For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాప్ 20 ఆక‌ర్ష‌ణీయ బ్రాండ్లు

ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2016 సంవ‌త్స‌రానికి ఎక్కువ ఆక‌ర్ష‌ణీయ బ్రాండ్‌గా ఎల్‌జీ పేరు తెచ్చుకుంది. ద‌క్షిణ కొరియాకు చెందిన ఈ ఎల‌క్ట్రానిక్ కంపెనీ గ‌త మూడు సీజ‌న్ల నుంచి త‌న ర్యాంకును మెరుగుప‌రుచుకుంటూ వ‌స

|

ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2016 సంవ‌త్స‌రానికి ఎక్కువ ఆక‌ర్ష‌ణీయ బ్రాండ్‌గా ఎల్‌జీ పేరు తెచ్చుకుంది. ద‌క్షిణ కొరియాకు చెందిన ఈ ఎల‌క్ట్రానిక్ కంపెనీ గ‌త మూడు సీజ‌న్ల నుంచి త‌న ర్యాంకును మెరుగుప‌రుచుకుంటూ వ‌స్తోంది. ఇండియాస్ మోస్ట్ అట్రాక్టివ్ బ్రాండ్స్ రిపోర్ట్ అధ్య‌యనం ప్ర‌కారం 2013లో 4వ ర్యాంకును, 2015లో రెండో ర్యాంకును ఈ సంవ‌త్స‌రం మొదటి ర్యాంకును చేజిక్కించుకుంది. సోనీ , శ్యామ్‌సంగ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. గత అధ్యయనాల్లో రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన శ్యాంసంగ్‌ మొబైల్స్‌ ఈ సారి మూడోసారి మూడో ర్యాంక్‌ పొందింది. దేశంలో టాప్ బ్రాండ్ అయిన టాటా అంత‌ర్జాతీయంగా ఏడో స్థానంలో ఉంది. ఈ నేప‌థ్యంలో మొత్తం టాప్ ఆకర్ష‌ణీయ కంపెనీల జాబితాను తెలుసుకుందాం.

1. ఎల్‌జీ

1. ఎల్‌జీ

దక్షిణ కొరియా కేంద్రంగా ప‌నిచేస్తున్న‌ కన్యూమర్‌ ఎలక్ట్రానిక్‌ సంస్థ ల‌క్కీ-గోల్డ్‌స్టార్‌(ఎల్‌జీ). 1947లో ప్రారంభ‌మైన దీని ప్ర‌ధాన కార్యాల‌యం సియోల్ లో ఉంది. ఎల్‌జీ సంస్థ ఎల‌క్ట్రానిక్స్‌, కెమిక‌ల్స్‌, టెలికాం ఉత్ప‌త్తులు, గృహ‌వ‌స‌రాల‌కు వినియోగించే రోజువారీ ఉప‌క‌ర‌ణాలు వంటివి ఉత్ప‌త్తి చేస్తోంది. ఎల్‌జీ ట్యాగ్ లైన్ "Life's Good" అని ఉంటుంది. దాని ప్రాడ‌క్ట్స్ అలానే ఉంటాయి. 2013 నాటికి ఎల్‌జీ సంస్థ ఉద్యోగుల సంఖ్య 2,20,000గా ఉంది.

2. సోనీ

2. సోనీ

సోనీ కార్పొరేష‌న్ సంస్థ‌ను సాధార‌ణ వ్య‌వ‌హారంలో భాగంగా సోనీగా పిలుస్తున్నారు. ఈ కంపెనీ వ్య‌వ‌స్థాప‌కులు మ‌సారు ఇబుకా, అకియో మోరిటా. ప్ర‌ధాన కార్యాల‌యం జ‌పాన్ దేశంలోని టోక్యోలో మినాటో వ‌ద్ద ఉంది. ప్ర‌ధాన వ్యాపారాలు ఎల‌క్ట్రానిక్స్‌, గేమింగ్, వినోదం, అడ్వ‌ర్టైజింగ్ ఏజెన్సీ,టెలిక‌మ్యూనికేష‌న్ ప‌రిక‌రాలు, ఆర్థిక సేవ‌ల్లో ఉన్నాయి. 2015 ఫార్చూన్ గ్లోబ‌ల్ 500 సంస్థ‌ల్లో సోనీ 116వ ర్యాంకును సాధించింది. 2016 సంవ‌త్స‌రం నాటికి ప్ర‌పంచంలో 14 దేశాల్లో దీని విస్త‌ర‌ణ ఉంది. ఈ ఏడాది ఈ సంస్థ ఉద్యోగుల సంఖ్య 1,25,300గా ఉంది.

