For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

50 మంది కుబేరులు: భారతీయ శ్రీమంతులు ముగ్గురు (ఫోటోలు)

By Nageswara Rao
|

ముంబై: ప్రపంచంలోని 50 మంది కుబేరుల జాబితాలో భారత్ నుంచి ముగ్గురికి చోటు దక్కింది. భారత్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ, సన్‌ఫార్మా చీఫ్ దిలీప్ సంఘ్వీలు ఈ జాబితాలో ఉన్నారు.

బిజినెస్ ఇన్‌సైడర్ భాగస్వామ్యంతో వెల్త్ ఎక్స్ అనే సంస్థ రూపొందించిన తాజా జాబితాలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ అగ్రస్థానంలో నిలిచారు. 2,480 కోట్ల డాలర్ల సంపద కలిగిన ముకేష్‌ అంబానీ 27వ స్థానంలో, 1,650 కోట్ల డాలర్ల నికర విలువ కలిగిన అజీమ్‌ ప్రేమ్‌జీ 43వ స్థానంలో, 1,640 కోట్ల డాలర్ల సంపద కలిగిన దిలీప్‌ సంఘ్వి 44వ స్థానంలో నిలిచారు.

ప్రపంచ కుబేరుల జాబితా: భారతీయ శ్రీమంతులు ముగ్గురు

ప్రపంచ కుబేరుల జాబితా: భారతీయ శ్రీమంతులు ముగ్గురు

ఇక ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్ సంపద విలువ 8740 కోట్ల డాలర్లు. తర్వాతి స్థానంలో స్పానిష్‌ వ్యాపారవేత్త అమన్‌సియో ఒర్టెగా (6,680 కోట్ల డాలర్లు) నిలిచారు. మూడోస్థానంలో వారెన్‌ బఫెట్‌ (సంపద 6,070 కోట్లడాలర్లు) ఉన్నారు.

ప్రపంచ కుబేరుల జాబితా: భారతీయ శ్రీమంతులు ముగ్గురు

ప్రపంచ కుబేరుల జాబితా: భారతీయ శ్రీమంతులు ముగ్గురు

అంతర్జాతీయ ఈ కామర్స్ దిగ్గజ వెబ్‌సైట్ అమెజాన్‌కు చెందిన జెఫ్రీ బెజోస్ 5,660 కోట్ల డాలర్ల సంపదతో నాలుగో స్థానంలో ఉన్నారు. అమెరికాకు చెందిన మరో వ్యాపార దిగ్గజం డేవిడ్ కోచ్‌కు ఐదో స్థానం దక్కింది. ఆయన వ్యక్తిగత ఆస్తి 4,740 కోట్ల డాలర్లు. ఈ జాబితాలో అమెరికాకు చెందిన 29 మందికి చోటు దక్కింది.

ప్రపంచ కుబేరుల జాబితా: భారతీయ శ్రీమంతులు ముగ్గురు

ప్రపంచ కుబేరుల జాబితా: భారతీయ శ్రీమంతులు ముగ్గురు

ఈ జాబితాలో చైనాకు చెందిన బిలియనీర్లు నలుగురున్నారు. ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకెర్‌బర్గ్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్న శ్రీమంతుల్లో అత్యంత పిన్న వయస్కుడు. 31 ఏళ్ల జుకెర్‌బర్గ్ 4,280 కోట్ల డాలర్ల సంపదతో 8వ స్థానం దక్కించుకున్నారు. ఈ జాబితాలో కేవలం నలుగురు మహిళా బిలియనీర్లకు స్థానం లభించింది.

 ప్రపంచ కుబేరుల జాబితా: భారతీయ శ్రీమంతులు ముగ్గురు

ప్రపంచ కుబేరుల జాబితా: భారతీయ శ్రీమంతులు ముగ్గురు

2,900 కోట్ల డాలర్ల ఆస్తికి వారసురాలైన ఓరియాల్‌కు చెందిన లిలియాన్ బెటెన్‌కోర్ట్ 17వ స్థానంలో ఉన్నారు. కాగా, రంగాలవారీగా చూస్తే అత్యధికంగా టెక్నాలజీ రంగం నుంచి 12 మందికి ఈ జాబితాలో చోటు దక్కింది. ఈ జాబితాలోని 50 మంది వ్యక్తులందరి సంపద 1.45 లక్షల కోట్ల డాలర్లుగా నమోదైంది. ఈ మొత్తం ఆస్ట్రేలియా స్థూల జాతీయోత్పత్తికి(జీడీపీ) సమానం.

English summary

50 మంది కుబేరులు: భారతీయ శ్రీమంతులు ముగ్గురు (ఫోటోలు) | Three Indians among world’s 50 wealthiest

Three Indians — Mukesh Ambani, Azim Premji and Dilip Shanghvi — have made it to a global list of 50 wealthiest people that is topped by Bill Gates.
Story first published: Friday, January 29, 2016, 12:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X