English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

దేశంలో టాప్‌-10 టెలికాం కంపెనీలు

Written By:
Subscribe to GoodReturns Telugu

దేశ టెలికాం రంగం ప‌రిస్థితి జియో రాక ముందు, జియో వ‌చ్చిన త‌ర్వాత అని అనేంత‌లా మారిపోయింది.  దేశంలో ఒక‌సారి ప్ర‌యివేటు రంగం హ‌వా మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఎయిర్‌టెల్ హ‌వా కొన‌సాగుతూనే ఉంది. అయితే జియో వ‌చ్చిన త‌ర్వాత అగ్ర‌గామి టెలికాం కంపెనీల లాభాల‌పై ప్ర‌భావం ప‌డింది. ఈ నేప‌థ్యంలో దేశంలో టాప్‌-10 టెలికాం రంగ సంస్థ‌ల గురించి తెలుసుకుందాం.

ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్

ఎయిర్టెల్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా 20కి పైగా దేశాల్లో ఉంది. దేశంలో సిస్కో గోల్డ్ స‌ర్టిఫికేష‌న్ పొందిన మొద‌టి టెలికాం ఆప‌రేట‌ర్ ఇదే. 2జీ/3జీ/4జీ టెక్నాల‌జీల ద్వారా ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో డేటా,వాయిస్ సేవ‌ల‌ను ఎయిర్‌టెల్ అందిస్తూ వ‌స్తోంది. టెలికాం రంగంలో ఉన్న భ‌విష్య‌త్తును అంచ‌నా వేసి సునీల్ మిట్ట‌ల్ 1995లో ఢిల్లీ కేంద్రంగా దీన్ని స్థాపించారు. ఎయిర్టెల్ త‌న సేవ‌ల నాణ్య‌త మెరుగ్గా ఉండేట్లు చూసుకోవ‌డ‌మే కాకుండా ప్ర‌క‌ట‌న‌ల‌తో వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకుంటూ ఉంటుంది. ఎయిర్‌టెల్‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా 32.5 కోట్ల మంది వాడుతుండ‌గా దేశంలో 25 కోట్ల మందికి పైగా వాడుతున్నారు.

రెవెన్యూ : 966192 మిలియ‌న్ రూపాయ‌లు

స‌బ్‌స్క్రైబ‌ర్ బేస్‌: 324 మిలియ‌న్‌

2. వోడాఫోన్

2. వోడాఫోన్

అప్ప‌ట్లో హ‌చ్‌గా అంద‌రికీ సుప‌రిచిత‌మైన మొబైల్ నెట్వ‌ర్క్ త‌ర్వాత వోడాఫోన్ చేతుల్లోకి వెళ్లింది. ముంబ‌యి కేంద్రంగా హ‌చిస‌న్ వాంపోవా, మాక్స్ గ్రూప్ సంయుక్తంగా హ‌చిస‌న్ మ్యాక్స్ టెలికాం లిమిటెడ్(హెచ్ఎంటీఎల్‌) పేరుతో 1992లో దేశీయ టెలికాం సేవ‌ల‌ను ప్రారంభించారు. 2007లో హ‌చ్ నెట్‌వ‌ర్క్లో అత్య‌ధిక వాటాను సొంతం చేసుకోవ‌డం ద్వారా త‌న బ్రాండ్‌ను వోడాఫోన్‌గా మార్చుకుంది. ప్ర‌స్తుతం దేశంలో రెండో అతిపెద్ద మొబైల్ నెట్వ‌ర్క్ సంస్థ ఇదే.

వోడాఫోన్ జూజూస్ అడ్వ‌ర్టైజ్‌మెంట్ల‌తో మారుమూల ప‌ల్లెల‌కు సైతం త‌న బ్రాండ్ ఇమేజీని గుర్తుండేలా చేసింది.

