కేంద్ర బడ్జెట్ యాప్, ఆ తర్వాతే అందుబాటులో డాక్యుమెంట్స్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్‍ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందు సంప్రదాయంగా జరిగే హల్వా వేడుకను శనివారం నిర్వహించారు. కరోనా కారణంగా ఈసారి పేపర్‌లెస్ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. మొదటిసారి బడ్జెట్ పత్రాలను ముద్రించడంలేదు. పేపర్-లెస్ బడ్జెట్ నేపథ్యంలో సులభంగా, త్వరగా బడ్జెట్ సమాచారం అందించేందుకు వీలుగా యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్‌ను లాంచ్ చేశారు నిర్మలమ్మ.
డౌన్‌లోడ్, ప్రింటింగ్, సెర్చ్, జూమ్ ఇన్ అండ్ ఔట్, బైడైరెక్షనల్ స్క్రోలింగ్, విషయ పట్టిక, ఇతర లింక్స్ యాక్సెస్ తదితర అంశాలతో యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌తో రూపొందించారు. ఇది ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింట్లో అందుబాటులో ఉంటుంది.

గతంలో కూడా బడ్జెట్ పత్రాలు వెబ్ సైట్ ద్వారా పొందే వీలు ఉంది. కానీ ఈసారి దానిని మరింత సులభతరం చేస్తూ మరిన్ని ఫీచర్స్ జోడిస్తూ, యాప్ తీసుకు వచ్చారు. ఈ యాప్‌ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) రూపొందించింది. బడ్జెట్‌కు సంబంధించి నిర్మల ప్రసంగం, వార్షిక నివేదిక, ఆర్థిక బిల్లు ఇలా పద్నాలుగు రకాల బడ్జెట్ పత్రాలు ఈ యాప్‌లో ఉంటాయి. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ పత్రాలు అందుబాటులో ఉంటాయి. మొబైల్‌లో బడ్జెట్ పత్రాలు చసుకోవచ్చు. అలాగే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రింట్ కూడా చేసుకునే వెసులుబాటు ఉంది.
జూమ్ ఇన్, జూమ్ ఔట్ ఫీచర్స్ ద్వారా ఈజీగా చదువుకోవచ్చు. బడ్జెట్‌లో మనకు కావాల్సిన సమాచారం కోసం సెర్చ్ చేసే వెసులుబాటు కల్పించారు.బడ్జెట్‌లో భాగంగా ఉదహరించిన ఇతర లింక్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ వినియోగదారులు బడ్జెట్ వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఫిబ్రవరి 1 నుండి ఆర్థికమంత్రి ప్రసంగం పూర్తయ్యాక యాప్‌లో బడ్జెట్ పత్రాలు అందుబాటులో ఉంటాయి.