3. శ్యామ్‌సంగ్ మొబైల్స్‌

3. శ్యామ్‌సంగ్ మొబైల్స్‌

2013,2015 సంవ‌త్స‌రాల్లో మొద‌టి స్థానంలో ఉన్న శ్యామ్‌సంగ్ మొబైల్స్ ఈ ఏడాది మూడో స్థానానికి దిగ‌జారింది. ప‌ర్సన‌ల్ ఫోన్ల విభాగంలో అత్య‌ధిక పోటీనిస్తున్న వాటిలో శ్యామ్‌సంగ్ ఉంది. కోన్ వోహ్యూన్ సంస్థ వైస్‌ ఛైర్మ‌న్‌, సీఈవోగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ఫోన్ల‌ను ఉత్ప‌త్తి చేస్తున్న సంస్థ‌గా శ్యామ్‌సంగ్ ప్ర‌సిద్ది గాంచింది. ద‌క్షిణ కొరియా ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు శ్యామ్‌సంగ్ ఎల‌క్ట్రానిక్స్ నుంచి గ‌ణ‌నీయ‌మైన‌ ఆదాయం వ‌స్తోంది.

4. హోండా

4. హోండా

4. హోండా

జ‌పనీస్ ప్రభుత్వ రంగ సంస్థ హోండా మోటార్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌. ప్ర‌ధానంగా ఆటోమొబైల్స్‌, ఎయిర్‌క్రాఫ్ట్‌, మోటార్‌సైకిల్స్‌, విద్యుత్ ప‌రిక‌రాల త‌యారీలో ఈ సంస్థ త‌న కార్య‌క‌లాపాల‌ను క‌లిగి ఉంది. 1959 నుంచి ప్ర‌పంచంలో అతిపెద్ద మోటార్‌సైకిల్ త‌యారీదారుగా హోండా వెలుగొందుతోంది. 2013లో హోండా ఆర్ అండ్ డీ(ప‌రిశోధ‌న‌, అభివృద్ది) కోసం 5.7% కేటాయింపులు చేసింది. అదే సంవ‌త్స‌రంలో అమెరికాకు 1ల‌క్షా 9 వేల వాహ‌నాలను ఎగుమ‌తి చేశారు. జ‌పాన్, ఉత్త‌ర అమెరికా, యూర‌ప్, ఆసియా, ఇత‌ర ఖండాల్లో దీని విస్త‌ర‌ణ ఉంది. 2014 సంవ‌త్స‌రంలో 1,98,561 ఉద్యోగులు ఉన్నారు. 2014లో హోండా రెవెన్యూ 119 బిలియ‌న్ యూఎస్ డాల‌ర్లుగా ఉంది. హోండా వెబ్‌సైట్ world.honda.com

5. శ్యామ్‌సంగ్‌

5. శ్యామ్‌సంగ్‌

ద‌క్షిణ కొరియాకు చెందిన మ‌రో బ‌హుళ జాతి సంస్థ శ్యామ్‌సంగ్‌. దీని వ్య‌వ‌స్థాప‌కులు లీ బ్యూంగ్‌-చుల్‌. 2009లో సంస్థ ఆదాయం 172.5 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉండ‌గా; స‌ంస్థ ఆస్తుల విలువ 294.5 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది.