రెవెన్యూ : 425260 మిలియ‌న్ రూపాయ‌లు

స‌బ్‌స్క్రైబ‌ర్ బేస్‌: 184 మిలియ‌న్‌

3. ఐడియా సెల్యూలార్

3. ఐడియా సెల్యూలార్

దేశంలోని ముఖ్య న‌గరాల్లో విస్త‌రించి మూడో అతిపెద్ద నెట్‌వ‌ర్క్‌గా ఐడియా ఉంది. త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు 2జీ/3జీ/4జీ స‌ర్వీసుల‌ను ఇది అందిస్తున్న‌ది. దీని మార్కెట్ వాటా 18 శాతంగా ఉంది. 1995లో దీన్ని ప్రారంభించిన‌ప్పుడు ఏటీ అండ్ టీ, టాటా గ్రూప్‌, ఆదిత్యా గ్రూప్‌ల‌కు స‌మాన వాటా ఉండేది. త‌ర్వాత కాలంలో టాటా గ్రూప్ సొంత టెలికాం సంస్థ‌ను ఏర్పాటు చేసుకోవ‌డంతో ఐడియాలో మెజారిటీ వాటాదారుగా ఆదిత్యా బిర్లా గ్రూప్ అయింది. ఐడియా ఇటీవ‌ల 350 న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో 4జీ ఎల్‌టీఈ సేవ‌ల‌ను ప్రారంభించింది.

రెవెన్యూ : 359671మిలియ‌న్ రూపాయ‌లు

స‌బ్‌స్క్రైబ‌ర్ బేస్‌: 161 మిలియ‌న్‌

4. భార‌త్ సంచార్ నిగ‌మ్ లిమిటెడ్‌(బీఎస్ఎన్ఎల్)

4. భార‌త్ సంచార్ నిగ‌మ్ లిమిటెడ్‌(బీఎస్ఎన్ఎల్)

జ‌న్‌ప‌థ్‌, న్యూడిల్లీ ప్ర‌ధాన కేంద్రంగా ప్ర‌భుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ప‌నిచేస్తున్న‌ది. ముంబయి, డిల్లీ న‌గ‌రాల్లో ఎంటీఎన్ఎల్ ఉండ‌టంతో అక్క‌డ కాకుండా దేశ‌వ్యాప్తంగా 21 టెలికాం సర్కిళ్ల‌లో బీఎస్ఎన్ఎల్ విస్త‌రణను క‌లిగి ఉంది. నాణ్య‌త విష‌యంలో బీఎస్ఎన్ఎల్ త‌న వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తూ ఉంటుంది. గ‌తేడాది అక్టోబ‌ర్ చివ‌రి నాటికి 9.436 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు, 10 ల‌క్ష‌ల మంది ల్యాండ్ లైన్ క‌నెక్ష‌న్ల‌ను క‌లిగి ఉంది. ప‌ట్ట‌ణం - ప‌ల్లె అనే తేడా లేకుండా ఐసీటీ సేవ‌ల‌ను దేశంలో మూల‌మూల‌కూ విస్త‌రించేందుకు ఈ ప్ర‌భుత్వ రంగం సంస్థ నిరంతరం కృషి చేస్తూనే ఉన్న‌ది.

