For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చేతిలో నగదు లేక ఇబ్బందులా? ఈ మార్గాలు ఉన్నాయిగా...

నవంబరు 8న ప్రధానమంత్రి పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. ఇన్ని రోజులు పాన్ షాప్, పాల బిల్లు, కిరాణా కొట్టు, మందుల దుకాణం, పెట్రోలు బంకు ఇలా ప్రతి చోటా చాలా మంది నగదు చెల్లింపులకే అలవాటు పడి

|

నవంబరు 8న ప్రధానమంత్రి పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. ఇన్ని రోజులు పాన్ షాప్, పాల బిల్లు, కిరాణా కొట్టు, మందుల దుకాణం, పెట్రోలు బంకు ఇలా ప్రతి చోటా చాలా మంది నగదు చెల్లింపులకే అలవాటు పడి ఉంటారు.
చేతిలో రూ.2000 నోటు ఉన్నా, రద్దు చేసిన నోట్లు ఉన్నా చిన్న చిన్న వాటికి చెల్లింపులు చేయడం కష్టం. ఇంతవరకూ నగదు రహిత చెల్లింపులకు అలవాటు పడని వారికి ఇప్పుడు సరైన సమయం వచ్చింది. నెట్ బ్యాంకింగ్, కార్డు చెల్లింపులు, పేమెంట్ యాప్లు, వ్యాలెట్లు వంటి పలు చెల్లింపు విధానాల గురించి ఇక్కడ తెలుసుకోండి

1. మొబైల్ వ్యాలెట్లు

1. మొబైల్ వ్యాలెట్లు

ఎలక్ట్రానిక్ పేమెంట్ వ్యాలెట్లను ఉపయోగించి మొబైల్, డీటీహెచ్ రీచార్జీలు; విద్యుత్ బిల్లు చెల్లింపు, ఈ-కామర్స్ చెల్లింపులు వంటివి ఎన్నో చేసుకోవచ్చు. ప్రస్తుతం చాలా రిటైలర్లు సైతం ఈ చెల్లింపులకు అనుగుణంగా తమ విధానాలను మార్చుకుంటున్నారు. పేటీఎమ్, మొబిక్విక్, ఫ్రీచార్జ్, ఆక్సిజన్, సిట్రస్ వంటివి ప్రసిద్ది పొందిన మొబైల్ పేమెంట్ వ్యాలెట్లు. వీటిల్లో ఒకసారి వ్యాలెట్లో నగదు జమ చేసుకుంటే మీకు కావాల్సిన చెల్లింపులను నిమిషాల వ్యవధిలో చేయవచ్చు.

2. బ్యాంకింగ్ యాప్‌లు

2. బ్యాంకింగ్ యాప్‌లు

త‌మ ఖాతాదారుల అవ‌స‌రాల‌ను తీర్చేవిధంగా ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా వంటి బ్యాంకులు వివిధ యాప్‌లను విడుద‌ల చేశాయి. యాప్‌స్టోర్ నుంచి ఈ యాప్‌ల‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ బ్యాంకు వాలెట్ల‌లో కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ విధానాల ద్వారా డ‌బ్బు జ‌మ‌చేసుకుని చెల్లింపుల‌కు ఉపయోగించుకోవ‌చ్చు. బ్యాంకు వాలెట్ల‌లో ఉండే డ‌బ్బును బ‌దిలీ చేసుకునేందుకు కొన్ని బ్యాంకులు వీలు క‌ల్పిస్తాయి. ఇంతే కాకుండా మొబైల్‌, డీటీహెచ్ రీచార్జీలు; డేటా కార్డు, స్మార్ట్‌కార్డు రీచార్జీల వంటివి బ్యాంకు వాలెట్ల నుంచే పూర్తిచేయ‌వ‌చ్చు. హెచ్‌డీఎఫ్‌సీ-పేజాప్‌, ఎస్‌బీఐ-బ‌డ్డీ, ఐసీఐసీఐ - పాకెట్స్ పేర్ల‌తో మొబైల్ వాలెట్ల‌కు దీటుగా బ్యాంకింగ్ యాప్‌ల‌ను తీసుకొచ్చాయి.

3. యూపీఐ

3. యూపీఐ

దేశంలో చెల్లింపుల వ్యవస్థలో సంచలనం సృష్టించేందుకు ఎన్పీసీఐ యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యూపీఐ)ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా బ్యాంకు ఐఎఫ్ఎస్సీ కోడ్ అవసరం లేకుండా రెండు ఖాతాల మధ్య నగదు బదిలీని పూర్తిచేయవచ్చు. స్మార్ట్ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్ట్యాప్ వంటి వాటిలో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే క్షణాల వ్యవధిలో నగదును బదిలీ పూర్తవుతుంది. ఒక వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి మరో వ్యక్తి, సంస్థ ఖాతాలకు, లేదా ఒక సంస్థ ఖాతా నుంచి మరో సంస్థ, మరో వ్యక్తి ఖాతాలకు నగదును బదిలీ చేయొచ్చు.

