For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పైసా ఖర్చు చేయకుండా ఆర్‌కామ్ చేతికి ఎంటీఎస్(ఫోటోలు)

By Nageswara Rao
|

ముంబై: రష్యా టెలికం దిగ్గజం సిస్టమోకు చెందిన భారత టెలికం విభాగం సిస్టెమో శ్యామ్ టెలీసర్వీసెస్ (ఎస్ఎస్టీఎల్)ను కొనుగోలు చేసినట్లు రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) ప్రకటించింది. షేర్ల మార్పిడి ద్వారా జరగనున్న ఈ కొనుగోలు ఒప్పందం ద్వారా ఆర్‌కామ్ సేవల వినియోగదారుల సంఖ్య 11.8 కోట్లకు పెరగనుంది.

ఈ ఒప్పందం ప్రకారం సిస్టెమో శ్యామ్ టెలీసర్వీసెస్ (ఎస్ఎస్టీఎల్) ఆర్‌కామ్‌లో 10 శాతం వాటా దక్కుతుంది. ఈ ఒప్పందం 2016 ద్వితీయర్ధంలో పూర్తి కావొచ్చు. కార్పోరేట్, నియంత్రణ తదితర ఇతర అనుమతులు లభించాల్సి ఉంది. ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇరు కంపెనీలు వెల్లడించకపోయినా... ఒప్పంద విలువ 690 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 4,500 కోట్లు) అని సమాచారం.

పైసా ఖర్చు చేయకుండా ఆర్‌కామ్ చేతికి ఎంటీఎస్

పైసా ఖర్చు చేయకుండా ఆర్‌కామ్ చేతికి ఎంటీఎస్

ఈ ఒప్పందం కోసం ఆర్‌కామ్‌ పైసా కూడా ఖర్చు చేయడం లేదు. ఈక్విటీలో సిస్టెమా శ్యామ్‌ టెలిసర్వీసెస్‌ కంపెనీ ప్రమోటర్లకు 69 కోట్ల డాలర్లకు (సుమారు రూ.4,500 కోట్లు) సమానమైన 10 శాతం వాటా ఇస్తుంది. ఎస్ఎస్టీఎల్ ఈక్విటీ విలువను ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం 29 నుంచి 30 కోట్ల డాలర్లుగా ఉంది.

పైసా ఖర్చు చేయకుండా ఆర్‌కామ్ చేతికి ఎంటీఎస్

పైసా ఖర్చు చేయకుండా ఆర్‌కామ్ చేతికి ఎంటీఎస్

ఒప్పందం పూర్తయ్యేలోపే సిస్టెమా కంపెనీకి ఉన్న దాదాపు రూ.3,200 కోట్ల అప్పులు తీర్చేయాలి. తర్వాత ఆర్‌కామ్‌కు మరిన్ని నిధులు సమకూర్చడం ద్వారా సిస్టెమా కంపెనీ ఈక్విటీలో తన వాటాను 50 శాతం వరకు పెంచుకునే అవకాశం ఉంది.

పైసా ఖర్చు చేయకుండా ఆర్‌కామ్ చేతికి ఎంటీఎస్

పైసా ఖర్చు చేయకుండా ఆర్‌కామ్ చేతికి ఎంటీఎస్

ప్రస్తుతం ఎస్‌ఎస్‌టీఎల్‌లో రష్యాకు చెందిన టెలికం దిగ్గజం ఏఎఫ్‌కే సిస్టమో సంస్థ 56.68 శాతం వాటా కలిగి ఉంది. రష్యా ప్రభుత్వానికి సైతం 17.14 శాతం వాటా ఉంది. భారత్‌కు చెందిన శ్యామ్ గ్రూపునకు 23.98 శాతం వాటా ఉండగా.. మిగతా వాటా ఇతరుల చేతుల్లో ఉంది. ఎంటీఎస్ బ్రాండ్‌నేమ్‌తో దేశంలోని 9 టెలికం సర్కిళ్లలో సేవలందిస్తున్న ఎస్‌ఎస్‌టీఎల్‌కు 90 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు.

పైసా ఖర్చు చేయకుండా ఆర్‌కామ్ చేతికి ఎంటీఎస్

పైసా ఖర్చు చేయకుండా ఆర్‌కామ్ చేతికి ఎంటీఎస్

సంస్థ వార్షిక ఆదాయం రూ.1500 కోట్ల స్థాయిలో ఉంది. ఈ ఒప్పందం ద్వారా అనిల్ అంబానీకి చెందిన ఆర్‌కామ్‌కు ఈ డీల్ ద్వారా ఎస్‌ఎస్‌టీఎల్‌కు చెందిన 850 మెగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్ స్పెక్ట్రాన్ని వినియోగించుకునే అవకాశం లభించనుంది. ఈ బ్యాండ్‌విడ్త్ స్పెక్ట్రంతో సంస్థకు 4జీ సేవలందించేందుకు వీలుంటుంది.

పైసా ఖర్చు చేయకుండా ఆర్‌కామ్ చేతికి ఎంటీఎస్

పైసా ఖర్చు చేయకుండా ఆర్‌కామ్ చేతికి ఎంటీఎస్

దీంతో ఢిల్లీ, గుజరాత్‌, తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి కీలకమైన ఎనిమిది సర్కిల్స్‌లో ఆర్‌ కామ్‌ స్పెక్ట్రమ్‌ గడువు 2021 నుంచి 2033 వరకు పెరగనుంది. ఇందుకోసం పదేళ్ల పాటు ఏటా రూ.392 కోట్ల చొప్పున ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్పెక్ట్రమ్‌ ఛార్జీలను ఆర్‌కామ్‌ చెల్లిస్తుంది.

పైసా ఖర్చు చేయకుండా ఆర్‌కామ్ చేతికి ఎంటీఎస్

పైసా ఖర్చు చేయకుండా ఆర్‌కామ్ చేతికి ఎంటీఎస్

శ్యామ్ టెలీలింక్‌లో 10 శాతం వాటాను 1.14 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయడం ద్వారా 2007లో సిస్టెమా సంస్థ భారత టెలికం మార్కెట్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత కాలంలో క్రమేపీ సంస్థలో వాటాను పెంచుకుంటూ వచ్చింది. ఎంటీఎస్ బ్రాండ్ కొనుగోలుతో ఆర్‌కామ్‌కు మార్కెట్లోని ఇతర సంస్థలతో పోటీపడే విషయంలో మరింత బలం చేకూరనుంది.

పైసా ఖర్చు చేయకుండా ఆర్‌కామ్ చేతికి ఎంటీఎస్

పైసా ఖర్చు చేయకుండా ఆర్‌కామ్ చేతికి ఎంటీఎస్

అంతేకాదు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో త్వరలో 4జీ సేవలను ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ విభాగంలోనూ అన్నకు పోటీగా సేవలు ప్రారంభించేందుకు అనిల్‌కు అవకాశం లభించనుంది. ఈ రెండు కంపెనీలు వచ్చే డిసెంబర్‌ నుంచి దేశవ్యాప్తంగా 4జీ సేవలు ప్రారంభించాలని భావిస్తున్నాయి.

English summary

పైసా ఖర్చు చేయకుండా ఆర్‌కామ్ చేతికి ఎంటీఎస్(ఫోటోలు) | MTS India merges with Anil Ambani's RCom

Billionaire Anil Ambani-led Reliance Communications on Monday said it will take over Russian conglomerate Sistema’s Indian mobile telephony venture that operates under the MTS brand.
Story first published: Tuesday, November 3, 2015, 13:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X