రెవెన్యూ : 279552 మిలియ‌న్ రూపాయ‌లు

స‌బ్‌స్క్రైబ‌ర్ బేస్‌: 93.2మిలియ‌న్‌

5. రిల‌య‌న్స్ క‌మ్యూనికేష‌న్స్‌

5. రిల‌య‌న్స్ క‌మ్యూనికేష‌న్స్‌

రిల‌య‌న్స్ అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ స్థాపించిన టెలికాం కంపెనీ రిల‌య‌న్ష్ క‌మ్యూనికేష‌న్స్‌. 2003-05 మ‌ధ్య కాలంలో దేశంలో అత్యంత పొడ‌వైన ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ కేబుల్‌ను రిల‌య‌న్స్ క‌మ్యూనికేష‌న్స్ నెల‌కొల్పింది. లోక‌ల్ కేబుల్ ఆప‌రేట‌ర్స్ సాయంతో దాదాపు 1,35,000 కి.మీ కేబుల్స్ వేశారు. ఈ సంస్థ‌కు భార‌త్‌లో కాకుండా యూఎస్‌,కెన‌డా, ఆస్ట్రేలియా, యూకే, సింగ‌పూర్‌, హాంగ్‌కాంగ్‌, న్యూజిలాండ్‌,ఫ్రాన్స్‌, బెల్జియం, ఆస్ట్రియా, స్పెయిన్‌, ఐర్లాండ్‌, నెద‌ర్లాండ్స్‌ల‌లో చెప్పుకోద‌గ్గ నెట్వ‌ర్క్ విస్త‌ర‌ణ ఉంది. 2015 నాటికి సంస్థ‌లో 8500 ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు.

2016 సెప్టెంబ‌ర్‌లో ఎయిర్‌సెల్‌ను కొనుగోలు చేస్తున్న‌ట్లు ఆర్‌కామ్ వెల్ల‌డించింది.

రెవెన్యూ : 221130 మిలియ‌న్ రూపాయ‌లు

స‌బ్‌స్క్రైబ‌ర్ బేస్‌: 118మిలియ‌న్‌

6. టాటా క‌మ్యూనికేష‌న్స్‌

6. టాటా క‌మ్యూనికేష‌న్స్‌

ముంబయి, సింగపూర్ కేంద్రాలుగా కొన‌సాగుతున్న మ‌రో టెలికాం సంస్థ టాటా క‌మ్యూనికేష‌న్స్‌. 38 దేశాల్లో కార్యాలయాలు క‌లిగి ఉండి, 8వేల ఉద్యోగ‌లు ప‌నిచేస్తున్న సంస్థ ఇది. మొద‌ట్లో ఈ సంస్థ ప్రారంభంలో 1986లో వీఎస్ఎన్ఎల్ పేరుతో ఉండేది. 2008లో టాటా గ్రూప్ మెజారిటీ వాటా కొనుగోలు చేసి అప్పుడు పేరును మార్చుకుంది. బాగా అడ్వాన్స్‌డ్ స‌బ్‌మెరైన్ కేబుల్ నెట్వ‌ర్క్ దీని బ‌లం. ఎక్కువ‌గా 200 దేశాల్లో 300 పీవోపీ(పాయింట్ ఆఫ్ ప్రెజ‌న్స్‌)ల‌తో అత్య‌ధిక విస్త‌ర‌ణ క‌లిగిన టైర్‌-1 ఐపీ నెట్‌వ‌ర్క్‌ను ఏర్పాటు చేసుకుంది. త‌మ వినియోగ‌దారుల‌ను క‌లుసుకునేందుకు టాటా క‌మ్యూనికేష‌న్స్‌ను 1600 టెలికాం కంపెనీలు వాడుతున్నాయి.

రెవెన్యూ : 205548 మిలియ‌న్ రూపాయ‌లు

స‌బ్‌స్క్రైబ‌ర్ బేస్‌: 62.5 మిలియ‌న్‌

7. రిల‌య‌న్స్ జియో

7. రిల‌య‌న్స్ జియో

2300 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రంతో మొద‌లుకొని, 14 స‌ర్కిళ్ల‌లో 1800 మెగా హెర్ట్జ్ స్పెక్ట్రాన్ని కొనుగోలు చేసి, గ‌తేడాది రూ. 10 వేల కోట్ల‌ను పెట్టుబ‌డులుగా పెట్టింది జియో. దీంతో 10 స‌ర్కిళ్ల‌లో 800 మెగా హెర్ట్జ్, 6 స‌ర్కిళ్ల‌లో 1800 మెగా హెర్ట్జ్ స్పెక్ట్రాన్ని గెలుచుకుంది. దీంతో మొత్తం పెట్టుబ‌డులు రూ. 34 వేల కోట్ల‌ను దాటాయి. 18వేల ప‌ట్ట‌ణ ప్రాంతాలు, 1 ఒక ల‌క్ష గ్రామాల‌ను క‌వ‌ర్ చేస్తూ 2.5 లక్ష‌ల కి.మీ మేర ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ కేబుళ్ల‌ను రిల‌య‌న్స్ జియో వేసింది. త‌ద్వారా 2018 చివ‌రి నాటికి మొత్తం జ‌నాభాను క‌వ‌ర్ చేసేలా కేబుల్ నెట్వ‌ర్క్‌ను క‌లిగి ఉండాల‌నేది ప్ర‌ణాళిక‌. 31 మార్చి నాటికి 7.3 కోట్ల మంది జియో ప్రైమ్ నెట్‌వ‌ర్క్‌లో చేరారు.