యూపీఐ గురించి తెలుసుకోవాల్సిన ప‌లు అంశాలుయూపీఐ గురించి తెలుసుకోవాల్సిన ప‌లు అంశాలు

4. ఎలక్ట్రానిక్ నగదు బదిలీ

4. ఎలక్ట్రానిక్ నగదు బదిలీ

మొబైల్లో నగదు లావాదేవీలు చేయడానికి సంకోచించేవారికి కంప్యూటర్, ల్యాప్ట్యాప్ వంటి వాటి ద్వారా ఎలక్ట్రానిక్ నగదు బదిలీలను ఎంచుకోవడం మంచిది. ఇందులో ప్రధానంగా మూడు ఉంటాయి. మొదటి రెండు నెఫ్ట్, ఆర్టీజీఎస్ . రూ. 2 లక్షల పైబడి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆర్టీజీఎస్ను వాడాలి. ఆర్టీజీఎస్లో గరిష్టంగా రూ.10 లక్షల వరకూ పంపుకోవచ్చు. ఎటువంటి ఆన్లైన్ నగదు లావాదేవీలకు అయినా నెఫ్ట్(ఎన్ఈఎఫ్టీ) పద్దతిని ఉపయోగించుకోవచ్చు. ఇందులో కనిష్ట, గరిష్ట పరిమితులు లేవు.

5. ఐఎమ్పీఎస్(ఇమ్మిడీయట్ పేమెంట్ సిస్టమ్)

5. ఐఎమ్పీఎస్(ఇమ్మిడీయట్ పేమెంట్ సిస్టమ్)

ఐఎమ్పీఎస్ ద్వారా ఎప్పటికప్పుడు డబ్బులు పంపుకోవచ్చు. నెఫ్ట్ లావాదేవీలు ఎప్పుడు పడితే అప్పుడు చేయలేరు. ఐఎమ్పీఎస్ ద్వారా 24/7 ఎప్పుడైనా ఎలక్ట్రానిక్ బదిలీలను చేపట్టవచ్చు. దాదాపు దేశంలో ఉండే అన్ని షెడ్యూల్డ్ బ్యాంకులు తమ ఖాతాదారులకు ఐఎమ్పీఎస్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఈ చెల్లింపు వ్యవస్థను మొబైల్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఏటీఎమ్లు, కంప్యూటర్లు, పీసీలల్లో నెట్బ్యాంకింగ్ ద్వారా చేయవచ్చు.

6. ఏటీఎం/డెబిట్ కార్డు

6. ఏటీఎం/డెబిట్ కార్డు

చాలా మంది ఖాతాదారులు ఏటీఎం/డెబిట్ కార్డులను కేవలం ఏటీఎం నుంచి నగదు తీసుకోవడానికి మాత్రమే వినియోగిస్తారు. వేరే ఖాతాలకు నగదు బదిలీ, పీవోఎస్ల నుంచి నగదు పొందడం, క్రెడిట్ కార్డుల బిల్లుల చెల్లింపులు, మొబైల్ రీఛార్జిలు, రైల్వే, విమాన టికెట్ల బుకింగ్, టెలిఫోన్/పోస్ట్పెయిడ్, విద్యుత్/గ్యాస్/నీటి బిల్లుల చెల్లింపు, ఆదాయపు పన్ను చెల్లింపు, ఈ కామర్స్ కొనుగోళ్ల చెల్లింపులు వంటి సేవల్ని నగదు రహితంగా ఏటీఎం డెబిట్ కార్డులు ఉపయోగించి పొందవచ్చు. డెబిట్ కార్డుల వినియోగంపై కొన్ని బ్యాంకులు అందిస్తున్న రివార్డు పాయింట్ల ద్వారా ప్రోత్సాహకాల్ని కూడా పొందవచ్చు.

ఇది కూడా చ‌ద‌వండి

ఏటీఎమ్‌ల్లో రోజువారీ చేయ‌గ‌లిగే ప‌నులు

7. క్రెడిట్ కార్డు

7. క్రెడిట్ కార్డు

ప్రస్తుత రోజుల్లో వేతన ఉద్యోగుల్లో ఎక్కువ శాతం మంది క్రెడిట్ కార్డు తీసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు.

ప్రాథమిక కార్డుకు అనుబంధ కార్డులు తీసుకొని, కుటుంబ సభ్యులు వినియోగించుకోవచ్చు. కొనుగోళ్లకు సంబంధించి గరిష్ఠంగా 45 నుంచి 50రోజుల వరకూ ఎటువంటి వడ్డీ లేకుండా బిల్లు చెల్లింపే వెసులుబాటు ఉంటుంది. వినియోగించిన మొత్తాన్ని నెలసరి వాయిదాలు(ఈఎమ్ఐలు)గా మార్చుకునే అవకాశం కూడా ఉంది. దాదాపు అన్ని బ్యాంకులూ క్రెడిట్ కార్డు వినియోగదారులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. వాటిని రిడీమ్ చేసుకుని బిల్లు చెల్లింపులకు, వస్తు కొనుగోళ్లకు వాడుకోవచ్చు.

ముగింపు

ముగింపు

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అనూహ్యంగా తీసుకోవడంతో చాలా మందికి నగదు రహిత వ్యవస్థలను ఉపయోగించడం అనివార్యమైంది. గత మూడేళ్లలో దాదాపుగా 25 కోట్ల జన్ధన్ ఖాతాలను తెరిచారు. వీటిలో ఎక్కువ ఖాతాలకు రూపే కార్డులను జారీచేశారు. ఈ నేపథ్యంలో చెల్లింపులకు వివిధ యాప్లు, నెట్ బ్యాంకింగ్లను, కార్డులను వాడుకుని సత్వరంగా శ్రమలేని చెల్లింపులను చేసుకునే ప్రయ

Read more about: imps net banking app payment
English summary

చేతిలో నగదు లేక ఇబ్బందులా? ఈ మార్గాలు ఉన్నాయిగా... | Try these payment methods if you are having no cash

Historical reform in India which was announced on 08th Nov, 2016 of banning the Rs. 500 & 1000 note is being welcomed across the country.As the major step has been taken to move towards cashless economy, it is time to choose alternate payment methods
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X