిబంధ‌న‌ల్లో విలువ నిర్దార‌ణ‌కు ఇచ్చిన ప‌ద్ద‌తులేమిటి?

11. ముసాయిదా జీఎస్టీ విలువ లెక్కింపు నిబంధ‌న‌ల్లో విలువ నిర్దార‌ణ‌కు ఇచ్చిన ప‌ద్ద‌తులేమిటి?

లావాదేవీ విలువ నిర్దార‌ణ‌కు ముసాయిదా జీఎస్టీ విలువ లెక్కింపు నిబంధ‌న‌ల్లో మూడు ప‌ద్ద‌తులు ఇవ్వ‌డ‌మైంది. అవి సాపేక్ష ప‌ద్ద‌తి, లెక్కింపు ప‌ద్ద‌తి, మిగులుబ‌డి ప‌ద్ద‌తి. వీటిని వ‌రుస క్ర‌మంలో వినియోగించాలి.

ప్యూర్ ఏజెంట్స్‌, మ‌నీ చేంజ‌ర్స్ విష‌యంలో ప్ర‌త్యేక విలువ లెక్కింపు ప‌ద్ద‌తులు సూచించారు.

ఇన్సూరర్‌, ఎయిర్ ట్రావెల్ ఏజంట్‌, లాట‌రీల పంపిణీదారు, అమ్మ‌కందారు వంటి వారి విష‌యంలో త‌దుప‌రి మ‌రిన్ని ప్ర‌త్యేక నిబంధ‌న‌లు రూపొందించ‌వ‌చ్చు.

12. లావాదేవీ విలువ‌లో క‌ల‌ప‌డానికి సంబంధించి జ‌రిగిన ప్ర‌ధాన మార్పులు ఏమిటి?

12. లావాదేవీ విలువ‌లో క‌ల‌ప‌డానికి సంబంధించి జ‌రిగిన ప్ర‌ధాన మార్పులు ఏమిటి?

లావాదేవీ విలువ‌లో క‌ల‌ప‌డానికి అవ‌కాశం ఉన్న సెక్ష‌న్ 15(2)లో నిర్దేశించిన మార్పులు ఈ కింది విధంగా ఉన్నాయి...

ఏ) స‌ర‌ఫ‌రాదారు చెల్లించాల్సి ఉండి, స‌ర‌ఫ‌రాల గ్ర‌హీత‌లు జ‌రిపిన చెల్లింపులు

బీ) స‌రుకులు లేదా సేవ‌లు ఉచితంగా లేదా రాయితీ కింద స‌ర‌ఫ‌రా చేసిన‌వి

సీ)గ్ర‌హీత స‌ర‌ఫ‌రా ష‌ర‌తు ప్ర‌కారం చెల్లించాల్సిన రాయ‌ల్టీస్, లైసెన్సు ఫీజులు

డీ) మ‌రే ఇత‌ర చ‌ట్టాల కింద విధించిన ప‌న్నులు(ఎస్‌జీఎస్టీ/ సీజీఎస్టీ లేదా ఐజీఎస్టీ కాకుండా కేంద్రం విధించే ప‌న్నులు)

ఇ)స‌ర‌ఫ‌రాదారు స‌ర‌ఫరాకు ముందు భ‌రించిన ఖ‌ర్చులు, విడిగా చార్జీ వ‌సూలు చేయ‌బ‌డిన‌వి

ఎప్‌) స‌ర‌ఫ‌రాపై స‌ర‌ఫ‌రాదారు పొందిన సబ్సిడీలు

జీ)స‌ర‌ఫ‌రాదారు విడిగా క్లెయిం చేసిన రీయింబర్స్‌మెంట్లు

Read more about: gst taxes tax goods services
English summary

జీఎస్టీలో లావాదేవీల విలువ‌ను ఎలా చూస్తారు? | Tax value calculation for businesses under gst

The taxable event under gst shall be the supply of goods and services or both made for consideration in the course or furtherance of business. The taxable events under the existing indirect tax laws such as manufacture, sale, or provision of services shall stand subsumed in the taxable event known as 'supply'.
Story first published: Tuesday, July 4, 2017, 15:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X