రెవెన్యూ : 340000 మిలియ‌న్ రూపాయ‌లు

స‌బ్‌స్క్రైబ‌ర్ బేస్‌: 73మిలియ‌న్‌, సిమ్ తీసుకున్న‌వారు: 10 కోట్ల‌కు పైగా

8. ఎంటీఎన్ఎల్‌

8. ఎంటీఎన్ఎల్‌

1992 వ‌ర‌కూ మెట్రో పాలిట‌న్ ఏరియాల్లో ఏకైక నెట్‌వ‌ర్క్‌గా గుత్తాధిప‌త్యాన్ని ఎంటీఎన్ఎల్ చ‌లాయించింది. టెలిఫోన్‌, మొబైల్‌, ఇంట‌ర్నెట్ సేవ‌లు, బ్రాడ్‌బ్యాండ్‌, ఎఫ్‌టీటీహెచ్ సేవ‌ల‌ను ఈ సంస్థ అందిస్తోంది. సీడీఎంఏ, జీఎస్ఎమ్ టెక్నాల‌జీల ద్వారా మొబైల్ వినియోగ‌దారుల‌ను చేరుకోగ‌లుగుతున్న‌ది. మొద‌ట్లో ఫోన్ క‌నెక్ష‌న్ కావాలంటే గంట‌ల త‌ర‌బ‌డి ప‌ట్టే స‌మ‌యం నుంచి ఇది చాలా మెరుగుప‌డింది. 2జీ, 3జీ సేవ‌ల‌ను అందించేందుకు ఎంటీఎన్ఎల్ నెట్వ‌ర్క్‌, బ్లాక్‌బెర్రీతో భాగ‌స్వామ్యం కుదుర్చుకుంది.

రెవెన్యూ : 31974 మిలియ‌న్ రూపాయ‌లు

స‌బ్‌స్క్రైబ‌ర్ బేస్‌: 7.5 మిలియ‌న్‌

9. టాటా టెలి స‌ర్వీసెస్‌

9. టాటా టెలి స‌ర్వీసెస్‌

భార‌త‌దేశంలో సీడీఎంఏ టెక్నాల‌జీని ప్ర‌వేశ‌పెట్టిన మొట్ట‌మొద‌టి కంపెనీ టాటా టెలి స‌ర్వీసెస్‌. మొద‌ట్లో సాధార‌ణ మొబైల్ సేవ‌ల‌తో మొద‌లెట్టిన ఈ సంస్థ చివ‌ర‌కూ టాటా డోకొమొతో సెంకండ్ ప‌ల్స్ రేట్ల ప్ర‌కంపన‌ల‌ను సృష్టించింది. నిమిషానికి కొంత చెల్లించే క్ర‌మం నుంచి సెక‌నుకు(మాట్లాడిన దానికే) రుసుము చెల్లించే విధంగా దేశీయ టెలికాం రంగాన్ని మార్చేసింది. 2008 నుంచి టాటా గ్రూప్ జ‌పాన్‌కు చెందిన ఎన్‌టీటీ డొకొమోతో జ‌ట్టుకట్టింది. అయితే ఇటీవ‌ల ఈ భాగ‌స్వామ్యం ప‌లు వివాదాల్లో చిక్కుకుని టాటా గ్రూపుకు పెద్ద న‌ష్టాన్ని చేకూర్చే విధంగా త‌యార‌యింది. ఫ్యూచ‌ర్ గ్రూప్ భాగ‌స్వామ్యంతో ఇక సృజ‌నాత్మ‌క ఉత్ప‌త్తి టీ24 సిమ్‌ను తీసుకొచ్చారు.

