For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

U టర్న్: 'ఫ్లిప్‌కార్ట్ లైట్' పేరిట మొబైల్ వెబ్‌సైట్

By Nageswara Rao
|

మొబైల్ ఆధారిత ఆన్‌లైన్ విక్రయాలు మాత్రమే సాగిస్తామని, వెబ్‌సైట్‌ను త్వరలో మూసివేస్తామని గతంలో ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్ యూటర్న్ తీసుకోనుంది. 'బిగ్ బిలియన్ డేస్', దసరా, దీపావళి లాంటి పండుగ సీజన్‌లో వెబ్‌సైట్ అమ్మకాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా, కేవలం మొబైల్ యాప్ ద్వారానే ఎక్కువ ఆఫర్లను ప్రకటించినా, సంస్ధ అమ్మకాలు ఆశించిన స్థాయిలో పెరగలేదని తెలుస్తోంది.

 ఫ్లిప్‌కార్ట్ U టర్న్: 'ఫ్లిప్‌కార్ట్ లైట్' పేరిట మొబైల్ వెబ్‌సైట్

ఫ్లిప్‌కార్ట్ U టర్న్: 'ఫ్లిప్‌కార్ట్ లైట్' పేరిట మొబైల్ వెబ్‌సైట్

ఈ నేపథ్యంలో వెబ్‌సైట్ ద్వారానే అమ్మకాలు బాగా ఉన్నాయని గ్రహించిన సంస్ధ యాజమాన్యం యాప్‌తో పాటు సమానంగా ఆఫర్లు ప్రకటించాలని నిర్ణయించింది. ఇందుకోసం మొబైల్ వెబ్ ఆప్షన్ పెట్టుకుని 'ఫ్లిప్ కార్ట్ లైట్' పేరిట తక్కువ డేటా తీసుకుంటూ, సులువుగా తెరచుకునే వెబ్ వర్షన్‌ను రూపొందిస్తుంది.

 ఫ్లిప్‌కార్ట్ U టర్న్: 'ఫ్లిప్‌కార్ట్ లైట్' పేరిట మొబైల్ వెబ్‌సైట్

ఫ్లిప్‌కార్ట్ U టర్న్: 'ఫ్లిప్‌కార్ట్ లైట్' పేరిట మొబైల్ వెబ్‌సైట్

స్మార్ట్ ఫోన్లలో ప్లిప్‌కార్ట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవడం ఇష్టం లేని వారికి ఇది ఎంతగానో ఉపయోగంగా ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ ఇంజనీరింగ్ హెడ్ పీయుష్ రంజన్ వ్యాఖ్యానించారు.

ఫ్లిప్‌కార్ట్ U టర్న్: 'ఫ్లిప్‌కార్ట్ లైట్' పేరిట మొబైల్ వెబ్‌సైట్

ఫ్లిప్‌కార్ట్ U టర్న్: 'ఫ్లిప్‌కార్ట్ లైట్' పేరిట మొబైల్ వెబ్‌సైట్

ఈ సందర్భంగా రంజన్ మాట్లాడుతూ యాప్ ఆధారిత సేవలను మరితంగా ప్రోత్సహించాలనుకున్నామని అన్నారు. అయితే ఈ సీజన్‌లో ప్లిప్‌కార్ట్‌లో ఉత్పత్తులను కొనుగోలు చేసిన వారిలో కేవలం నాలుగు శాతం మాత్రమే యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నారని పేర్కొన్నారు.

ఫ్లిప్‌కార్ట్ U టర్న్: 'ఫ్లిప్‌కార్ట్ లైట్' పేరిట మొబైల్ వెబ్‌సైట్

ఫ్లిప్‌కార్ట్ U టర్న్: 'ఫ్లిప్‌కార్ట్ లైట్' పేరిట మొబైల్ వెబ్‌సైట్

దీంతో మేము మా వ్యూహాన్ని మార్చుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనికోసం త్వరలో మొబైల్ వెబ్‌సైట్‌ను పరిచయం చేయాలని నిర్ణయించామని వివరించారు. ఇందుకోసం క్రోమ్, ఒపేరా వంటి బ్రౌజర్లతో కలసి పనిచేస్తున్నామని, త్వరలోనే ఫైర్ ఫాక్స్‌తో కూడా సంప్రదింపులు జరుపుతామని ఆయన తెలిపారు.

English summary

U టర్న్: 'ఫ్లిప్‌కార్ట్ లైట్' పేరిట మొబైల్ వెబ్‌సైట్ | Flipkart's U-turn on app strategy? Relaunches mobile website

Flipkart is not going completely app-only. It has reintroduced a mobile web option -- something it had discontinued in March. The new mobile web application, however, is an extremely light version, and provides an app-like experience. Called Flipkart Lite, it is designed for those who do not want to install apps -- for reasons like low storage capacity on the phone -- and to allow customers to use Flipkart straight from links on other websites and social media.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X