For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్‌స్టా, యూట్యూబ్‌తో పోలిస్తే టిక్-టాకర్స్ సంపాదన ఎలా ఉంటుంది?

|

మన దేశంలో టిక్ టాక్, హెలో సహా 59 చైనీస్ యాప్స్‌ను నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. గత కొద్ది రోజులుగా ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ బ్యాన్ వల్ల టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ రూ.45 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోతుందని అంచనా. సోషల్ మీడియా ద్వారా కూడా ఇన్‌ఫ్లుయెన్సర్లు స్పందిస్తారు. అయితే చైనీస్ షార్ట్ వీడియో యాప్ ఐన టిక్ టాక్ స్టార్స్ సంపాదన కంటే యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లోని ఇన్‌ఫ్లుయెన్సర్ల సంపాదన మూడు రెట్లు అంతకంటే ఎక్కువ ఉంటుంది. బ్రాండ్ టై-అప్ ద్వారా ఎక్కువగా సంపాదన ఉంటుంది.

ఇన్‌స్టా, యూట్యూబ్ ద్వారా సంపాదన

ఇన్‌స్టా, యూట్యూబ్ ద్వారా సంపాదన

చైనా-భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో జాతీయ భద్రతా చర్యల్లో భాగంగా కేంద్రం 59 చైనీస్ యాప్స్‌ను బ్యాన్ చేసింది. టిక్ టాక్‌లోని చాలామంది కంటెంట్ సృష్టికర్తలకు ఇది కలవరానికి గురి చేసేదే. ఎందుకంటే వారిలోకొందరు బ్రాండెడ్ కంటెంట్ ప్రమోషన్ ద్వారా వేలు, లక్షలు సంపాదించుకునే వారు ఉన్నారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా 10వేల ఇన్‌ఫ్లూయర్స్ బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నారు. కానీ టిక్ టాక్ ద్వారా వందలమంది మాత్రమే సంపాదిస్తున్నారు. అయితే టిక్ టాక్‌లో చాలామందికి పరోక్ష బహుమతులు వస్తాయి. అభిమానుల నుండి గిఫ్ట్‌లు, కార్యక్రమాలకు ప్రత్యేక ఆహ్వానం వంటివి ఉన్నాయి.

టిక్ టాక్ జూమ్

టిక్ టాక్ జూమ్

ఇండియాలో దాదాపు నాలుగేళ్ల క్రితం అడుగుపెట్టిన టిక్‌టాక్ గత ఏడాది పుంజుకుంది. జనాల్లో ఎక్కువగా నానింది. మన టిక్ టాక్ స్టార్స్ గత ఏడాది బ్రాండెడ్ కంటెంట్ స్పేస్‌లోకి ప్రవేశించారు. గూగుల్‌కు చెందిన యూట్యూబ్, ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ గత నాలుగైదేళ్లుగా ఇన్‌ఫ్లూయర్స్‌కు మనీ సంపాదించి పెడుతోంది. ఇవి టెక్నాలజీ, ఫుడ్, ఫ్యాషన్, బ్యూటీ, ట్రావెల్ అండ్ లైఫ్ స్టైల్.. ఇలా వివిధ రకాల కంటెంట్‌ను సృష్టించాయి. టిక్ టాక్ మాత్రం ఎక్కువగా వినోదం, మ్యూజిక్, ఫిల్మ్స్ బ్రాండ్ ప్రమోషన్‌లో ఉన్నాయి.

ఆదాయం ఇలా..

ఆదాయం ఇలా..

కనీసం 10 మిలియన్ల ఫాలోవర్స్ కలిగిన కేటగిరీ ఏ-టిక్ టాక్ క్రియేటర్స్ ఆదాయం రూ.3 లక్షల నుండి రూ.4 లక్షల వరకు ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే అలాంటి వారికి రూ.4 లక్షల నుండి రూ.5 లక్షలు ఉంటాయి. యూట్యూబ్‌లో అయితే ఆదాయం రూ.25 లక్షల వరకు ఉంటుందని ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింక్ కంపెనీ గ్రీన్‌రూమ్ కో-ఫౌండర్ లక్ష్మీ బాలసుబ్రమణియన్ అన్నారు.

ఐదో వంతు

ఐదో వంతు

యూట్యూబ్‌లో కేటగిరీ ఏ-ఇన్‌ఫ్లూయర్స్‌గా పరిగణించాలంటే ఓ వీడియోకు కనీసం నెలలో 5 నుండి 7 మిలియన్ల వీక్షణలు అవసరమని ఇన్‌ఫ్లుయెన్స్ మార్కెటింగ్ నిపుణులు చెబుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 6 నుండి 7 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉండాలి. అదే టిక్ టాక్ స్టార్స్‌కు కనీసం 10 మిలియన్ల మంది అవసరం. అంతేకాదు, ఏ కేటగిరీలో టిక్ టాకర్స్‌కు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నప్పటికీ యూట్యూబ్, ఇన్‌స్టా ఇన్‌ఫ్లూయర్స్‌తో పోలిస్తే ఐదోవంతు సంపాదనే ఉంటుందని చెబుతున్నారు.

ఇన్‌స్టాకు రెండేళ్లు.. టిక్ టాక్ మూణ్ణెళ్లు

ఇన్‌స్టాకు రెండేళ్లు.. టిక్ టాక్ మూణ్ణెళ్లు

ఉదాహరణకు ఢిల్లీకి చెందిన ఫుడ్ బ్లాకర్ సారాకు టిక్ టాక్ కంటే ఇన్‌స్టాలో బ్రాండెడ్ పోస్ట్ కోసం ఐదు రెట్లు ఛార్జ్ చేస్తుంది. సారాకు ఇన్‌స్టాలో 300,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాలో ఇంతమంది ఫాలోవర్స్ కోసం పట్టిన సమయం రెండేళ్లు అయితే, టిక్ టాక్‌లో 100,000 ఫాలోవర్స్ రావడానికి కేవలం మూడు నెలలు మాత్రమే సమయం తీసుకుందని చెబుతున్నారు. సారాకు చెందిన జింగీ జెస్ట్ (Zingy Zest) యూట్యూబ్ ఛానల్‌కు 80,000 మంది సబ్‌స్క్రైబ్ అయ్యారు. సగటున ఒక్కో వీడియోకు 50,000-100,000 వ్యూస్ వస్తాయి. యూట్యూబ్ రెండు రకాలుగా ఇస్తుంది. ఒకటి ఓ వీడియోకు ఫిక్స్డ్‌ మొత్తం లేదా వెయ్యి వ్యూస్‌కు ఒక డాలర్ ఇస్తుంది.

English summary

YouTube and Instagram influencers earn three times more than Tik Tok stars

Tik Tok app start may have bigger following but YouTube and Instagram influencers earn about three times more. For example A Delhi based blogger charges four or five times more for the same branded post on Instagram than Tittok.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X