ఈ రోజుల్లో అందరూ ఏటీమ్ కార్డులు వాడటం సర్వసాధారణమైపోయింది. ఒకప్పుడు డబ్బులు డ్రా చేసేందుకు మొదలైన ఏటీఎమ్ వాడకం, ఇప్పుడు ఎన్నో ఆర్థిక కార్యకలాపాలను చేసేందుకు వీలు కల్పిస్తోంది. నగదు వాడకాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ వాడకం బాగా ఎక్కువైంది. ఈ రెండింటిల్లో చేసే ఎన్నో పనులను నేడు ఏటీఎమ్‌ల్లో కూడా చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆన్‌లైన్ కార్యకలాపాలు పెరిగినప్పటికీ ఏటీఎమ్ విస్తరణ మాత్రం అలానే ఉంది. దీనికి ప్రధాన కారణం బ్యాంకులకు వెళ్లకుండానే ఏటీఎమ్‌ల్లో ఎన్నో పనులను చాలా సులువుగా చేయవచ్చు.

క్రెడిట్ కార్డు చెల్లింపులు
ఏటీఎమ్‌ను క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల కోసం సైతం ఉపయోగించుకోవచ్చు. ఇది చాలా సులభ విధానం. ఉదాహరణకు ఐసీఐసీఐ లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎమ్‌లలోకి వెళితే 'పే యువర్ క్రెడిట్ కార్డ్ బిల్' అనే ఆప్షన్ కనబడుతుంది. అక్కడ మీరు చెల్లించాల్సిన సొమ్ము వివరాలు, క్రెడిట్ కార్డు నంబరు నమోదు చేస్తే సరిపోతుంది. మీ ఖాతాలోంచి నేరుగా డబ్బు డెబిట్ అవుతుంది. రసీదును భవిష్యత్తు అవసరాల కోసం ఉంచుకోవచ్చు.

యుటిలిటీ బిల్లు చెల్లింపులు
టెలిఫోన్, విద్యుత్ బిల్లులు, బీమా ప్రీమియంలు వంటివన్నీ ఏటీఎమ్‌ల్లో చెల్లించేందుకు చాలా బ్యాంకులు అవకాశం కల్పిస్తున్నాయి. తుది గడువులోగా చెల్లింపులు చేసేందుకు వీలుంటుంది.

పన్ను చెల్లింపులు
బ్యాంకు ద్వారా ఈ సేవను పొందేందుకు మొదటిసారి బ్యాంకు వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యక్ష పన్నులను ఏటీఎమ్‌ల ద్వారా చెల్లించవచ్చు. మీరు చెల్లించాల్సిన సొమ్ము ఖాతా నుంచి డెబిట్ అయి, ఎస్ఐఎన్‌తో కూడిన రసీదు వస్తుంది. పన్ను రిటర్నులను ఆన్‌లైన్‌లో సమర్పిస్తుంటే ఇది అవసరం అవుతుంది.

మొబైల్ రీచార్జీ
మీ మొబైల్ రీచార్జీ చేసుకునేందుకు రిటైలర్ల దగ్గరకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఏటీఎమ్‌ల్లోకి వెళ్లి మీకు అవసరమైనంత సొమ్ముకు రిచార్జీని చేసుకోవచ్చు

చెక్కు పుస్తకం కోసం అభ్యర్థించడం
ఏటీఎమ్ నుంచి చెక్కు పుస్తకం కోసం అభ్యర్థించవచ్చు. అయితే ఖాతాలో ఉండే చిరునామా సరిగా ఉందో లేదో చూసుకోండి. చాలా బ్యాంకులు అక్కడ ఉన్న చిరునామాకే చెక్కు పుస్తకాన్ని పంపుతాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications