For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

MSMEలకు 3 నెలల్లో రూ.6,800 కోట్ల చెల్లింపులు

|

ఎంఎస్ఎంఈలకు కేంద్రమంత్రిత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు గత మూడు నెలల కాలంలో రూ.6,800 కోట్ల బకాయిలను చెల్లించినట్లు ప్రభుత్వం తెలిపింది. నెలవారీ చెల్లింపుల్లో దాదాపు మూడొంతులు, మిగిలిన బకాయిల్లో 45 రోజుల్లోగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

ఎంఎస్ఎంఈలకు రావాల్సిన మొత్తాన్ని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వరంగ ఎంటర్ ప్రైజెస్(CPSEs)లు 45 రోజుల్లో విడుదల చేస్తాయని గతంలో కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అనంతరం ఈ బకాయిల చెల్లింపులకు సంబంధించిన చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఎంఎస్ఎంఈల కోసం ఏర్పాటు చేసిన ఉదయం పోర్టల్‌లో దాదాపు 4 లక్షల రిజిస్ట్రేషన్స్ జరిగాయి.

 MSMEs paid Rs 6,800 crore dues by CPSEs and government

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎంఎస్ఎంఈలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూ.3 లక్షల మేర ప్రభుత్వ హామీ రుణాలతో పాటు ఇతర మార్గాల్లో ప్యాకేజీని ప్రకటించింది. అలాగే ఎంఎస్ఎంఈలకు రావాల్సిన మొత్తాలు కూడా ఇవ్వాలని నిర్ణయించింది.

English summary

MSMEలకు 3 నెలల్లో రూ.6,800 కోట్ల చెల్లింపులు | MSMEs paid Rs 6,800 crore dues by CPSEs and government

Central ministries and PSUs have cleared payments to the tune of over Rs 6,800 crore owed to micro, small and medium enterprises (MSMEs) in the last three months, the government said on Wednesday.
Story first published: Thursday, September 3, 2020, 15:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X