For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, హోంలోన్, పన్ను భారం తగ్గింపు: బడ్జెట్‌లో ఏం కోరుకుంటున్నారు?

|

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. మందగమనం నేపథ్యంలోని బడ్జెట్ వైపు వివిధ పారిశ్రామిక రంగాలు, సామాన్యులు, వేతన జీవులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వం ఆదాయం తగ్గుతుండటంతో ఈసారి సగటు జీవి అంతలా ఆశలు పెట్టుకోవద్దనేది ఆర్థిక నిపుణుల సలహా. ఆర్థిక వృద్ధిని పట్టాలెక్కించే ప్రోత్సాహకాల వైపే ఆమె ఎక్కువగా దృష్టి సారిస్తారని చెబుతున్నారు.

బడ్జెట్‌కు సంబంధించిన మరిన్ని కథనాలు..

పన్ను సంబంధిత అంశాలు

పన్ను సంబంధిత అంశాలు

GSTNలో సాంకేతిక సమస్యల కారణంగా వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి నిధులు పెంచాలని కోరుతున్నారు. మందగమనం నేపథ్యంలో పీఎం కిసాన్ వంటి సంక్షేమ పథకాలకు నిధులు పెంచి ప్రజల చేతుల్లో డబ్బులు ఉండేలా చేయాలని సూచిస్తున్నారు. అప్పుడు వినియోగం, డిమాండ్ పెరగవచ్చునని అంటున్నారు. ఇక ఆదాయపు పన్ను స్లాబ్ రేటు, మినహాయింపులపై కూడా వేతనజీవులు ఆశతో ఉన్నారు. కానీ ఈ ఊరట ఉండకపోవచ్చునని అంటున్నారు.

జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులు

జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులు

పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలనే డిమాండ్ ఎప్పటి నుండో ఉంది. అయిదేళ్లలో వీటిని జీఎస్టీ పరిధిలోకి తేవాలని కేంద్రం భావించింది. ఈ బడ్జెట్ నుంచి అడుగులు పడాలని కోరుకుంటున్నారు. పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి వస్తే సామాన్యుడిపై భారం తగ్గుతుంది.

రియల్ రంగానికి ఊరట

రియల్ రంగానికి ఊరట

స్టాంప్ డ్యూటీని జీఎస్టీ విధానంలోకి తీసుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఉంది. రియల్ ఎస్టేట్ రంగంపై వివిధ రకాల పన్ను భారాలు ఉన్నాయి. వీటిని జీఎస్టీ విధానంలోకి తెస్తే.. సామాన్యుడిపై భారం తగ్గి, రియల్ ఎస్టేట్ రంగం మరింత పుంజుకోవచ్చునని చెబుతున్నారు.

ఆదాయపు పన్ను పరిమితి

ఆదాయపు పన్ను పరిమితి

రూ.5 లక్షల లోపు ఆదాయం ఉంటే ఎలాంటి పన్నులు విధించవద్దని, స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని మరింత పెంచాలని సామాన్యులు కోరుతున్నారు. 80సీ కింద ఇచ్చే పన్ను మినహాయింపు ఆదాయాన్ని కూడా పెంచాలని కోరుతున్నారు. ఆదాయపు పన్ను పరిమితిని రూ.7 లక్షలకు పెంచాలనే వాదనలు కూడా ఉన్నాయి.

English summary

జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, హోంలోన్, పన్ను భారం తగ్గింపు: బడ్జెట్‌లో ఏం కోరుకుంటున్నారు? | What common man expecting from FM's Budget 2020

With the Budget 2020 round the corner, the common man would be eagerly awaiting fiscal recommendations by the government that would help in planning his tax matters efficiently in the coming year
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X