శ్యామ్‌సంగ్ అనుబంధ సంస్థ‌లు శ్యామ్‌సంగ్ ఎల‌క్ట్రానిక్స్‌, శ్యామ్‌సంగ్ లైఫ్ ఇన్సూరెన్స్‌, శ్యామ్‌సంగ్ హెవీ ఇండ‌స్ట్రీస్‌, శ్యామ్‌సంగ్ సీ అండ్ టీ. ద‌క్షిణ కొరియా మొట్ట‌మొద‌టి థీమ్ పార్క్ అయిన శామ్‌సంగ్ ఎవ‌ర్‌లాండ్ 1976లో యాన్డిన్ ఫాంల్యాండ్ పేరుతో ప్రారంభ‌మైంది. ప్ర‌స్తుతం ఇది ప్ర‌పంచంలోనే అత్యంత ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన ఐదో థీమ్ పార్కుగా ఉంటోంది. 2004, 2005లో ప్ర‌పంచంలోనే అత్యంత ఆద‌ర‌ణ క‌లిగిన వినియోగ‌దారు ఎల‌క్ట్రానిక్స్ బ్రాండ్స్‌గా సోనీని అధిగ‌మించిన శామ్‌సంగ్ ఎల‌క్ట్రానిక్స్‌, ప్ర‌స్తుతం ఐదో స్థానంలో ఉంది. శ్యామ్‌సంగ్‌తో క‌లుపుకొని మొత్తం బ్రాండ్ల‌లో మొద‌టి ఐదింటిలో మూడు క‌న్సూమ‌ర్ ఎల‌క్ట్రానిక్స్‌కు చెందిన‌వే ఉన్నాయి.

6. బ‌జాజ్‌

6. బ‌జాజ్‌

బ‌జాజ్ గ్రూపు 1926లో స్థాపించ‌బ‌డింది. దీని వ్య‌స్థాప‌కులు జ‌మ‌న్‌లాల్ బ‌జాజ్. ప్ర‌ధాన కార్యాల‌యం మ‌హారాష్ట్రలోని పుణెలో ఉంది. ఇది ఆటోమొబైల్‌, ఆర్థిక సేవ‌లు, గృహోప‌క‌ర‌ణాలు, ఎల‌క్ట్రిక‌ల్‌, ఉక్కు,ఇనుము వంటి రంగాల్లో వ్యాపార విస్త‌ర‌ణ క‌లిగి ఉంది. గ్రూపులో ఉన్న ప్ర‌ముఖ సంస్థ‌లు బ‌జాజ్ ఎల‌క్ట్రిక‌ల్స్‌, ముకుంద్ లిమిటెడ్‌, బ‌జాజ్ హిందూస్తాన్ లిమిటెడ్‌, బ‌జాజ్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ మొద‌లైన‌వి. ప‌రిశ్ర‌మ మొత్తానికి క‌ష్ట‌మైన సంవ‌త్స‌రంలో బ‌జాజ్ త‌న వ్యాపార ప్ర‌య‌ణాన్ని స‌జావుగా సాగించింది. దేశంలో మోటార్ సైకిళ్లు, త్రిచ‌క్ర వాహనాల్లో అతిపెద్ద ఎగుమ‌తిదారుగా త‌న స్థానాన్ని నిల‌బెట్టుకుంది. ఏటా కార్పొరేట్ సామాజిక బాధ్య‌త కింద ఈ సంస్థ 10 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చుపెడుతోంది.

