For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డబుల్ బొనాంజా!: ఇల్లు కొంటున్నారా? కాస్త ఆగండి.. బడ్జెట్‌లో రాయితీలు?

|

న్యూఢిల్లీ: ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో డిమాండ్, వినియోగం పెంచేందుకు మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందనేది అందరూ ఎదురు చూస్తున్నారు. ఆదాయపు పన్ను ఊరటలు ఉండవచ్చునని భావిస్తున్నారు. అదే సమయంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేలా, అదే విధంగా కొనుగోలుదారులకు మద్దతుగా నిర్ణయాలు ఉండే అవకాశముందంటున్నారు.

ఆదాయపు పన్ను గురించి మరిన్ని కథనాలు

బయ్యర్స్‌తో పాటు ఉద్యోగాలకు ఊతం

బయ్యర్స్‌తో పాటు ఉద్యోగాలకు ఊతం

రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేలా బడ్జెట్‌లో ప్రతిపాదనలు ఉంటే ఎన్నో ప్రయోజనాలు. బయ్యర్స్‌కు ప్రయోజనం కలగడంతో పాటు ఈ రంగంతో ముడివడిన సిమెంట్, ఉక్కు వంటి వాటికి డిమాండ్ పెరిగి ఉద్యోగాలు కూడా పెరుగుతాయి. రియల్ రంగం ఎంతోమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది.

రియల్ రంగానికి ప్రాధాన్యత

రియల్ రంగానికి ప్రాధాన్యత

ఆర్థిక మందగమనం నేపథ్యంలో లిక్విడిటీ సమస్య, డిమాండ్ లేమి కారణంగా రియల్ ఎస్టేట్ రంగం కష్టాలను ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఆర్థిక వృద్ధి పట్టాలు ఎక్కాలంటే రియల్ రంగానికి బడ్జెట్‌లో అనుకూలంగా ప్రకటన ఉండాలని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం ఈ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

వడ్డీపై మినహాయింపు రూ.4 లక్షలు చేయాలి

వడ్డీపై మినహాయింపు రూ.4 లక్షలు చేయాలి

ఆదాయపు పన్ను స్లాబ్స్ మార్పుతో పాటు మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తే రియల్ రంగం ఊతమందుకొని ఉద్యోగాల కల్పన కూడా పెరుగుతుందని అంటున్నారు. హోమ్ లోన్ పైన చెల్లించే వడ్డీ మినహాయింపు పరిమితిని మరింత పెంచాలని అంటున్నారు. ప్రస్తుతం హోమ్ లోన్ పైన చెల్లించే వడ్డీ మొత్తంలో రూ.2 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. ఇప్పుడు ఈ పరిమితిని రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చేయాలంటున్నారు.

వడ్డీ పరిమితి పెంచితే..

వడ్డీ పరిమితి పెంచితే..

హోమ్ లోన్ పైన చెల్లించే వడ్డీ మొత్తం పరిమితిని పెంచడం ద్వారా మార్కెట్ సెంటిమెంట్ పెరుగుతుందని, కొనుగోలుదారులకు ప్రోత్సాహకంగా ఉంటుందని అంటున్నారు.

ప్రాపర్టీ వ్యాల్యూ లెక్కింపు

ప్రాపర్టీ వ్యాల్యూ లెక్కింపు

ప్రాపర్టీ వ్యాల్యూ లెక్కింపులో కూడా మార్పులు కోరుకుంటున్నారు. ప్రాపర్టీ నికర వార్షిక వ్యాల్యూ లెక్కింపు సమయంలో స్థూల రెంటల్ వ్యాల్యూ నుంచి మున్సిపల్ ట్యాక్స్ తీసేస్తారు. ప్రాపర్టీ నికర వ్యాల్యూలో 2002 నుంచి ఇంటి పేయింట్, మరమ్మతులు వంటి వాటి కోసం 30 శాతం స్టాండర్డ్ డిడక్షన్ కొనసాగుతూ వస్తోంది. ఈ డిడక్షన్‌ను 10 శాతం నుంచి 20 శాతం వరకు పెంచితే బయ్యర్స్ పెట్టుబడులు పెరగవచ్చునని అంటున్నారు. మొత్తానికి హోమ్ బయ్యర్స్‌కు ప్రయోజనాలు కల్పిస్తే రియల్ రంగానికి ఊతమిచ్చి ఉద్యోగాలు పెరగడంతో పాటు హోమ్ బయ్యర్స్‌కు ప్రయోజనం కలుగుతుంది.

English summary

డబుల్ బొనాంజా!: ఇల్లు కొంటున్నారా? కాస్త ఆగండి.. బడ్జెట్‌లో రాయితీలు? | Will FM Sitharaman give more tax sops to home buyers to boost ailing real estate?

High on the list of issues that Finance Minister Nirmala Sitharaman will need to address in formulating the upcoming Budget, set to be presented on February 1, will be reviving a real-estate sector that has been suffering from not just a liquidity crunch, but a demand-side crisis as well.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X