For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆదాయపు పన్ను పెళ్లైతే రూ.2000, సింగిల్ ఐతే రూ.1,000... ఆసక్తికర ట్యాక్స్ విశేషాలు!

|

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. వేతన జీవులు, సామాన్యులు ఆదాయపు పన్ను స్లాబ్స్‌లో ఏమైనా మార్పు ఉంటుందని అని ఎదురు చూస్తున్నారు. ఆర్థికమందగమనం నేపథ్యంలో మరో నాలుగైదు రోజుల్లో 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పెట్టనున్న ఈ బడ్జెట్ పైన అందరి కళ్లు ఉన్నాయి.

బడ్జెట్‌కు సంబంధించి మరిన్ని కథనాలు

ఆదాయపు పన్ను 5 అణాల నుంచి

ఆదాయపు పన్ను 5 అణాల నుంచి

ఆదాయపు పన్ను పరిమితులు, మినహాయింపులు ఇప్పుడు వేలు, లక్షల్లో ఉన్నాయి. కానీ 1950లో బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడు ఆదాయపు పన్నును 5 అణాల నుంచి 4 అణాలకు తగ్గించిన విషయం తెలుసా? వెల్త్ ట్యాక్స్‌ను తీసుకు వచ్చింది కూడా అప్పుడే.

హిందీలో బడ్జెట్ పత్రాలు

హిందీలో బడ్జెట్ పత్రాలు

1955-56 సంవత్సరానికి గాను నాటి ఆర్థిక మంత్రి సీడీ దేశ్‌ముఖ్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. అప్పుడు మొదటిసారి బడ్జెట్ పత్రాలను హిందీలో అందరికీ పంచారు. ఆయన బడ్జెట్ పత్రాలను చదివారు.

పెళ్లైన వారికి రూ.2,000 మినహాయింపు, పెళ్లి కాకుంటే రూ.1,500

పెళ్లైన వారికి రూ.2,000 మినహాయింపు, పెళ్లి కాకుంటే రూ.1,500

ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. కమిషన్ రికమెండేషన్ ప్రకారం పెళ్లైన వారికి ప్రస్తుతం రూ.1,500గా ఉన్న పన్ను మినహాయింపును రూ.2,000కు పెంచుతున్నామని, అలాగే పెళ్లి కాని వారికి రూ.1,000 తగ్గిస్తున్నామని సీడీ దేశ్‌ముఖ్ పేర్కొన్నారు.

1955-56లో పెళ్లైన ఇండివిడ్యువల్స్‌కు వారికి ఆదాయపు పన్ను స్లాబ్స్..

1955-56లో పెళ్లైన ఇండివిడ్యువల్స్‌కు వారికి ఆదాయపు పన్ను స్లాబ్స్..

- రూ.0 నుండి రూ. 2,000 Tax Slab - ఆదాయపు పన్ను లేదు

- రూ.2,001 నుండి రూ.5,000 Tax Slab - రూపాయిలో 9 పైసలు

- రూ.5,001 నుండి 7,500 Tax Slab - రూపాయిలో ఒక అణా తొమ్మిది పైసలు

- రూ.7,501 నుండి రూ.10,000 Tax Slab - రూపాయిలో రెండు అణాల మూడు పైసలు

- రూ.10,001 నుండి రూ.15,000 Tax Slab - రూపాయిలో మూడు అణాల మూడు పైసలు

- రూ.15,001 అంతకుమించి - రూపాయిలో 4 అణాలు.

1955-56లో పెళ్లి కాని ఇండివిడ్యువల్స్‌కు ఆదాయపు పన్ను స్లాబ్స్..

1955-56లో పెళ్లి కాని ఇండివిడ్యువల్స్‌కు ఆదాయపు పన్ను స్లాబ్స్..

- రూ.0 నుండి 1,000 - ఆదాయపు పన్ను లేదు

- రూ.1,001 నుండి 5,000 - రూపాయిలో 9 పైసలు

- రూ.5,001 నుండి రూ.7,500 - రూపాయిలో ఒక అణా పైస

- రూ.7,501 నుండి 10,000 - రూపాయిలో 2 అణాల 3 పైసలు

- రూ.10,001 నుండి రూ.15,000 Tax Slab - రూపాయిలో మూడు అణాల మూడు పైసలు

- రూ.15,001 అంతకుమించి - రూపాయిలో 4 అణాలు

English summary

ఆదాయపు పన్ను పెళ్లైతే రూ.2000, సింగిల్ ఐతే రూ.1,000... ఆసక్తికర ట్యాక్స్ విశేషాలు! | This Budget introduced different tax slabs for married and single Indians

Union Budget 2020 is just five days away and people are expecting income tax slab changes. Over the years, finance ministers have proposed several income tax changes in Union Budget.
Story first published: Monday, January 27, 2020, 15:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X