7. టాటా గ్రూప్‌

7. టాటా గ్రూప్‌

దేశంలో అత్యుత్త‌మ బ్రాండ్ అంటే టాటా అనేలా అప్ర‌తిహ‌తంగా దాని ప్ర‌స్థానం కొన‌సాగుతోంది. దాని బ్రాండ్ విలువ 11% పెరిగింది. దాని ప్యాసెంజ‌ర్ వాహ‌నాల విభాగం జెస్ట్ సెడాన్‌ను విడుద‌ల చేసింది. 2016లో టాటా మోటార్స్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా అంత‌ర్జాతీయంగా పేరొందిన ఫుట్ బాల్ ప్లేయ‌ర్ లియోనాల్ మెస్సిని నియ‌మించుకుంది. ఇంకా టాటా మోటార్స్ సీఈవో,ఎండీగా గ్యుంట‌ర్ బ‌షెక్‌ను నియ‌మించారు. టాటా గ్రూప్ సాఫ్ట్‌వేర్ కంపెనీ టీసీఎస్ 14.8% వృద్దితో రూ. 1,08,646 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. టాటా గ్లోబ‌ల్ బేవ‌రేజెస్ టీ, కాఫీ, తాగునీరు కాకుండా డైరీ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. అంతే కాకుండా ఈ-కామ‌ర్స్‌లోకి టాటాక్లిక్ ద్వారా ప్ర‌వేశించింది. ఈ గ్రూప్ బ్రాండ్ విలువ రూ. 742.18 బిలియ‌న్లుగా ఉంది. అంత‌ర్జాతీయంగా ఈ గ్రూపు సంస్థ ఆక‌ర్ష‌ణీయ బ్రాండ్ల‌లో ఏడో స్థానాన్ని ద‌క్కించుకుంది.

8. మారుతి సుజుకి

8. మారుతి సుజుకి

భార‌త‌దేశంలో కార్ల త‌యారీలో పేరెన్నిక‌గ‌న్న సంస్థ మారుతి సుజుకి. ద‌క్షిణాసియాలో కార్ల‌ను రూపొందించే సంస్థ‌ల్లో ఇదే అతి పెద్ద‌ది. ఈ సంస్థ‌లో అత్య‌ధిక వాటాలు క‌లిగి ఉన్న వాటిలో జ‌పాన్ దేశానికి చెందిన సుజుకి మోటార్ కార్పొరేష‌న్ ఒక‌టి. ఒక మిలియ‌న్ కార్ల‌ను ఒకేసారి రూపొందించే సామ‌ర్థ్యాన్ని మొద‌ట సాధించిన కార్ల సంస్థ ఇదే. భార‌తదేశంలో ఈ కంపెనీ ఆటోమోటివ్ విప్ల‌వానికి నాంది ప‌లికింది. సెప్టెంబ‌రు,2017 నుంచి సంస్థ పేరును మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ నుంచి సుజుకి ఇండియా లిమిటెడ్‌గా మార్చారు. 2016 మార్చి నెల‌లో విత‌రా బ్రెజా కార్ మోడ‌ల్‌ను విడుద‌ల చేశారు. దేశీయ త‌యారీ 98శాతం క‌లిగిన కారు ఇదే.

9. ఎయిర్‌టెల్‌

9. ఎయిర్‌టెల్‌

దేశంలోనే మొట్ట‌మొద‌టిసారిగా ఓపెన్ నెట్‌వ‌ర్క్‌ను ప్రారంభించి కాల్‌డ్రాప్స్, నెట్‌వ‌ర్క్ క‌వరేజీ స‌మ‌స్య‌లు లాంటి వినియోగ‌దారులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ఎయిర్‌టెల్ ప్ర‌య‌త్నిస్తోంది. ఓపెన్ నెట్‌వ‌ర్క్ ద్వ‌రా వినియోగ‌దారుల ఫీడ్‌బ్యాక్‌ను తీసుకుంటూ ఎయిర్‌టెల్ ముందుకెళుతోంది. ఇలాంటి ఎన్నో చ‌ర్య‌లు ఎయిర్‌టెల్‌ను దేశంలో నంబ‌రు 2 స్థానంలో ఉంచేలా చేసింది. దీని బ్రాండ్ విలువ గ‌తేడాదితో పోలిస్తే 8% పెరిగింది. ఆఫ్రికాలో మొద‌టి త్రైమాసికంలో న‌ష్టాలు స‌గానికి త‌గ్గాయి. 2015లో దేశ‌వ్యాప్తంగా 4జీ ట్ర‌య‌ల్స్‌ను ప్రారంభించింది. క్యాబ్‌రైడ్ల త‌ర్వాత చెల్లింపులు ఎయిర్‌టెల్ మ‌నీ ద్వారా చేసే విధంగా ఉబ‌ర్‌తో ఒప్పందం చేసుకుంది. బంగ్లాదేశ్‌లో రెండో అతిపెద్ద నెట్‌వ‌ర్క్ ఏర్పాటు చేసే క్ర‌మంలో ఆ దేశానికి చెందిన యాక్సియాటా విలీనాన్ని ప్ర‌క‌టించింది. ఎయిర్‌టెల్ బ్రాండ్ విలువ రూ. 350.44 బిలియ‌న్ డాల‌ర్లు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆక‌ర్ష‌ణీయ బ్రాండ్ల‌లో 9 వ స్థానంలో ఎయిర్‌టెల్ ఉంది.