అయితే ప్రైవేటు రంగంలో దూసుకెళ్లాల్సినంత వేగంగా విజ‌య‌వంతం అవ‌డంలో ఇది స‌ఫ‌లీకృతం కాలేద‌నే చెప్పాలి.

రెవెన్యూ: 29386 మిలియ‌న్ రూపాయ‌లు

స‌బ్‌స్క్రైబ‌ర్ బేస్‌: 11.1 మిలియ‌న్‌

 10. సిస్ట‌మా శ్యామ్ టెలిస‌ర్వీసెస్ లిమిటెడ్‌(ఎస్‌ఎస్‌టీఎల్‌)

10. సిస్ట‌మా శ్యామ్ టెలిస‌ర్వీసెస్ లిమిటెడ్‌(ఎస్‌ఎస్‌టీఎల్‌)

మ‌న దేశంలో ఎంటీఎస్ పేరుతో విస్త‌రించిన ర‌ష్య‌న్ మొబైల్ టెలికాం సంస్థ ఎస్ఎస్‌టీఎల్‌. ర‌ష్యాకు చెందిన సిస్ట‌మా జాయింట్ స్టాక్ ఫైనాన్సియ‌ల్ కార్పొరేష‌న్ ఆఫ్ ర‌ష్యా, మ‌న దేశానికి చెందిన శ్యామ్ గ్రూప్ క‌లిసి దీన్ని స్థాపించాయి. ఎంటీఎస్ బ్రాండ్ పేరిట దేశంలో 2009లో ఇది ప్రారంభ‌మైంది. త‌క్కువ కాలంలోనే ఇది 1 కోటి మంది వినియోగ‌దారుల‌ను చేర్చుకోగ‌లిగింది. ఇందులో 1.95 మిలియ‌న్ హైస్పీడ్ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ వాడ‌కందార్లు. స్కిల్ ఇండియ‌లో భాగంగా 2016లో దేశంలో 24 ఐటీఐల్లో 1500 విద్యార్థుల‌కు ఈ సంస్థ నైపుణ్య శిక్ష‌ణనిచ్చింది.

రెవెన్యూ : 14287 మిలియ‌న్ రూపాయ‌లు

స‌బ్‌స్క్రైబ‌ర్ల సంఖ్య‌: 8.9 మిలియ‌న్

 11. ర్యాంకింగ్ మెథ‌డాలజీ

11. ర్యాంకింగ్ మెథ‌డాలజీ

1) దేశంలో 15 టెలికాం కంపెనీల‌ను తీసుకున్నారు

2) రెవెన్యూ, స‌బ్ స్క్రైబ‌ర్ల సంఖ్య ప్ర‌ధాన ప‌రామితులు

3) అంక‌గ‌ణిత ప‌ద్ద‌తుల‌ను ఉప‌యోగించి గ‌ణింపు జ‌రిగింది.

4) ఇది అవ‌గాహ‌న‌కు మాత్ర‌మే. ఇందులో త‌ప్పులున్నా గుడ్‌రిట‌ర్న్స్ యాజ‌మాన్యం, లేదా దాని ఉద్యోగులు ఎటువంటి బాధ్య‌త‌ను తీసుకోరు.

Read more about: telecom, airtel, vodafone, idea
English summary

top 10 telecom companies in India 2017

Established in 1995 and headquartered in New Delhi, formerly known as Bharti Tele-Ventures Limited it changed its name to Bharti Airtel Limited in 2006. A young entrepreneur Sunil Mittal identified the potential of the telecom sector and ventured into it by starting with assembling the push buttons phones in India.Bharti Airtel Limited is one of the largest telecommunications provider in the world with the largest mobile network operator in India and the 3rdlargest telecom service operator in the world.
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC

Get Latest News alerts from Telugu Goodreturns