10. నోకియా

10. నోకియా

ఫిన్‌లాండ్ కేంద్రంగా ప‌నిచేస్తున్న మొబైల్ ఫోన్ల త‌యారీ కంపెనీ నోకియా. ఒక ద‌శ‌లో మొబైల్ ఫోన్ల త‌యారీలో ప్ర‌పంచంలోనే అత్య‌ధిక వాటా క‌లిగి ఉంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక దేశాల‌లో ప‌రిశోధ‌న మ‌రియు అభివృద్ది, త‌యారీ మ‌రియు అమ్మ‌కాల కొర‌కు నోకియా కేంద్రాల‌ను క‌లిగి ఉంది. సెప్టెంబ‌రు 2,2013న నోకియా మొబైల్ సంస్థ‌ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 7.2 బిలియ‌న్ డాల‌ర్లు. 2008 నుంచి నోకియా ప్ర‌ధానంగా మూడు వ్యాపార స‌మూహాల‌ను క‌లిగి ఉంది. అవి ప‌రిక‌రాలు(ఎక్విప్‌మెంట్), సేవ‌లు(స‌ర్వీసెస్‌), మార్కెట్లు(మార్కెటింగ్‌). ప్ర‌స్తుతం ఐవోటీ(ఇంట‌ర్నెట్ ఆఫ్ థింగ్స్), అల్ట్రా బ్రాడ్‌బ్యాండ్‌, క్లౌడ్ వ్యాపారాల్లోకి నోకియా అడుగుడింది. 2014 మే 1 నుంచి రాజీవ్ సూరి నోకియా సీఈవోగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చాలా రోజుల నుంచి వినియోగ‌దారుల నాడిని ప‌సిగ‌ట్ట‌లేక‌పోవ‌డంతో ఈ బ్రాండ్ ప్ర‌పంచంలో ప‌దో స్థానానికి ప‌డిపోయింది.

ముగింపు

ముగింపు

ఏదైనా ఒక కంపెనీ నమ్మకంపై దృష్టి సారించినట్లయితే.. నమ్మకంతోపాటు మార్కెట్ వాటాను కూడా సంపాదించుకుంటుందని ప‌లు అధ్య‌య‌నాలు పేర్కొంటున్నాయి. నాణ్య‌త‌తో న‌మ్మ‌కాన్ని సంపాదించుకుంటే, ఆ కంపెనీ ప్రవేశపెట్టే కొత్త ఉత్పత్తులను వెంటనే వినియోగదారులు స్వీకరించేందుకు ఆసక్తి చూపుతారని నివేదిక‌ల ద్వారా తెలుస్తోంది. lg, lg electronics,samsung, tata, sony, trust research advisory, సామ్‌సంగ్, టాటా, సోనీ, హోండా, ఎయిర్‌టెల్‌,airtel

English summary

టాప్ 20 ఆక‌ర్ష‌ణీయ బ్రాండ్లు | Most Attractive brands 2016 in India

This year's most attractive brands Report, just as the two issues before it, has been stiff competition. Here we are giving top attractive brands. most attractive brands 2016
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X